Nindu Noorella Saavasam December 16th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: అరుంధతి ఆత్మ గురించి మనోహరికి నీల నిజం చెప్పేసిందా? సమస్యకి పరిష్కారం వెతుకుతున్న ఘోర!
Nindu Noorella Saavasam Today Episode: ఒక ఆత్మ మనిషితో మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు. ఇది సాధ్యమేనా? అని గురువుని అడగటంతో గురువు ఏం సమాధానం చెప్తాడో అనే క్యూరియాసిటీ ఏర్పడుతుంది.
Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మిస్సమ్మతో మాట్లాడుతూ చిత్రాగుప్తుడు ఇలా అంటాడు.. పిల్ల పిచ్చుక పరీక్ష పాస్ అయినందుకు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆనందపడుతున్నావు అంటాడు.
మిస్సమ్మ: నాక్కూడా అదే అర్థం కావడం లేదు, వాళ్లకి నాకు ఎలాంటి రక్తసంబంధం లేదు అయినా ఎందుకో చాలా ఆనందంగా ఉంది. నాకన్న పిల్లలు పాసైనా కూడా ఇంత ఆనందంగా ఉండేది కాదేమో. మా నాన్నకి ఒంట్లో బాగోలేనప్పుడు బాధపడ్డాను. మళ్ళీ అంజుకి ఒంట్లో బాగోలేనప్పుడు అలాంటి బాధ కలిగింది.. ఎందుకో అర్థం కావడం లేదు అంటుంది.
చిత్రగుప్తుడు : అదే రక్తసంబంధం అంటే, వాళ్లు కూడా నీ పిల్లలతో సమానమే, అందుకే ఈ అనుభూతి. సమయం వచ్చినప్పుడు నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది అని మనసులో అనుకుంటాడు. బయటికి మాత్రం అంత ఆనందంగా ఉందా అని అడుగుతాడు.
మిస్సమ్మ : అవును గుప్తాగారు నిజంగా ఇప్పుడు వాళ్ళ అమ్మగారు గాని ఉండుంటే ఎంత ఆనంద పడేవారో అంటుంది.
చిత్రగుప్తుడు: అరుంధతిని చూస్తూ మొహంలో ఆ వెలుగు కనిపిస్తుంది అంటాడు.
మిస్సమ్మ, అరుంధతి షాక్ అవుతారు.
మిస్సమ్మ : వాళ్ళ అమ్మగారికి ఆనందం కలుగుతుంది అంటే అక్క ముఖంలో కళ కనిపిస్తుంది అంటారేంటి వాళ్ళ అమ్మగారు అక్కకి తెలుసా అని అడుగుతుంది.
టాపిక్ మార్చేసిన అరుంధతి.. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు కదా స్వీట్ చేసిన తర్వాత తినేసి పడుకో అని మిస్సమ్మతో అంటుంది.
మిస్సమ్మ : లేదక్కా నాన్న ఆపరేషన్ కోసం సార్ సంతకం కావాలి కదా అది చేయించుకోవాలి అంటుంది.
అరుంధతి: అంటే సంతకం పెట్టించుకున్నాక ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా అని బాధగా అడుగుతుంది.
ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిస్సమ్మ.
మరోవైపు బ్లాక్మెయిల్ కి గురైన మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి నీల వచ్చి మిస్సమ్మ గాలిలో ఎవరితోనో మాట్లాడుతుంది అని అంటుంది.
మనోహరి : నీకేమైనా పిచ్చా, అక్కడ ఎవరున్నారని అలా మాట్లాడుతున్నావు అంటుంది.
నీల: ఇంట్లో ఇలా చేస్తేనే ఇలా అయిపోతున్నారు నేను బయట ఇంకా చూశాను అంటూ చిత్రగుప్తుడు, మిస్సమ్మ గాలిలో మాట్లాడటం గురించి చెప్తుంది.
మనోహరి : ఈ ఇంట్లో కచ్చితంగా ఆత్మ ఉంది అంటుంది. అవునూ నిన్ను ఘోర గురించి వెతకమన్నాను కదా ఏం చేశావు అంటుంది. వెతకలేదు అన్న నీలని కోప్పడి ఆ పని మీద ఉండు అని ఆర్డర్ వేస్తుంది.
మరోవైపు అంజూని మిస్సమ్మ శ్రద్ధగా చూసుకోవడం చూసిన అమర్ తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. మిస్సమ్మ టాబ్లెట్ తీసుకొని అంజు దగ్గరికి వెళుతుంది. టాబ్లెట్ వేసుకోను అని మారాం చేసిన అంజని మాయ చేసి టాబ్లెట్ వేసుకునే లాగా చేస్తుంది.
అమర్: అంజుతో ఇంక రెస్ట్ తీసుకో రేపు స్కూల్ కి వెళ్ళాలి కదా అని చెప్తాడు. మిస్సమ్మ వైపు చూసి అంజుకి ఏం కావాలో చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు.
అప్పుడే కిందన అమర్ తల్లిదండ్రులు మిస్సమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమె చాలా మంచి అమ్మాయి అరుంధతి లేనిలోటు తీరుస్తుంది అనుకుంటూ ఉంటారు. అంతలోనే అక్కడికి వచ్చిన అమర్ కి ఈ విషయమే చెప్తారు. కానీ అమర్ ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
రాథోడ్ : సార్ గురించి తెలిసిందే కదా మనసులో అభిమానం ఉంటుంది కానీ బయటికి ఏమీ చెప్పరు అంటాడు.
అమర్ తల్లిదండ్రులు: ఆ అమ్మాయికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇద్దాం అవసరమైనప్పుడు చెప్పు అని రాథోడ్ కి చెప్తారు. అలాగే అని ఆనందంగా చెప్తాడు రాథోడ్.
మరోవైపు గురువు దగ్గరికి వెళ్తాడు ఘోర.
గురువు: నా వరకు వచ్చావంటే పరిష్కారం దొరకని సమస్య ఏదో వచ్చి ఉంటుంది ఏంటది.
ఘోర : నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో తంత్రాలు మంత్రాలు నేర్చుకున్నాను కానీ ఎప్పుడూ ఒక ఆత్మ మనిషితో మాట్లాడటం చూడలేదు. వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏమిటి అసలు ఒక ఆత్మ మనిషికి కనిపించడం ఏమిటి అని అడుగుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్ - తన మొదటి భర్త రావడంతో షాకైన తిలోత్తమ, గంగాధర్ చేతిలోనే చనిపోతుందా!