అన్వేషించండి

Nindu Noorella Saavasam December 23st Episode: ఆరు ప్రవర్తన చూసి షాకైన మిస్సమ్మ.. అరుంధతి, భాగీ అక్కాచెల్లెళ్లని తెలుసుకున్న మనోహరి!

Nindu Noorella Saavasam Today Episode: భాగమతి, అరుంధతిలు ఇద్దరూ సొంత అక్క చెల్లెలు అని మనోహరి తెలుసుకోవడంతో కథలు కీలక మలుపులు ఏర్పడతాయి.

Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మా ఇంట్లో ఏం జరిగినా నీకు భలే తెలిసిపోతాయి అక్క అని అరుంధతితో అంటుంది మిస్సమ్మ.

అరుంధతి: ఏదో పక్కింట్లోనే ఉంటాను కదా నీలాంటోళ్లు చెప్తూ ఉంటే వినడమే.

మిస్సమ్మ: అయినా అక్క, నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను. ఉండేది పక్కనే అయినా ఈ ఇంటికి ఎప్పుడు వస్తూపోతూ ఉంటావు. కానీ మాట వరసకి కూడా నన్ను మీ ఇంటికి రమ్మనలేదు అని అనగా అరుంధతి ఒకేసారి నవ్వుతుంది.

అరుంధతి: ఇదే నా ఇల్లు అని ఇంటిని చూపిస్తూ అంటుంది అరుంధతి. ఆ మాటకి భాగమతి షాక్ అవుతుంది.

ఆ తర్వాత సీన్లో మనోహరి ఎక్కడికో తయారవుతూ ఉండగా నీలా అక్కడికి వస్తుంది.

నీల: అమ్మగారు వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడగకూడదు కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలని ఉంది.

మనోహరి: ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది నీలా. నేను ఏమనుకున్నా సరే అది అవ్వడం లేదు అన్నీ నాకు యాంటీ గా అవుతున్నాయి. అందుకే ఒకసారి ఘోరా ని కలిసి దీనికి కారణమేంటో తెలుసుకోవాలి. అక్కడికే బయలుదేరుతున్నాను.

నీల: అమ్మగారు అతను ఎలాంటి వాడో మనకు తెలిసిందే. నేరుగా వెళ్లి కలవడం అంటే అంత మంచి పని కాదేమో?

మనోహరి: మంచి పనులు మనం ఎప్పుడు చేసాము నీలా? సరేగాని కిందటిసారి నువ్వు ఘోరాని చూడడానికి వెళ్తున్నప్పుడు నిన్ను ఆపిన వ్యక్తి ఎవరు?

నీల: ఆ తోట మాలే ఆపాడు అని చెప్తుంది.

ఆ తర్వాత మనోహరీ అక్కడి నుంచి కారులో బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి మంగళ వస్తుంది.

మంగళ: ఈరోజు ఎలాగైనా నీతో మాట్లాడి, నీతో కలిసి, ఆ భాగమతి అంతు తేల్చాలి అని అనుకుంటుంది మంగళ.

మరోవైపు ఇది నా ఇల్లు అని అరుంధతి అనడంతో మిస్సమ్మ షాక్ అవుతుంది.

మిస్సమ్మ: అదేంటి ఈ ఇల్లు మీది అంటున్నావ్ అక్క?

అరుంధతి: అలాగన్నానా? ఈ పక్కనే కదా మాది అన్నాను అంతే. అయినా ఎప్పుడోకప్పుడు నిన్ను తీసుకెళ్తానులే మా ఇంటికి. అది సరే కానీ లెఫ్టినెంట్ గారితో ఒక గదిలో ఇరుక్కుపోయావా?

మిస్సమ్మ: అవునక్కా ఒక్కదాన్నే ఉండిపోయిన బాగుండేది. పోయి పోయి ఆ మహానుభావుడుతో ఉన్నాను.

అరుంధతి: ఆయనేమీ అలాంటివారు కాదులే అని మనసులో అనుకుంటుంది.

మిస్సమ్మ: ఆయన అలాంటివారు కాదు అనే కదు నువ్వు అనుకుంటున్నావు? నాకు తెలుసు అక్క కానీ మనం అమ్మాయిలం కదా మన జాగ్రత్తలో మనం ఉండాలి. కానీ ఏ మాటకి ఆ మాట. ఆ అమ్మాయి మాత్రం ఎంతో అదృష్టవంతురాలు అక్క

అరుంధతి: ఏ అమ్మాయి?

మిస్సమ్మ: ఆయన భార్య. ఎంత అదృష్టవంతురాలు అయితే ఈ ఇంటికి కోడలుగా, ఆయనకి భార్యగా వస్తుంది. దేశం కోసం, ఆర్మీ కోసం అంత సేవ చేసి ఇక్కడ ఒక ఫ్యామిలీ మెన్ గా భార్య చనిపోయినా కూడా రెండో పెళ్లి చేసుకోకుండా పిల్లలకు తల్లి, తండ్రి అన్నీ ఆయనే అయ్యారు. ఇంత గొప్ప ఇంటికి కోడలుగా రావడం ఆవిడ అదృష్టమో, లేకపోతే ఆ ప్రేమను పూర్తిగా పొందక ముందే చనిపోవడం ఆమె దురదృష్టమో అర్థం కావడం లేదు అని అనగా ఆ మాటలకు అరుంధతి ఏడుస్తూ ఉంటుంది.

మిస్సమ్మ: అయ్యో ఎందుకక్కా ఏడుస్తున్నావు?

అరుంధతి: ఏమీ లేదు నాకు పని ఉంది అని చెప్పి అక్కడ నుంచి ఏడుస్తూ పారిపోతుంది.

మిస్సమ్మ: ఏంటో, అక్క అప్పుడప్పుడు వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు గట్టిగా పట్టుకొని ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేయించాలి అని అనుకుంటుంది మిస్సమ్మ.

మరోవైపు ఏడుచుకుంటూ వస్తున్న అరుంధతిని చిత్రగుప్తుడు చూస్తాడు.

చిత్రగుప్తుడు: ఏమైంది బాలిక ఏడుచుచున్నావు?

అరుంధతి: గుప్తా గారు నాకు ఇంత మంచి కుటుంబం ఇచ్చారు, ఇంత మంచి భర్తని ఇచ్చారు, బంగారు లాంటి పిల్లల్ని ఇచ్చారు కానీ ఆ ప్రేమని మనస్పూర్తిగా పొందేలోగే నన్ను పై లోకానికి తీసుకెళ్లిపోయారు. దీని గురించి నేను బాధపడాలో ఆనందపడాలో తెలియడం లేదు ఎందుకు నాకు ఇలా చేశారు అని ఏడుస్తూ ఉంటుంది.

చిత్రగుప్తుడు: అయ్యో బాలిక నువ్వలా ఏడుచుచుంటే నా మనసు నొచ్చుకుంటుంది అని అంటాడు.

మరోవైపు మనోహరి కారులో ఘోర దగ్గరికి వెళ్తూ ఉండగా దారిలో మంగళ ఆపుతుంది. మంగలోని చూసిన మనోహరి తనని గుర్తు పడుతుంది.

మనోహరి: నువ్వు ఆ రోజు ఇంటి దగ్గరికి వచ్చావు కదా మీ తమ్ముడు తో. అమర్ దగ్గర ఇద్దరు తిట్లు తిన్నారు కదా! ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? డబ్బులు కావాలంటే చెప్పు సాయంత్రం  ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. నాకు అర్జెంటు పని ఉంది అని చెప్పి కార్ ఎక్కబోతుంది.

మంగళ: భాగమతి, అరుంధతి అని అంటుంది. ఆ మాటలు విన్న మనోహరీ ఒకేసారి ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది.

మనోహరి: భాగమతి నీకెలా తెలుసు?

మంగళ: అది నేను కనలేని నా కూతురు, నా సవితి కూతురు. నా మొగుడికి ఒంట్లో బాలేక పోతే అదేదో హాస్పటల్లో చేర్చడం కోసం సంతకం కొరకు ఆ ఇంటికి వచ్చి అతుక్కుంది. తనని కలవడానికి ఆరోజు ఇంటికి వచ్చాను, పని కోసం కాదు.

మనోహరి: మరి అరుంధతి అన్న పేరు ఎందుకు చెప్పావు?

మంగళ: ఎందుకంటే భాగమతి, అరుంధతిలు ఇద్దరూ నా సవితికి పుట్టిన తోబుట్టువులు కాబట్టి అని అనగానే అక్కడికక్కడే రోడ్డుమీద కుప్పు కూలిపోతుంది మనోహరి.

మనోహరి: లేదు అలా జరగడానికి వీల్లేదు అరుంధతి ఒక అనాధ తన గురించి నాకు తెలుసు

మంగళ: మనకి నచ్చనివి ఎప్పుడూ అబద్ధాలు అయితేనే బాగుండు అని అనుకుంటాము, కానీ అవే పచ్చి నిజాలు.

మనోహరి: అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు?

మంగళ: ఆ భాగమతిని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను కానీ వాళ్ళ అక్క రక్తబంధం ఆ ఇంటి వైపు లాగేసింది. ఏం చేసి అయినా సరే ఆ భాగమతిని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసి తీరాలి అని అంటుంది.

మనోహరి: నేను వెంటనే బయలుదేరాలి నిన్ను తర్వాత కలుస్తాను అని కంగారుగా కారెక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మనోహరి.

మరోవైపు పిల్లలందరూ స్కూల్ దగ్గర కార్ దిగుతారు. అంజలి ఎంతో హ్యాపీగా కార్ దిగి మార్నింగ్ ఎయిర్ ని ఎంజాయ్ చేస్తుంది. పిల్లల వెనుకనే అరుంధతి కూడా కార్ దిగుతుంది.

అరుంధతి: హమ్మయ్య అంజు ఆఖరికి అనుకున్నది సాధించావు. అందరితోనే కలిసి చదువుకుంటున్నావు అని మనసులో అనుకుంటుంది.

అంజలి: హమ్మయ్య ఆఖరికి మీతో కలిసి ఇదే స్కూల్లోకి వచ్చి జాయిన్ అయ్యాను అని అనుకుంటూ ఉండగా రామ్మూర్తి అక్కడికి వస్తాడు.

రామ్మూర్తి: ఆఖరికి సాధించావమ్మా అందరితో కలిసి ఇక్కడే జాయిన్ అయిపోయావు

అమ్ము: లాస్ట్ మినిట్ వరకు సర్ప్రైజ్లు, ట్విస్టులు ఇస్తూ భయపెట్టేసింది

అంజలి: మరి అంజు అంటే ఆ మాత్రం ఉంటుంది కదా అని చెప్పి రామ్మూర్తి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అంజలి.

రామ్మూర్తి: అయ్యో అమ్మ నేను కేవలం వాచ్మెన్ ని మాత్రమే నా దగ్గర ఎందుకు ఆశీర్వాదం తీసుకున్నావు?

అంజలి: స్కూల్ కి వెళ్లే ముందు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదా. మీరు నాకు తాతయ్యే కదా మరి మీ కాళ్లు పట్టుకుంటే తప్పేంటి తాతయ్య అని అంటుంది అంజలి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Read Also: ఓర్నీ, ‘సలార్’ ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. ఫ్రీగా చూసేసిన ప్రభాస్ అభిమానులు, ఏం జరిగిందంటే..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget