Nindu Noorella Saavasam December 20th Episode: అరుంధతిని ఓ ఆటాడుకుంటున్న చిత్రగుప్తుడు - ఒకే గదిలో రాత్రంతా గడపనున్న భాగీ, అమర్!
Nindu Noorella Saavasam Today Episode: అమర్ మిస్సమ్మ ఇద్దరూ ఒకే గదిలో ఉండిపోవడంతో టెన్షన్ పడుతుంది మిస్సమ్మ. అమర్ ఆ రాత్రికి మిస్సమ్మని అక్కడే ఉండిపోమనడంతో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి.
Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో జరిగింది చెప్తున్నారా ఇలా జరిగితే బాగుండు అని చెప్తున్నారా అంటూ చిత్రగుప్తుడి మీద కేకలు వేస్తుంది అరుంధతి.
చిత్రగుప్తుడు : ఇది మరీ బాగుంది.. నేనేమైనా వాళ్ళిద్దర్నీ ఒక గదిలో పెట్టి తలుపు వేసానా..
అరుంధతి: తాళం ఎక్కడ ఉందో చెప్పమంటే చెప్పటం లేదు కదా
చిత్రగుప్తుడు: నా అంగుళీకము నాకు ఇమ్మంటే ఇవ్వటం లేదు కదా అంటాడు.
అరుంధతి: ఈరోజు మీ టైం నడుస్తుంది రేపు నా టైం నడిచిన రోజు నేను ఆడుకుంటాను.
చిత్రగుప్తుడు: నా అంగుళీకము నీ దగ్గర ఉన్న దగ్గర నుంచి నీ సమయమే నడుస్తుంది. అయినా మిస్సమ్మ వాళ్ళు గదిలో ఉండి చాలాసేపు అయింది లోపల ఏమైనా... అని అంటూ ఉండగానే
అరుంధతి: మా ఆయన చాలా మంచివాడు మీరు లేనిపోని అనుమానాలు పెట్టవద్దు అంటుంది. మనసులో మాత్రం ఈ గుప్తా గారు లేనిపోని అనుమానాలు పెట్టారు అనుకుంటూ గది వైపు పరుగులు తీస్తుంది.
మరోవైపు అమర్ తో పాటు గదిలో ఉన్నందుకు టెన్షన్ పడుతూ ఉంటుంది మిస్సమ్మ.
మరోవైపు ఆలోచనలో ఉన్న మనోహరిని చూసి మా అమ్మగారి జాతకం ఏంటో ఇంత చండాలంగా ఉంది అనుకుంటుంది నీల.
మనోహరి : వాళ్ళిద్దరూ ఓకే గదిలో చాలాసేపు ఉన్నారు అయినా అమర్ ఏంటి చాదస్తంగా డోర్ బద్దలు కొట్టద్దు అంటున్నాడు అని కోపంగా అంటుంది.
నీల: చాదస్తమో లేకపోతే లోపల అమ్మాయి ఉందన్న ఆలోచనో ఏమో, ఇద్దరినీ కలపడానికి ఆ దేవుడు అలా సెట్ చేసి ఉంటాడు.
అలాంటి మాటలు మాట్లాడావంటే ఊరుకోను అని నీల పీక పట్టుకుంటుంది మనోహరి. ఇక ఊరుకోలేక అమర్ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ బద్దలు కొట్టేద్దాం అంటుంది.
అమర్ : వద్దు ఇంతసేపు వెయిట్ చేసాక ఇప్పుడు తలుపులు బద్దలు కొట్టడం ఏంటి, తాళాలు పోయినందుకు సొల్యూషన్ తలుపులు బద్దలు కొట్టడం కాదు తాళాలు వెతకడం అంటాడు
కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనోహరి. మనోహరి చెప్పింది నిజమే కదా ఈ రోజు డోర్ బదులు కొట్టించి రేపు బాగు చేయించేద్దాం అంటుంది మిస్సమ్మ.
అమర్ : ఏమీ అక్కర్లేదు అంటూ చల్లగాలి వీస్తుందని మిస్సమ్మ ఇబ్బంది పడుతుందని కిటికీ డోర్ క్లోజ్ చేయటానికి వెళ్తాడు.
మిస్సమ్మ : డోర్ క్లోజ్ చేయొద్దు మనం నలుగురికి కనిపించాలి కదా అంటుంది.
అమర్: ఎందుకు నలుగురికి కనిపించాలి అని అడుగుతాడు.
అతని తెలివితేటలకి, అతని లాజిక్ కి సమాధానాలు చెప్పలేక తల కొట్టుకుంటుంది మిస్సమ్మ. మా ఆయనకి ఎందుకు ఇన్ని తెలివితేటలు ఇచ్చావు అని అరుంధతి కూడా భర్తని తిట్టుకుంటుంది.
ఆ తర్వాత రాథోడ్ ఇంటికి వచ్చి కార్పెంటర్, కీ మేకర్ ఎవరు దొరకలేదు అని చెప్తాడు. అసలే కోపం మీద ఉన్నోడు ఈ మాట చెప్తే మరింత కోప్పడతాడు అంటాడు అమర్ తండ్రి. అయితే మీరే చెప్పండి అంటాడు రాథోడ్. నాకు చెప్పలేదు కదా అని తప్పించుకుంటాడు అతను. మనోహరిని, పిల్లల్ని అడిగినా కూడా తప్పించుకుంటారు ఇక తప్పక డోర్ దగ్గరికి వెళ్లి కార్పెంటర్, కీ మేకరు దొరకలేదు అని చెప్తాడు రాథోడ్.
మిస్సమ్మ : దొరకకపోవటం ఏమిటి తీసుకురావడానికే కదా మీరు వెళ్ళింది అని కంగారుగా అడుగుతుంది.
రాథోడ్: అంతా వెతికాను, ఎవరు దొరకలేదు. ఈ రాత్రిపూట షాపులు క్లోజ్ చేసి ఉన్నాయి అందుకే ఇంకా వచ్చేసాను.
ఈ మాటలు విన్న అరుంధతి రాథోడ్ ని తిట్టుకుంటుంది.
రాథోడ్: డోర్ బద్దలు కొట్టేద్దాము లేదంటే రాత్రంతా లోపలే ఉండవలసి ఉంటుంది.
అమర్: పర్వాలేదు ఇక్కడే ఉంటాం.
అంతా మీ ఇష్టమేనా అని భర్తని తిట్టుకుంటుంది అరుంధతి.
మిస్సమ్మ: రాథోడ్ చెప్పినట్టు డోర్ బద్దలు కొట్టేద్దాం లేదంటే ఒక అమ్మాయి ఒక రాత్రంతా పరాయి మగ వాడి గదిలో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు.
అమర్: నువ్వు అలా ఫీల్ అవుతున్నావా
మిస్సమ్మ: నిజం చెప్పలేక నేనేమీ ఫీలవడం లేదు అంటుంది.
అమర్: నేను సోఫాలో పడుకుంటాను నువ్వు బెడ్ మీద పడుకో
మిస్సమ్మ: ఎక్కడ పడుకున్నా నాకు నిద్రపట్టదు కొత్త ప్లేస్ కదా.
అమర్: ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంటుంది కదా అని మనసులో అనుకుంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.