Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్‌కు అబద్దం చెప్పిన మను – పౌర్ణమి రోజు మనును వెళ్లగొట్టాలనుకున్న ఆరు
Nindu Noorella Saavasam Today Episode: మనోహరిని లోపలికి పిలిచిన అమర్ నువ్వు నాతో ఏదో నిజం దాస్తున్నావని అడగడంతో మను షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్‌కు అబద్దం చెప్పిన మను – పౌర్ణమి రోజు మనును వెళ్లగొట్టాలనుకున్న ఆరు nindu Noorella Saavasam serial today episode September 23rd written update Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్‌కు అబద్దం చెప్పిన మను – పౌర్ణమి రోజు మనును వెళ్లగొట్టాలనుకున్న ఆరు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/23/1a472d6be665af1b896bd79c72c473361727054565910879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ వచ్చి భాగీని చెస్‌లో గెలిపిస్తాడు. దీంతో పిల్లలందరూ హ్యాపీగ ఫీలవుతుంటారు. అంజు మాత్రం డాడ్ వచ్చి గెలిపించారు మీరు మరీ సంబరపడకండి అంటుంది. ఇంతలో అమర్ మనోహరితో మాట్లాడాలి రా అంటూ పైకి వెళ్తాడు. వెనకాలే అనుమానంగా మనోహరి వెళ్తుంది. భాగీ మాత్రం పర్సనల్ గా ఏం మాట్లాడతాడు అనుకుంటుంది. మనోహరి వెళ్లి ఏదో మాట్లాడాలి అన్నావు అని అడగ్గానే ఇవాళ ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు.
మనోహరి: అది చెప్పాను కదా అమర్. ఫ్రెండ్స్ తో కెఫేకు వెళ్లాను అని
అమర్: కెఫే ఏ ఏరియాలో ఉంది..?
మనోహరి: జూబ్లీహిల్స్ లో ఉంది.
అమర్: కెఫే వరకు కారులోనే వెళ్లావా?
మనోహరి: కారులోనే వెళ్లాను.. కారులోనే వచ్చాను.. ఏమైంది అమర్. ఎందుకు అలా అడిగావు.
అమర్: నేను నీకు కాల్ చేసినప్పుడు నీ కారును నానాక్ రామ్ గూడలో చూశాను.
మనోహరి: అంటే అక్కడకు వచ్చింది అమరా..? నేను ఘోరాతో మాట్లాడటం చూశాడా ఏంటి?
( అని మనసులో అనకుంటూ భయపడుంది.)
అమర్: మనోహరి నువ్వు జాబ్లీహిల్స్ లో నీ ఫ్రెండ్స్ తో ఉంటే ఆదే టైంలో నీ కారును నానక్ రామ్ గూడలో ఎలా చూశాను.
అంటూ అమర్ నిలదీయగానే మనోహరి షాక్ అవుతుంది. ఏదో చెప్పి తప్పించుకోవాలని చూస్తే అమర్ నువ్వు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నావు అంటాడు. నాకు కావాల్సింది నీ మౌనం కాదు మనోహరి నీ సమాధానం అంటూ గట్టిగా అమర్ అడగ్గానే.. ఇల్లు చూడ్డానికి వెళ్లానని అది నీకు చెబితే ఒప్పుకోవని అబద్దం చెప్పాను. నాకు ఇక్కడ ఉండే అర్హత లేదు అంటుంది.
దీంతో సరే నీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే వెల్లొచ్చు అంటాడు అమర్. దీంతో మనోహరి ఏడుస్తూ థాంక్యూ అమర్ అంటుంది. సరేనని అమర్ వెళ్లిపోతాడు. కింద ఉన్న భాగీ అంత సీరియస్ గా ఏం మాట్లాడతున్నారు అనుకుని రాథోడ్ ను అడుగుతుంది. రాథోడ్ జరిగింది మొత్తం చెప్పేస్తాడు. చెట్టు చాటు నుంచి రాథోడ్ మాటలు విన్న అరుంధతి పౌర్ణమి రోజు మనోహరిని పంపించేయాలి అనుకుంటుంది. తర్వాత మనోహరి అంజును పిలుస్తుంది.
అంజు: చెప్పండి ఆంటీ పిలిచారు.
మనోహరి: నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను నేను చూసుకుంటున్నట్లుగా ఉంది తెలుసా..? సేమ్ టూ సేమ్.
అంజు: ఏం మీకు చిన్నప్పటి నుంచి చదువు రాదా. మీరు కూడా నాలాగా ఓవర్ గా బిహేవ్ చేసేవారా? అల్లరి చేసి అందరితో తిట్లు తినేవారా.? చెప్పండి.
మనోహరి: ఆపు.. ఆపు ప్లీజ్.. నేను చెప్తుంది. నీలాగా క్యూట్‌గా ఇంటలిజెంట్ గా ఉండేదాన్ని అంటున్నాను. నిన్ను చూస్తుంటే చాలా ముద్దుగా ముచ్చటగా ఉంది తెలుసా?
అంజు: మీరు కూడా పెళ్లి చేసుకుని ఉంటే నాలాగా ముద్దుగా క్యూట్ గా ఒక కూతురు పుట్టేది కదా..? అప్పుడు తనను కూడా ఇలానే ముద్దు చేస్తూ స్కూల్ కు రెడీ చేస్తూ పంపించేవారు కదా?
మనోహరి: ఆ జీవతం వద్దనే కదా వదిలేసి వచ్చాను ( అని మనసులో అనుకుంటుంది.) సరే నాకు ఒక హెల్ఫ్ కావాలి చేస్తావా..?
అంజు: ఆ చెప్పండి ఆంటీ చేస్తాను.
అని అంజు చెప్పగానే ఘోర ఇచ్చిన తాయెత్తు తీసి అంజుకు ఇస్తూ ఇది తీసుకుని నీ దగ్గర ఉంచుకుని రేపు నేను వచ్చి నీకు ముద్దు పెట్టాక నా చేతికి కట్టాలి అని చెప్తుంది. సరేనని అంజు వెళ్తుంది. దీంతో మనోమరి నీ రక్తంతోనే నిన్ను ఓడించబోతున్నాను అనుకుంటుంది మనసులో. మరోవైపు అరవింద్ లోకేషన్ ట్రేస్ చేసి పట్టుకున్నామని అమర్ పై అధికారి చెప్తాడు. అరవింద్ తప్పించుకున్నాడని వాడి అనుచరుడు దొరికాడని.. అరవింద్ ఇక దొరకడేమో అంటాడు. దీంతో నేను నా వైఫ్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్తాను అప్పుడు వాడు మా కోసం వస్తాడు. అప్పుడు వాడిని పట్టుకుందామని అమర్ చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)