Nindu Noorella Saavasam Serial Today September 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఎంట్రీ ఇచ్చిన రణవీర్ కూతురు – నిజం కనిపెట్టిన మను
Nindu Noorella Saavasam serial Today Episode September 4th: అనాథ ఆశ్రమంలో ఉన్న రణవీర్ కూతురును భాగీ ఇంటికి తీసుకొస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: రాథోడ్, రణవీర్‌కు ఫోన్ చేసి అర్జెంట్ గా ఆఫీసుకు రమ్మని అమరేంద్ర సార్ చెప్పారని చెప్పడంతో రణవీర్, అమర్ ఆఫీసుకు వెళ్లి వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో అమర్ వస్తాడు.
రణవీర్: చెప్పండి అమర్ అర్జెంట్ గా రమ్మని రాథోడ్ చెప్పారు
అమర్: ఏంటి రణవీర్ నెర్వస్‌గా ఉన్నావు
రణవీర్: అదేం లేదు.. అసలు నన్ను ఎందుకు రమ్మన్నారు..?
అమర్: చెప్తాను.. ఆరోజు నేను మీ ఇంటిక వచ్చినప్పుడు నా కూతురు నాకు కావాలి అని అంత గట్టిగా మాట్లాడిన నువ్వు మళ్ళీ ఇంకోసారి నీ కూతురు గురించి ఎందుకు అడగలేదు..
రణవీర్: అంటే పదే పదే చెప్పి మిమ్మల్ని విసిగించడం ఎందుకని అడగలేదు.
అమర్: సో నువ్వే సొంతంగా ట్రై చేస్తున్నావు అన్నమాట.
రణవీర్: ఏంటి అమర్ గారు మీరు అంటుంది నాకేం అర్థం కావడం లేదు..
అమర్: అదే నీ కూతురు కోసం నువ్వే సర్చ్ చేస్తున్నావు అన్నమాట.. ఎంత వరకు వచ్చింది
రణవీర్: ఏంటిది..? నాకు అర్థం కావడం లేదు..
అమర్: అదే నీ సొంత ప్రయత్నం..
రణవీర్: నేను కూడా నలుగురైదుగురికి చెప్పి ఉంచాను.. వాళ్లు కూడా వెతికే పనిలో ఉన్నారు
అమర్: ఓకే నీకు మాయలు మంత్రాల పైన నమ్మకం ఉందా..?
రణవీర్: మాయలు మంత్రాలా..?
అమర్: అదే రణవీర్.. సూపర్ న్యాచురల్ పవర్స్.. బ్లాక్ మ్యాజిక్, ఎక్సెట్రా.. ఎక్సెట్రా..
రణవీర్: ఎందుకు అలా అడుగుతున్నారు..
అమర్: ఏదో జస్ట్ తెలుసుకుందామని
రణవీర్‌కు ఆరును చంభా బంధించిన విషయం గుర్తుకు వస్తుంది.
అమర్: రణవీర్ చెప్పు ఏమైనా ఐడియా ఉందా…
రణవీర్: నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు అమరేంద్రగారు
అమర్: అయితే నువ్వు ఆత్మలను మంత్రాలను నమ్మవన్నమాట
రణవీర్: ఇప్పటి వరకు నాకు అలాంటి అవసరం రాలేదు.. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారో చెప్తారా..? నాకు అర్జెంట్ వర్క్ ఉంది వెళ్లాలి
అమర్: మీ అమ్మాయి దొరికింది రణవీర్
రణవీర్: నిజమా..? ఎక్కడ ఉంది..? తనని నేను ఇప్పుడే చూడాలి.. ఎక్కడుంది తను.. చూపించండి ఫ్లీజ్
అమర్: పాప ఇక్కడ లేదు.. వేరే సిటీలో ఉంది. పాప రావడానికి వన్ డే టైం పడుతుంది. ఇంతకీ మీ పాప దొరికిన విషయం మీ వైఫ్‌కు చెప్పవా..?
రణవీర్: అవును ఇప్పుడే చెప్తాను..
అని రణవీర్ కాల్ చేయబోయి ఆగిపోతాడు.
అమర్: సో మీ వైఫ్ ఎక్కడుందో మీకు తెలుసన్న మాట. చెప్పు రణవీర్ మీ వైఫ్ ఎక్కడుందో మీకు తెలుసా..?
రణవీర్: లేదు అమరేంద్ర తను ఎక్కుడుందో నాకు నిజంగా తెలియదు.. తెలిస్తే తనను షూట్ చేసి పడేస్తాను..
అమర్: మరి పాప విషయం చెప్పగానే.. మీ వైఫ్‌తో చెప్తాను అన్నావు.. మొబైల్ కూడా తీశావు..
రణవీర్: అదే పాప దొరికిన ఆనందంలో ఆ ఎగ్జైట్‌మెంట్‌లో నేనేం మాట్లాడానో.. నేను ఫోన్ ఎందుకు తీశానో నాకే తెలియడం లేదు.. ట్రస్ట్ మి. నా వైఫ్ ఎక్కడుందో నాకు నిజంగా తెలియదు.. అమరేంద్ర ఇంతకీ నా పాప ఎలా ఉంది. తను ఫోటో ఏదైనా ఉందా.? నేను ఇప్పుడే తనతో మాట్లాడాలి.. మేము కోల్‌కతా వెళ్లిపోతాను.
అమర్: వన్ డే వెయిట్ చేయ్ రణవీర్ పాప నీ కళ్ల ముందు ఉంటుంది. అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది. నాకు ఒక క్లారిటీ వస్తుంది.
అనగానే రణవీర్ అనుమానంగా క్లారిటీనా అంటాడు. అదే వేరే లెక్క సరే నువ్వు వెళ్లొచ్చు రణవీర్ అని అమర్ చెప్పగానే రణవీర్ వెళ్లిపోతాడు. మరోవైపు ఆశ్రమంలో ఉన్న భాగీ, రణవీర్ కూతురుగా నటించడానికి సిరి అనే పాపను తీసుకుని వస్తుంది. అంతా దూరం నుంచి చిత్ర, మను గమనిస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.





















