(Source: ECI/ABP News/ABP Majha)
Nindu Noorella Saavasam Serial February 3rd - 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: పిల్లలకి ఘోరమైన పనిష్మెంట్ ఇచ్చిన అమర్, ఇంటి కోడలికి అవార్డు వచ్చిందంటూ షాకిచ్చిన రాథోడ్
Nindu Noorella Saavasam Serial Today Episode: ఈ ఇంటి కోడలికి అవార్డు వచ్చిందని రాథోడ్ చెప్పటంతో ఆ కోడలు ఎవరా అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.
Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో మీ మావయ్య ఎంత మంచి వాడిగా మారినప్పటికీ అంకుల్ అలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోను అంటుంది భాగి ఫ్రెండ్.
భాగి: నేను అవన్నీ ఆలోచించే పరిస్థితులలో లేను. మా నాన్న కోరిక నేను పెళ్లి చేసుకోవడం అయితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను ఇంకేమీ ఆలోచించను అని ఏడుస్తూ చెప్తుంది.
అప్పుడే సిస్టర్ వచ్చి పేషెంట్ ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పటంతో భాగి ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
కాళీ: తను చెప్పినా భాగీ ఈ పెళ్లి చేసుకుంటాను అన్నదంటే ఇంక నా పెళ్లి ని ఎవరు ఆపలేరు అని అక్కతో చెప్పి ఆనందపడతాడు.
మరోవైపు పిల్లలు ఇంకా ఇంటికి రాకపోవటంతో అమర్ తల్లిదండ్రులు ఆందోళన పడతారు.
మరోవైపు గదిలో కూర్చున్న మనోహరితో అయ్యగారు బయటకు వెళ్లారు మళ్ళీ వచ్చి ఆయన గదిలోకి వెళ్లిపోయారు ఏం జరిగి ఉంటుంది అంటుంది నీల.
మనోహరి : వెళ్లి అడుగు ఇప్పుడు ఉన్న కోపంలో ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే కంటి చూపుతోనే కాల్చేస్తాడు అంటుంది.
మరోవైపు పిల్లలు భయపడుతూనే ఇంట్లో అడుగు పెడతారు.
అంజు: డాడీ తో నేను మాట్లాడుతాను మీరు ఎవరు మాట్లాడకండి అని చెప్పి కామ్ గా ఇంట్లోకి వస్తారు.
అమర్ తల్లిదండ్రులు: ఎక్కడికి వెళ్లారు అని అడుగుతారు.
ఇంతలో మనోహరి వచ్చి స్కూల్లో అబద్ధం చెప్పి బయటకు వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చింది, అసలు ఎక్కడికి వెళ్లారు అని నిలదీస్తుంది.
అరుంధతి: అసలే వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళని అలా భయపెట్టకు మెల్లగా అడుగు అంటుంది. అయితే యధావిధిగా ఆమె మాటలు ఎవరికీ వినిపించవు.
పిల్లలు: మేము మా డాడీ తో మాట్లాడుతాం అంటారు.
అమర్: అప్పుడే కిందికి వస్తూ ఏం మాట్లాడుతారు, అబద్ధం చెప్పి స్కూల్ నుంచి ఎలా బయటపడ్డారో చెప్తారా అంటూ కోపంగా ప్రశ్నిస్తాడు.
పిల్లలు: ఇప్పుడున్న కోపంలో తాతయ్యని చూడడానికి వెళ్ళామని చెప్తే అక్కడ ఉన్న మిస్సమ్మని కూడా తిడతారు. అందుకే ఏమి సమాధానం చెప్పకూడదు అనుకుంటారు.
అమర్ : నిజం చెప్పండి ఎక్కడికి వెళ్లారు అసలు మీకు ఈ అలవాటు ఎలా అయింది అంటాడు.
మనోహరి : ఇంకెక్కడ అలవాటవుతుంది మన ఇంట్లో అబద్దాలు చెప్పేది, మోసాలు చేసేది ఆ మిస్సమ్మ ఒక్కతే వుంది. తనను చూసే వీళ్ళు ఇలా తయారయ్యారు. ఎంత డిసిప్లిన్ గా ఉండేవారు ఆఖరికి ఇలా తయారయ్యారు అని రెచ్చగొడుతుంది.
అమర్ తల్లిదండ్రులు మనోహరిని మందలిస్తూ పిల్లలని, మిస్సమ్మని వెనకేసుకుని వస్తారు.
అమర్: పిల్లల్ని వెనకేసుకొరావద్దని తల్లిదండ్రులని కోప్పడతాడు. అతిగారాభం పిల్లల్ని పాడు చేస్తుందని మరొకసారి రుజువయింది అంటూ పిల్లలు ఎంతకీ నోరు విప్పక పోవటంతో మీరు మాట్లాడటం లేదు కదా అయితే ఇంట్లో వాళ్ళు ఎవరూ మీతో మాట్లాడరు. మీకు ఫుడ్ పెట్టరు ఇదే మీకు పనిష్మెంట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కానీ అమర్ మాట కాదనలేక పిల్లలు పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడనుంచి వెళ్ళిపోతారు.
మనోహరి: ఇకమీదట మీ కష్టాన్ని వినేది, బాగోగులు చూసేది నేను మాత్రమే నన్ను దాటి మీ డాడీ దగ్గరికి మీరు వెళ్ళలేరు అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది.
ఆ రాత్రి పిల్లలు ఆకలితోనే ఉంటారు. మరుసటి రోజు పేపర్ చూసిన రాథోడ్ ఆనందంగా ఇంట్లోకి వెళ్లి అందరిని పిలుస్తాడు. ఏమైంది ఎందుకలా అరుస్తున్నావ్ అంటుంది మనోహరి.
అమర్ తల్లిదండ్రులతో పాటు అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ కూడా ఏమైంది అని అడుగుతాడు.
రాథోడ్: ఈ ఇంటి కోడలికి బెస్ట్ ఆర్జె అవార్డు వచ్చింది అని ఆనందంగా చెప్తాడు.
మనోహరి : ఈ ఇంటి కోడలు ఏంటి అని చికాగ్గా అడుగుతుంది.
రాథోడ్ : అరుంధతి అమ్మగారు భాగమతిని చెల్లి అని పిలిచేవారు అంటే ఈ ఇంటి కోడలనే కదా అర్థం అంటాడు.
నా చెల్లెలికి అవార్డు వచ్చింది అని ఆనందపడుతుంది అరుంధతి.
మనోహరి : రాథోడ్ చేతిలో పేపర్ చూస్తూ ఇప్పుడు భాగమతి ఫోటో పేపర్లో వేసాడేమో, అమర్ చూసాడంటే మిస్సమ్మ, భాగమతి ఇద్దరు ఒకరే అని తెలిసిపోతుంది అని కంగారు పడిపోతుంది. రాథోడ్ దగ్గర పేపర్ తీసుకోవాలనుకుంటుంది. అంతలోనే అమర్ రాథోడ్ దగ్గర పేపర్ తీసుకొని ఓపెన్ చేస్తూ ఉంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: పూనమ్ పాండే నటించిన ఏకైక తెలుగు సినిమా ఇదే!