Nindu Noorella Saavasam December 6th Episode: నోరు జారిన మనోహరిపై విజృంభించిన అరుంధతి.. ప్రాణాపాయ స్థితిలో అంజలీ!
Nindu Noorella Saavasam Today Episode: చిత్రగుప్తుడి మాటని కాదని అరుంధతి ప్రమాదాన్ని ఆహ్వానించడంతో ఘోర చేతికి చిక్కుతుందేమో అనే ఉత్కంఠత కధ లో ఏర్పడుతుంది.
Nindu Noorella Saavasam December 6th Episode: ఈరోజు ఎపిసోడ్ లో చిత్రగుప్తుడిని మీ ఊరు ఏది అని రాథోడ్ అడగడంతో యమపురి అంటాడు చిత్రగుప్తుడు. పానీ పూరి ఏం కాదు అంటూ వాగ్వాదానికి దిగుతాడు రాథోడ్.
ఇంతలోనే మిస్సమ్మ పరిగెట్టుకుంటూ వచ్చి అంజు పాపని లేపితే లేవటం లేదు, తన శరీరం కూడా చల్లబడిపోయింది నాకు కంగారుగా ఉంది త్వరగా రండి అని రాథోడ్ కి చెప్తుంది.
రాథోడ్: ఈ విషయం సార్ కి చెప్పావా
మిస్సమ్మ: లేదు, ఆయనకి చెబుదామని వెళ్తే దారిలో మీరు కనబడ్డారు అందుకే మీకు చెప్పడానికి వచ్చాను.
మిస్సమ్మ, రాథోడ్ ఇద్దరు కంగారుగా అమర్ కి విషయం చెప్పటానికి పరిగెడతారు. అప్పటికే అరుంధతి పరుగు పరుగున అంజు దగ్గరికి వెళుతుంది.
చిత్రగుప్తుడు : పాపం పిల్ల పిచ్చుకకు ఏమైందో భగవంతుడా తలరాతను కూడా మార్చేస్తున్నావా..
అరుంధతి అంజుని చూసి ఏడుస్తుంది. ఇంట్లో అందరినీ పిలుస్తుంది, గోల గోల చేస్తుంది కానీ తన గోల ఎవరికి వినబడదు.
నీల పరిగెత్తుకుంటూ వెళ్లి మనోహరితో అంజు విషయం చెప్తుంది.
మనోహరి : ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా తప్పించుకోవడానికి వేషాలు వేస్తున్నట్లుగా ఉంది. నేనంటే దానికి అసలు లెక్కలేదు, మంచి పని అయింది.
నీల : అదేంటమ్మా అలా అంటారు తను చిన్నపిల్ల, అయినా తను మీ ఫ్రెండ్ కూతురే కదా మీకు కూడా ఒక బిడ్డ ఉంటే ఆ బాధ తెలిసేది.
మనోహరి: ఆ మాటలకి కోపంతో ఊగిపోతుంది. నీల పీక పట్టుకొని ఇంకొకసారి కాళ్ళకి మెట్టెలు, కడుపున బిడ్డలు అని మాట్లాడావంటే ఇక్కడే చంపి పాతేస్తాను అని వైలెంట్ గా మారిపోతుంది. తర్వాత నీల క్షమించమని చెప్పటంతో ఆమెని వదిలేస్తుంది.
నీల: బయటికి వచ్చిన తరువాత ఆయాస పడుతూ ఈమెకి గతంలో పెళ్లయిందా, బిడ్డ కూడా ఉందా అయినా ఈమె గతం ఏమిటో అని అనుకుంటుంది.
మనోహరి అంజూని చూడటానికి వెళుతుంది.
అరుంధతి: మనోహరి ఏదైనా చెయ్యు కాపాడు అని రిక్వెస్ట్ చేస్తుంది.
మనోహరి : అంజుని చూస్తూ ఎగ్జామ్ ఎగొట్టడానికి ఇలా చేస్తుందా.. నిజంగానే ఒంట్లో బాగోలేదా అని ఒంటిపై చేయి వేస్తుంది. అంజు బాడీ చల్లగా తగలడంతో కొంపదీసి ఇది కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లిపోయిందా అంటుంది.
అరుంధతి: కోపంగా మనోహరిపై కేక వేస్తుంది.
మనిషి కనిపించకపోయినా ఆ కోపం మనోహరి ఫీలవుతుంది... భయంతో వణికిపోతుంది.
అంతలోనే మిస్సమ్మ వాళ్లు అమరేంద్రతో పాటు ఇంట్లో వాళ్ళందరినీ తీసుకురావడంతో అందరూ అంజు చుట్టూ చేరి కంగారు పడుతూ ఉంటారు.
మిస్సమ్మ : రాత్రి బానే ఉంది మధ్య రాత్రిలో వాటర్ అడిగింది పొద్దున్నే లేచి చూసేసరికి ఇలా అయిపోయింది అని ఏడుస్తుంది.
మనోహరి : మిస్సమ్మ ఇరికించడానికి ఇదే మంచి సమయం అనుకొని చూసుకోవాలి కదా, పిల్లల్ని పెంచడం రాకపోతే ఇంట్లోంచి వెళ్ళిపో అని కేకలు వేస్తుంది.
ఇందులో మిస్సమ్మ తప్పేమీ లేదు అని రాథోడ్, అమరేంద్ర తల్లిదండ్రులు మనోహరికి చెప్తారు. ఇంక ఆపండి అని కోపంగా అంటాడు అమర్. రాథోడ్ తో కార్ తీయమని చెప్పి అంజుని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తారు అమర్, మిస్సమ్మ, మనోహరి.
ఆ వెనుక అరుంధతి కూడా వెళ్తూ ఉంటే చిత్రగుప్తుడు ఆపుతాడు. బయటికి వెళ్తే ఆ ఘోర నిన్ను పట్టుకుంటాడు ప్రమాదంలో పడతావు అని హెచ్చరిస్తాడు. నాకు ఏమైనా పర్వాలేదు అని ఇల్లు దాటి బయటకు వెళ్తుంది అరుంధతి.
మరోవైపు రామ్మూర్తి ఇంట్లోంచి బయటికి వెళ్తూ గుండె పట్టుకొని కూర్చుంటాడు.
రామ్మూర్తి బావమరిది : గుండె నొప్పి వచ్చినట్లుగా ఉంది ఇప్పుడు ఈ గుండె నొప్పి తగ్గించాలంటే ఆయనకు కిడ్నీ అమ్మినా డబ్బులు చాలవు.
రామ్మూర్తి: కోప్పడుతూ నోట్లోంచి మంచి మాటలు రావేం? అంటూ నాకు గుండెనొప్పి రాలేదు నా వాళ్ళకి ఎవరికో ఏదో అయినట్లుగా అనిపిస్తుంది అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మీ బావ ఎక్కడికి వెళ్తున్నాడో వెళ్లి కనుక్కో అని తమ్ముడికి పురమాయిస్తుంది రామ్మూర్తి భార్య.
మరోవైపు అమర్ వాళ్ళ కారు వెనక పరిగెడుతూ ఉంటుంది అరుంధతి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.