Nindu Noorella Saavasam December 26 Episode:'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్: నిజం తెలిసి స్పృహ తప్పి పడిపోయిన నీల, అమర్ హంతకుడిని పట్టుకుంటాడా!?
Nindu Noorella Saavasam Today Episode: హంతకుడి అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్లిన అమర్, రాథోడ్ లని చూసి తప్పించుకోవాలని చూస్తాడు హంతకుడు. అతడిని వెంబడిస్తారు అమర్, రాథోడ్.
Nindu Noorella Saavasam Today Episode: రాథోడ్ హంతకుడు ఎక్కడ ఉన్నాడు చెప్పటంతో పట్టుకోవడానికి బయలుదేరుతారు అమర్ వాళ్ళు. ఇదంతా విన్న నీల మనోహరి కి విషయం చెప్పటానికి వెళ్తుంది.
నీల: టీ తీసుకొని మనోహరి దగ్గరికి వస్తుంది. ఆలోచనలో ఉన్న మనోహరి దగ్గర్నుంచి ఎలాగైనా నిజం తెలుసుకోవాలి అనుకొని అమ్మగారు టీ తీసుకు వచ్చాను అంటుంది.
మనోహరి: నేను తీసుకు రమ్మన్నానా అని కోపంగా అడుగుతుంది.
నీల: కాదమ్మా.. మీరు వెళ్లేటప్పుడు బానే ఉన్నారు కానీ వచ్చేటప్పుడు అదోలా ఉన్నారు ఏమైందో అని అంటుంది నీల.
మనోహరి: కోపంతో ఊగిపోతూ తెలుసుకొని ఏం చేస్తావు ఏమైనా చేయగలవా అని ఆవేశంగా నీల మీదకి వెళుతుంది.
నీల : నేనేమీ చేయలేనమ్మ కానీ మీ మనసులో భారం తగ్గుతుంది కదా అంటుంది.
మనోహరి : భాగీ ఎవరనుకున్నావు భాగమతి ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమైన ఆర్జే భాగీ.ఈ మిస్సమ్మే ఆ భాగీ అని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఎవరు ఆమెని వదిలిపెట్టరు. అలాగే అరుంధతికి ఈమె సొంత చెల్లెలు అని చెప్తుంది.
ఈ మాటలు విన్న నీల స్పృహ తప్పి పడిపోతుంది. ఆమె మీద నీళ్లు చిలకరించి స్పృహ వచ్చేలా చేస్తుంది మనోహరి. ఈ నిజం ఎప్పటికీ ఎవరికీ తెలియకూడదు అని నీలకి చెప్తుంది.
నీల: మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అంటూ హంతకుడి విషయం చెప్తుంది. నువ్వు చెప్తుంది నిజమా అంటూ కంగారు పడిపోతుంది మనోహరి.
మరోవైపు కాళీ, మంగళ మాట్లాడుకుంటూ ఉంటారు.
కాళీ : నేను వెళ్ళిన పని సక్సెస్ అయింది. నువ్వు వెళ్లిన పని ఏమైంది అని అడుగుతాడు.
మంగళ: ఆ మనోహరి ప్రపంచానికి తెలియని ఏదో నిజం దాస్తుంది, అదేంటో తెలుసుకుంటే మనం మరింత డబ్బు లాగవచ్చు అన్నింటికన్నా ముందు నీకు భాగికి పెళ్లి చేయాలి అంటుంది.
మరోవైపు ఆలోచనలో ఉన్న రామ్మూర్తి దగ్గరికి వచ్చిన పిల్లలు తమతో పాటు భోజనానికి రమ్మంటారు. వద్దు మేడం చూస్తే తిడతారు అని చెప్పి పిల్లల్ని భోజనానికి పంపించేస్తాడు రామ్మూర్తి. ఇంతలోనే మిస్సమ్మ ఫోన్ చేస్తుంది. అక్కడే ఉన్న పిల్లలు మేము కూడా మాట్లాడతాము అని ఫోన్ తీసుకొని నేను మాట్లాడుతాను అంటే నేను మాట్లాడుతాను అని పోట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో
రామ్మూర్తి: ఈ పిల్లలు భాగి తో మాట్లాడితే నేను ఇక్కడ పని చేస్తున్నట్లు చెప్పేస్తారు అనుకొని పిల్లల దగ్గర ఫోన్ తీసుకుని పిల్లల్ని భోజనానికి పంపించేస్తాడు. ఆ తర్వాత భోజనాలు చేస్తూ ఉన్న పిల్లల దగ్గరికి ఒక పిల్లవాడు వచ్చి రాబోయే స్కూల్ ఎలక్షన్స్ లో నాకే ఓటేయాలి అని దబాయించి అడుగుతాడు.
అంజు: ఓటు అడిగే పద్ధతి ఇది కాదనుకుంటాను అని పొగరుగా అడుగుతుంది.
అమ్ము : వాడికి నచ్చినట్లు వాడు అడుగుతాడు వాడితో మనకెందుకు.
పిల్లాడు : నువ్వు స్కూల్ కి కొత్తా,నేను ఇలాగే అడుగుతాను అయినా నువ్వు ఓటేయకపోతే నాకు వచ్చిన నష్టమేమీ లేదు మిగిలిన వాళ్లంతా తప్పకుండా నాకే ఓటేస్తారు అని పొగరుగా అంటాడు.
అంజు: ఇప్పటివరకు నీతో ఎవరు పోటీ చేశారో నాకు తెలీదు కానీ ఇప్పుడు ఇంకొక పేరు యాడ్ అవుతుంది. ఆ పేరు గెలిచి తీరుతుంది అంటుంది.
అమ్ము : నువ్వు ఎలక్షన్స్ లో పోటీ చేస్తావా నీకు అవసరమా అని కంగారుగా అడుగుతుంది.
అంజు: పోటీ చేసేది నేను కాదు నువ్వే అనటంతో అమ్ము షాక్ అవుతుంది.
చూసుకుందాం అని ఆ పిల్లవాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీ ఎలివేషన్ కోసం నన్ను ఎందుకు ఇరికిస్తావు అని అమ్ము కోప్పడుతుంది. నువ్వు టెన్షన్ పడకు అని అక్కకి ధైర్యం చెప్తుంది అంజు.
మరోవైపు మనోహరి కిల్లర్ కి ఫోన్ చేస్తుంది.
మనోహరి : నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా ఊరు వదిలి పారిపోలేదా అని అడుగుతుంది.
కిల్లర్ : నేను ఇక్కడే ఉన్నానని మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు.
మనోహరి : నాకే కాదు ఆ అమరేంద్ర వాళ్లకి కూడా తెలిసిపోయింది. నీకోసమే వాళ్ళు అక్కడికి వచ్చారు అతనికి భార్య మీద ఉన్న ప్రేమ వలన నిన్ను ఏం చేయడానికైనా సిద్ధపడతాడు వెంటనే పారిపో అని హెచ్చరిస్తుంది.
కిల్లర్ పారిపోదామని బయటకు వచ్చేటప్పటికి ఎదురుగా అమర్, రాథోడ్ కనిపిస్తారు. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవటానికి పరిగెడతాడు కిల్లర్. అతడిని వెంబడిస్తారు అమర్, రాథోడ్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.