అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today  September 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం తెలుసుకున్న ఆరు – మనోహరి ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌

Nindu Noorella Saavasam Today Episode:  పౌర్ణమి గడియలు పూర్తి అయ్యేలోపు ఆరుని  తమ లోకానికి తీసుకెళ్లాలని గుప్తు అనుకుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  భాగీ మాత్రం అమర్‌ మీద నుంచి లేచి తిడుతూ అక్కలా నేను చనిపోతే అని అంటుండగానే అమర్‌ భాగీ నోరు మూస్తాడు. పక్కనే ఉండి చూస్తున్న ఆరు ఎమోషన్‌ అవుతుంది. మాట వరసకు కూడా ఇంకోసారి ఆ మాట అనకు మిస్సమ్మ. నీకేం కాదు కాకూడదు. కానివ్వను. ఈ ఇంటికి, నాకు నువ్వు ఎంత ఇంపార్టెంటో నీకు కూడా తెలియదు మిస్సమ్మ అంటూ ఇంకోసారి అలా మాట్లాడకు. ఫ్లీజ్‌. ఇవాళ జరిగిన దానికి నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు తెలుసు. అని అమర్‌ చెప్పగానే భాగీ మౌనంగా వెళ్లిపోతుంది. కిటికీలోంఇ అంతా చూస్తున్న ఆరు ఎమోషనల్‌ అవుతుంది.  తర్వాత బయటకు వెళ్లి కూర్చుని ఏడుస్తుంది ఇంతలో గుప్త వస్తాడు.

గుప్త: బాలిక దుఃఖించుచుంటివా? నీ దుఃఖమునకు కారణం ఎవరో చెప్పుము. వారికి ఇప్పుడే శిక్షను విధించెద. ఆ మనోహరే కదా నీ బాధకు కారణం తక్షణమే ఆ బాలికను శిక్షంచెదను.

ఆరు: మనోహరి కాదు గుప్తగారు. మా ఆయన.

గుప్త: ఏమిటి నీ దుఃఖమునకు కారణం నీ పతిదేవుదా?

ఆరు: ఇవి కన్నీళ్లో ఆనంద బాష్పాలో తెలియడం లేదు. గుప్తగారు.

గుప్త: ఏమి మాట్లాడుతున్నావు బాలిక అసలు ఏమి జరిగినది. ఓహో నీ పతి దేవుడు ఆ బాలికకు దగ్గర అవుతున్నాడని బాధపడుతున్నావా?  

ఆరు: అదే తెలియడం లేదు గుప్త గారు ఆయన మిస్సమ్మకు దగ్గర అయిన ప్రతిసారి నాకు జెలసి అనిపించేది.  కానీ ఈసారి ఎందుకో చాలా కొత్తగా అనిపించింది. ఆయన మిస్సమ్మ మీద చూపిస్తున్న అభిమానం చూస్తుంటే నాకు ముచ్చటేసింది గుప్తగారు మిస్సమ్మ ఎంత అదృష్టవతురాలో అనిపించింది.

 అంటూ ఆరు ఎమోషనల్ అవుతూ గుప్తకు  చెప్తుంది. మరోవైపు భాగీ వెళ్లి అమర్‌ నిద్రపోతుంటే పక్కన కూర్చుంటుది. ఇంకోవైపు మిస్సమ్మ ఆయన పక్కన ఉంటే మనసు ఒప్పుకోకున్నా.. ఆయన ప్రేమ మిస్సమ్మకు దక్కుతున్నందుకు చాలా సంతోషంగా  ఉంది గుప్త గారు అని చెప్పి వెళ్లిపోతుంది. రేపు  పౌర్ణమి గడియలు  ప్రారంభం అయిన వెంటనే నిన్ను మా లోకానికి తీసుకుపోతాను అని గుప్త అనుకుంటాడు. తర్వాత ఘోర, మనోహరికి ఫోన్‌ చేసి ఆత్మ ప్రవేశించిందా? అని అడుగుతాడు.

మనోహరి: ఇంకా పౌర్ణమి  గడియలు మొదలైనట్టు లేదు. మొదలైతే నేను పెట్టిన భయానికి కచ్చితంగా నా ఒంట్లోకి ప్రవేశింస్తుంది.

ఘోర: అయ్యో మనోహరి పౌర్ణమి గడియలు మొదలు అవ్వకపోవడం ఏంటి? మొదలై చాలా సేపు అయింది.

మనోహరి: ఏంటి నిజమా? అంటే ఇప్పుడది ఎవరి ఒంట్లోకైనా ప్రవేశించింది అంటావా?

ఘోర: ఆ విషయం తెలుసుకోవాల్సింది నువ్వు. ముందు వెళ్లి అది కనిపెట్టు. ఒకవేశ వేరే వాళ్ల శరీరంలోకి ప్రవేశించి ఉంటే నీ ఒంట్లోకి వచ్చేలా చేసుకో..

మనోహరి: సరే నేను తెలుసుకుంటాను. నువ్వైతే పూజకు రెడీ చేసుకో 

అని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తుంది. ఇంతలో అంజలి డోర్‌  తెరుచుకుని వచ్చి మనోహరి వైపు గుర్రుగా చూస్తుంది. మనోహరి భయపడుతూ లేచి అంజు అని పిలుస్తుంది. దీంతో అంజు మను అని పిలుస్తుంది. మనోహరి షాక్‌ అవుతుంది.  ఎవరు నువ్వు అంటూ అడగ్గానే వెటకారంగా మహాత్మాగాంధీ అంటుంది. మనోహరి కోప్పడగానే ఇంతలో అమ్ము వచ్చి డోర్‌ దగ్గర నిలబడుతుంది. అమ్మును  చూసిన మనోహరి డౌట్‌ లేదు ఆరు అమ్ములోనే ఉంది అనుకుంటుంది. అమ్ము మెల్లగా నడుచుకుంటూ లోపలికి వస్తుంది.

అమ్ము: ఏమైంది ఎందుకు అడుగులు వెనక్కి వేస్తున్నావు.

మనోహరి: నువ్వు… నువ్వు..

అమ్ము: నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటే వెంటనే చెప్పండి. నాకు స్కూల్‌ కు టైం అవుతుంది.

మనోహరి: అది కాదు  నువ్వు ఇందాకా కోపంగా చూశావా? కదా

అమ్ము: అదా ఆంటీ అసలే స్కూల్‌ కు టైం అవుతుంది అనుకుంటే ఈ అంజు నీతో ఏదో మాట్లాడాలి అని ఇక్కడకు వచ్చింది.

 అంటూ అంజును  తీసుకుని వెళ్లిపోతుంది. మనోహరి అసలు ఆరు ఎవరిలో దూరింది అని ఆలోచిస్తూ.. కిచెన్‌ లోకి వెళ్లి టమాటా  కట్‌ చేస్తున్న భాగీని చూస్తూ ఆరు అని పిలుస్తుంది. దీంతో భాగీ నీకైమైనా చిప్పు మిస్‌ అయ్యిందా? నా పేరు భాగీ.. భాగుమతి అంటుంది. మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరవైపు గుప్త ఆరు కోసం వెతుకుతుంటాడు. ఆరు  ఎక్కడ కనిపించదు. ఇంతలో యముడు  వచ్చి ఇంకా ఆ బాలికను తీసుకురాలేదేంటి అని అడుగుతాడు. పౌర్ణమి గడియలు  ముగిసే లోపు ఆ బాలికను తీసుకుని  వస్తాను అని గుప్త చెప్తాడు. గుప్త మాటలు ఆరు వింటుంది.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 18th: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
నువ్వులేక నేను లేను: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
Podarillu Serial Today August 18th:పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
పొదరిల్లు: పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
Brahmamudi Serial Today August 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషును రెచ్చగొట్టిన రేఖ – ఇందుతో చలపతి ఎమోషన్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషును రెచ్చగొట్టిన రేఖ – ఇందుతో చలపతి ఎమోషన్‌
Gundeninda Gudigantalu August 18th:రోహిణి ఏటీఎం కార్డు లాక్కున్న ప్రభావతి..సుమతి ప్రేమ వ్యవహారం మీనాకు తెలిసిపోయిందా..?
గుండెనిండా గుడిగంటలు:రోహిణి ఏటీఎం కార్డు లాక్కున్న ప్రభావతి..సుమతి ప్రేమ వ్యవహారం మీనాకు తెలిసిపోయిందా..?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Embed widget