అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial February 10th: భాగిని కిడ్నాప్ చేయించిన మనోహరి.. ప్రమాదాన్ని పసిగట్టిన అరుంధతి!

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ ప్రమాదంలో ఉందని అరుంధతి గమనించడంతో కధలో కీలక మలుపులు ఏర్పడతాయి.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో అమర్ బాధలో ఉంటే ఇప్పుడు ఫంక్షన్ కి పిలుస్తావేంటి అని రాథోడ్ మీద కోప్పడుతుంది మనోహరి.

అమర్ తండ్రి: ఎవడో వెధవ ఏదో అన్నాడని మనం బాధపడుతూ కూర్చుంటామా వాడి సంస్కారం అంతే అని వదిలేయడమే అని మనోహరితో చెప్పి కొడుకుని ఫంక్షన్ కి బయలుదేరమంటాడు. భాగీ ఎప్పుడైనా ఇంటికి రావచ్చు అని చెప్పు అని కొడుకుతో చెప్తాడు.

సరే అని బయలుదేరబోతున్న అమర్ ని ఒక నిమిషం ఆగమంటుంది మనోహరి.

అరుంధతి: ఏంటి నీ ప్రాబ్లం మనోహరి, అసలు ఎందుకు భాగిని చూడటానికి ఆయనని వెళ్ళటం లేదు అని అంటుంది.

మనోహరి పిలుపుతో ఆగిన అమర్ తో నేను కూడా మీతో ఫంక్షన్ కి వస్తాను అరుంధతికి అంతగా నచ్చిన అమ్మాయిని నేను చూస్తాను అంటుంది. అందుకు ఒప్పుకుంటాడుఅమర్. ఒక్క నిమిషం ఫోన్ తీసుకుని వస్తాను అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లి ఎవరికో ఫోన్ చేసి తిరిగి వస్తుంది. కారులో కూర్చుంటూ తన పక్క సీట్ వైపు చూస్తుంది.

అరుంధతి: తననే తీక్షణం గా చూస్తున్నట్లు గమనించి పక్కన నేను ఉన్నట్లే చూస్తుందేమిటి అని అనుమాన పడుతుంది.

మనోహరి : భాగిని చూడ్డానికి వెళుతున్నామంటే ఆనందంగా నువ్వు కూడా మాతోపాటు వస్తావని నాకు తెలుసు అని నవ్వుకుంటుంది.

ఆ తర్వాత కారులో వెళ్తూ తన గదిలో జరిగిన దానిని తలుచుకుంటుంది.

మంగళ: మీకు చాలా సేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అని జరిగిందంతా చెప్పి అందుకే భాగిని ఫంక్షన్ కి పంపించాను అని చెప్తుంది.

మనోహరి : కోపంతో సరేలే వాళ్ళిద్దరూ కలవకుండా ఏదో ఒకటి నేనే చేస్తాను అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. చాలాసేపు ఏం చేయాలో ఆలోచించిన తర్వాత అరుంధతిని చంపిన కిల్లర్ కి ఫోన్ చేసి భాగిని కిడ్నాప్ చేయాలని చెప్తుంది.

కిల్లర్: ముందు డబ్బు ఇవ్వలేదుముందు అది సెటిల్ చేయండి అంటాడు.

మనోహరి: ముందు ఈ పని చేసి పెట్టు అమౌంట్ మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాను అని చెప్పి మిస్సమ్మ వాళ్ళ ఫోటోలు సెండ్ చేస్తుంది.

మరోవైపు బైక్ బాగు చేస్తున్నట్లు నటిస్తున్న కాళీ కి మంగళ ఫోన్ చేస్తుంది. కాళీ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని మాట్లాడుతుంది భాగి.

భాగి: నాన్నకి ఎలా ఉంది పిన్ని, ఇప్పుడే బయలుదేరుతున్నాము అని చెప్తుంది.

మంగళ: రావద్దని చెప్పటానికే ఫోన్ చేశాను మీ నాన్న ఇప్పుడు బాగానే ఉన్నారు. డాక్టర్లు ఆయనని ఆనందంగా ఉండేలా చూసుకోమని చెప్పారు. అందుకే నువ్వు అవార్డు తీసుకొని రా అని చెప్తుంది.

మిస్సమ్మ: నాన్న పెళ్లి గురించి ఏదో చెప్పబోయారు అంటుంది.

మంగళ: నాకు చెప్పారమ్మ, పెళ్లి సమయానికి నా ఆరోగ్యం సహకరించకపోతే నువ్వే కాళ్లు కడిగి కన్యాదానం చేయాలని చెప్పారు, పెళ్లిలో ఏ లోటు రాకూడదని చెప్పారు అని అబద్ధం చెప్తుంది.

అలా చెప్పారా అని బాధపడుతూ ఫోన్ కాళీకి ఇచ్చేస్తుంది. ఇద్దరు బైక్ మీద వెళుతుంటే కిడ్నాపర్లు అడ్డుకుంటారు. కాళీ వాళ్ళని ఎదిరించాలనుకుంటాడు కానీ వాళ్ళ చేతిలో ఉన్న కత్తిని చూసి పారిపోతాడు.

భాగి వాళ్ల నుంచి తప్పించుకోవటానికి పెనుగులాడుతుంది అప్పుడే ఆమె గాజులు పగిలిపోతాయి. అదే సమయంలో అటువైపుగా అమర్ వాళ్ళ కారు వస్తుంది. సడన్గా అమర్ కారు ఆపమంటాడు. కారు ఆగిన తర్వాత కిందికి దిగి వస్తాడు. అక్కడ పగిలిపోయిన గాజులు, పడిపోయిన బండిని చూసి ఇక్కడ ఏదో జరిగింది చుట్టుపక్కల వెళ్లి వెతుకు అని రాథోడ్ కి చెప్తాడు.

అప్పటికే భాగి నోరు నొక్కి పక్క గదిలోకి తీసుకొని పోతాడు కిడ్నాపర్. అది గమనించిన మనోహరి అమర్ చూసేస్తాడేమో అని కంగారు పడిపోతూ ఉంటుంది.

అమర్ వాళ్ళు కిందికి దిగి బండి దగ్గర చెక్ చేయటాన్ని కిల్లర్ చూస్తాడు. వాళ్ళకి అనుమానం వచ్చినట్లుగా ఉంది నువ్వు వెళ్లి మేనేజ్ చెయ్యు అని పక్కనున్న వాడికి చెప్తాడు.

రూమ్ నుంచి బయటకు వచ్చిన వాడు నా బైక్ ఇలా పడిపోయింది ఏంటి అని పైకి లేపుతాడు. అమర్ గాజులు సంగతి ఏంటి అని అడిగితే మా ఆవిడమే పగిలిపోయినట్లుగా ఉన్నాయి అని అమర్ కి ఎలాంటి డౌటు రాకుండా మేనేజ్ చేస్తాడు.

అమర్ వాళ్ళు అక్కడినుంచి వెళ్ళిపోవడానికి కారు ఎక్కుతారు సరిగ్గా అప్పుడే అరుంధతి కిటికీలోంచి మిస్సమ్మ కిడ్నాపర్ చేతిలో గించుకోవడం చూస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Embed widget