Nindu Noorella Saavasam December 18th Episode - 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: ఘోరని హేచ్చరించిన దేవర, మిస్సమ్మ కోరిక తీరుతుందా!
Nindu Noorella Saavasam Today Episode: అమర్ సంతకం పెడితే మిస్సమ్మ ఎక్కడ పిల్లల్ని వదిలి వెళ్ళిపోతుందో అని అరుంధతి టెన్షన్ పడటంతో అమర్ సంతకం పెడతాడా లేదా అనే ఉత్కంఠత ఏర్పడుతుంది.
Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నేను వశం చేసుకోవాలనుకున్న ఆత్మని ఒక మనిషి చూసింది అది ఎలా సాధ్యపడింది, అసలు వాళ్ళిద్దరికీ ఏంటి సంబంధం అని అడుగుతాడు ఘోర.
దేవర: కొన్నిటికి సమాధానాలు దొరకవు, కారణాలు మాత్రమే ఉంటాయి. దశదినకర్మ తర్వాత కూడా ఆత్మ భూలోకం మీద ఉంది అంటే తను చేయవలసిన పని ఏదో మిగిలి ఉంది. ఆ ఆత్మ చుట్టు యమలోకవాసి ఒకరు ఉండి తీరుతారు అంటాడు.
ఘోర: అవును దేవర ఆమె దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. అతని వేషభాషలు చూస్తుంటే యమలోకవాసి లాగే అనిపిస్తున్నాడు అంటాడు.
ఆనందంతో దేవర కళ్ళు మెరుస్తాయి.
దేవర: త్వరపడు ఘోర, ఇది మంచి అవకాశం ఆ ఆత్మ ఎప్పుడైనా లోకాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు. ఈ లోగానే ఆత్మని బంధించు నీకు రావలసిన శక్తి కన్నా అతీత శక్తులు ఎక్కువగా వస్తాయి లోకంలో నిన్ను ఎదిరించే వాడే ఉండడు అని చెప్తాడు.
ఘోర ఆనందపడుతూ ఆ పని లోనే ఉంటాను అంటాడు.
మరోవైపు అమర్ ని సంతకం పెట్టమంటే ఏమంటాడో అని ఆలోచనలో పడుతుంది మిస్సమ్మ. అమర్ దగ్గరికి వెళ్లి ఎలా అడగాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
Also Read : విన్నర్ నేనే, నాకు తెలుసు - ‘బిగ్ బాస్’పై శివాజీ షాకింగ్ కామెంట్స్
అరుంధతి: ఇప్పుడు ఆయన సంతకం పెడితే ఇక్కడినుంచి మిస్సమ్మ వెళ్ళిపోతుంది అని అనుకుంటుంది.
మిస్సమ్మ టెన్షన్ పడుతూ ఉండగా అక్కడికి రాథోడ్ వస్తాడు.
మిస్సమ్మ: రాథోడ్ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి చేసి పెట్టు అని అడుగుతుంది.
రాథోడ్: ఏంటది
మిస్సమ్మ : అదే మా నాన్నగారి హెల్త్ ట్రీట్మెంట్ కోసం సార్ సంతకం కావాలి కదా అడగటానికి భయంగా ఉంది అందుకని హెల్ప్ కావాలి.
రాథోడ్: అయ్యో నీకు ఆ విషయం చెప్పడం గురించే ఇందాకటి నుంచి నిన్ను వెతుకుతున్నాను అంటూ అమర్ తల్లిదండ్రులు మిస్సమ్మని పొగిడిన మాటలన్నీ మిస్సమ్మకి చెప్తాడు. ఆ మాటలకి మిస్సమ్మ ఎంతో ఆనంద పడుతుంది.
మిస్సమ్మ : అయితే ఇప్పుడు వెళ్లి సంతకం పెట్టమంటే సార్ పెట్టేస్తారేమో అని ఆనందంగా అడుగుతుంది.
అమర్: సంతకం ఏం కర్మ, పెళ్లి చేసుకోమంటే పెళ్లి కూడా చేసుకుంటారు అంటాడు.
ఒక్కసారిగా షాక్ అవుతారు అరుంధతి, మిస్సమ్మ.
మిస్సమ్మ: నేనెందుకు ఆయనని పెళ్లి చేసుకోమని అడుగుతాను అంటుంది.
రాథోడ్: నేను ఆ ఉద్దేశంతో అనలేదు నువ్వు ఏం అడిగినా ఇచ్చేస్తారు అని చెప్పటం కోసం అలా చెప్పాను అంటాడు.
మిస్సమ్మ: ఆయన దగ్గరికి వెళ్లి అడగాలంటే భయంగా ఉంది అందుకే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను నువ్వు సార్ వి నేను నేనే అంటుంది. మీ సంతకం కావాలి అని ఒక స్టైల్ లో అడుగుతుంది.
రాథోడ్: నువ్వు సంతకం పెట్టమని అడుగుతున్నట్టు లేదు నీ లవ్ ని ప్రపోజ్ చేస్తున్నట్లుగా ఉంది అంటాడు.
ఈ మాటలు విన్న అరుంధతి.. రాథోడ్ ఏంటి ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని రాథోడ్ ని తిట్టుకుంటుంది.
మిస్సమ్మ: ఏదైతే అది అయింది అని కొంచెం ధైర్యంగా, కొంచెం భయంగా అమర్ గదిలోకి వెళ్లి నేను మీకు ఒకటి చెప్పాలి అంటుంది. అంతలో గాలికి డోర్ పడిపోతుంది.
ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది మిస్సమ్మ
అమర్: ఎందుకు భయం నువ్వు ఒక్కదానివే రూమ్ లో లేవు నేను కూడా ఉన్నాను అంటాడు.
మిస్సమ్మ: అదే నా భయం అని అనుకుంటూ డోర్ లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది ఆమె వల్ల కాకపోవటంతో అమర్ కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓపెన్ కాకపోవటంతో రాథోడ్ కి ఫోన్ చేసి బయటి నుంచి డోర్ ఓపెన్ చేయమంటాడు.
రాథోడ్: డోర్ లాక్ పడిపోయినట్లుగా ఉంది సార్ ఎంతకీ రావడం లేదు.
అమర్: కీస్ ఎక్కడ ఉన్నాయో చూడు వాటితో ఓపెన్ చెయ్యు అనటంతో అవి తీసుకురావటానికి వెళ్తాడు రాథోడ్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.