అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today  September 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఘోరాను కలిసిన మను – ఆత్మను బంధిస్తానన్న ఘోర

Nindu Noorella Saavasam Today Episode: ఈ పౌర్ణమికి అరుంధతి ఆత్మను బంధిస్తానని ఘోర చెప్పడంతో మనోహరి హ్యాపీగా పీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  మీరు నాకు అన్నతో సమానం గుప్త గారు అందుకే మిమ్మల్ని నమ్మాను గుప్త గారు అని చెప్పి వెళ్లిపోతుంది ఆరు. అయితే నువ్వు నన్ను సోదరుడిగా భావించి నా మనసును టచ్‌ చేశావు బాలికా. కానీ నేను నిన్ను మోసం చేయక తప్పదు. పౌర్ణమి నాడు నిన్ను మా లోకానికి తీసుకెళ్లక తప్పదు అనుకుంటాడు గుప్త. మరోవైపు అమర్‌ షర్ట్‌ వేసుకుంటూ బటన్‌ లేదని భాగీని పిలుస్తాడు. పరుగెత్తుకుంటూ వచ్చిన భాగీ ఏమైందని అడుగుతుంది. షర్ట్‌ బటన్‌ పోయిందని చెప్పడంతో ఇప్పుడే కుడతానని చెప్తూ దేవుడికి పూజ చేసింది గుర్తు చేసుకుని..

భాగీ: దేవుడా? రెండు రోజులు పూజ చేసి ఒకే ఒక కొబ్బరి కాయ కొడితే నువ్వు ఇలాంటి వరాలు ఇస్తావని తెలిస్తే ఈ పని ఎప్పుడో చేసేదాన్ని కదా? ఆయన గుండెల దగ్గర గుండీ ఊడేలా చేసి నన్ను ఆయన గుండెల్లో పర్మినెంట్‌ గా సెటిల్‌ చేయాలనే కదా? ఈ ప్లాన్‌. ఇప్పుడు చూడు ఎలా చేస్తానో

(అని మనసులో అనుకుంటుంది.) ఆగండి.

అమర్: ఏయ్‌ లూజ్‌ ఎందుకు అంతలా గట్టిగా అరిచావు.

భాగీ: మీరు ఎవరు..? ఒక సోల్జర్‌. ఒక లెఫ్టినెంట్‌, ఒక సీనియర్‌, మిమ్మల్ని చూసి జూనియర్స్‌ నేర్చుకుంటూ ఉంటారు. పోయింది బటనే కదండి టూ మినిట్స్‌ కుట్టేస్తా.. చిటికెలో వెళ్లి చిటికెలో వచ్చేస్తా..

 అని వెళ్లి సూది దారం తీసుకుని వచ్చి అమర్‌ గుండెల మీద గుండీ కుడుతుంది. భాగీ వేలుకు సూది గుచ్చుకోవడంతో అమర్‌ కంగారుపడతాడు. ఏయ్‌ లూజు అందుకే చెప్పాను వద్దని అంటాడు అమర్‌. ఇదేం కత్తి కాదు మొగుడు గారు భయపడటానికి అంటుంది భాగీ. ఇద్దరి మధ్య చిన్నపాటి రొమాన్స్‌ నడుస్తుంటే.. రాథోడ్‌ వచ్చి వెహికిల్‌ రెడీ సార్‌ అంటూ చెప్పి లేటయినా పర్వాలేదు సార్‌ మీ పని పూర్తయ్యాకే రండి అని వెళ్లిపోతాడు. అమర్‌ కంగారుగా వెళ్లిపోతాడు. భాగీ డ్రీమ్స్‌ లోకి వెళ్లిపోతుంది. మరోవైపు ఘోర దగ్గరకు వెళ్తుంది మనోహరి.

ఘోర: వచ్చావా? మనోహరి..

మనోహరి: ఇన్ని రోజులు ఏమైపోయావు ఘోర. మనిషివి లేవు. అసలు కబురు లేదు.

ఘోర: గెలవడానికి శక్తిని కూడగట్టుకుంటున్నాను మనోహరి. ఆ ఆత్మ విషయంలో నాకు ఎదురవుతున్న ఎడబాట్లు తగులుతున్న ఎదురుదెబ్బలు, మిగులుతున్న  ఓటమి నుంచి ముందుక అడుగు వేయడానిక సిద్దమవుతున్నాను మనోహరి.

మనోహరి: నువ్వు ఏం అంటున్నావో నాకు అర్థం అవ్వడం లేదు ఘోర.

ఘోర: ఆ ఆత్మను బంధించడానికి ఏర్పాట్లు చేస్తున్నా..

మనోహరి: ఇన్ని సార్లు ఓడిపోయినా ఇంకా ప్రయత్నం ఎలా చేయగలుగుతున్నావు.

అని మనోహరి అడగ్గానే నువ్వు అమరేంద్ర విషయంలో చేస్తున్నదే నేను ఆ ఆత్మ విషయంలో నేను చేస్తున్నాను. అని చెప్పగానే అది సరే కానీ పౌర్ణమి రాబోతుంది. అది ఎవరి శరీరంలోకి ప్రవేశిస్తుందోనని నాకు భయంగా ఉంది అని మనోహరి అడగ్గానే ఎవరి శరీరంలోకో కాకుండా నీ శరీరంలోకి వచ్చేలా నువ్వే చేయాలి. ఆ ఆత్మ నీ శరీరంలోకి వచ్చాకా.. బయటకు వెళ్లకుండా నేను చేస్తాను. ఆ ఆత్మ నీ ఒంట్లో ఉండగానే నేను ఆ ఆత్మను బంధించేస్తా.. అంటాడు. దీంతో మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు భాగీ మురిసిపోతూ కిందకు వస్తుంటే నిర్మల వచ్చి పిలుస్తుంది. అక్కడికి ఆరు కూడా వస్తుంది.

ఆరు: అయ్యోయ్యో ఇన్ని మెలికలు తిరుగుతుందంటే వారిద్దరి మధ్య ఏదో జరిగే ఉంటుంది.

నిర్మల: అమ్మాయికి ఏమైందండి పిలుస్తున్నా పలకడం లేదు.

శివరాం: అందులో ఏముందనే అమ్మాయి ప్లేటులో వేస్తుంది.

నిర్మల: ఏమోనండి నాకు ఏమీ తెలియడం లేదు.

గుప్త: ఎప్పుడూ ఈ గవాక్షం దగ్గరకు వచ్చి అక్కడ ఏమి జరుగుతుందో చూడటమేనా బాలికా..?

 ఇంతలో శివరాం వచ్చి భాగీని గట్టిగా పిలవగానే తేరుకుని ఏదో పరధాన్యంలో ఉన్నాను అంటుంది. ఏంటో చెప్పండి అత్తయ్యా అనగానే పౌర్ణమి వస్తుంది కదా? నువ్వు అమర్‌ గుడికి వెళ్లి పూజ చేస్తారని .. అంటుంది నిర్మల. తర్వాత పౌర్ణమి నాడు ఏమీ జరుగుతుంది అని ఆరు, గుప్తను అడుగుతుంది. ఏమీ జరుగుతుంది. నీకు శక్తులు వస్తాయి. అని గుప్త చెప్పగానే ఈ పౌర్ణమికి ఏదో గందరగోళం జరగబోతుంది అనిపిస్తుంది. కానీ ఏం జరగబోతుందో తెలియడం లేదు అంటుంది ఆరు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
YS Jagan : లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?
లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?
IIFA 2024: ఐఫా 2024... చిరు, బాలయ్య నుంచి మృణాల్, ప్రగ్య వరకు - టాలీవుడ్ అంతా దుబాయ్‌లో వాలిందిగా
ఐఫా 2024... చిరు, బాలయ్య నుంచి మృణాల్, ప్రగ్య వరకు - టాలీవుడ్ అంతా దుబాయ్‌లో వాలిందిగా
Karnataka Politics : సిద్దరామయ్యను చుట్టుముడుతున్న కష్టాలు - కాంగ్రెస్ సర్కార్ నిలబడటం కష్టమేనా ?
సిద్దరామయ్యను చుట్టుముడుతున్న కష్టాలు - కాంగ్రెస్ సర్కార్ నిలబడటం కష్టమేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Second Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లతపవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
YS Jagan : లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?
లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?
IIFA 2024: ఐఫా 2024... చిరు, బాలయ్య నుంచి మృణాల్, ప్రగ్య వరకు - టాలీవుడ్ అంతా దుబాయ్‌లో వాలిందిగా
ఐఫా 2024... చిరు, బాలయ్య నుంచి మృణాల్, ప్రగ్య వరకు - టాలీవుడ్ అంతా దుబాయ్‌లో వాలిందిగా
Karnataka Politics : సిద్దరామయ్యను చుట్టుముడుతున్న కష్టాలు - కాంగ్రెస్ సర్కార్ నిలబడటం కష్టమేనా ?
సిద్దరామయ్యను చుట్టుముడుతున్న కష్టాలు - కాంగ్రెస్ సర్కార్ నిలబడటం కష్టమేనా ?
Devara Success Meet: దేవర సక్సెస్ మీట్... ఇది ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అంటున్న దర్శక నిర్మాతలు
దేవర సక్సెస్ మీట్... ఇది ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అంటున్న దర్శక నిర్మాతలు
IIFA 2024: కృతి సనన్ to రెజీనా... ఐఫా 2024 రెడ్ కార్పెట్ మీద అందాల భామల హొయలు
కృతి సనన్ to రెజీనా... ఐఫా 2024 రెడ్ కార్పెట్ మీద అందాల భామల హొయలు
Satyam Sundaram Movie Review - 'సత్యం సుందరం' రివ్యూ: తమిళ్‌లో బ్లాక్‌ బస్టర్ టాక్ - మరి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఉందా?
'సత్యం సుందరం' రివ్యూ: తమిళ్‌లో బ్లాక్‌ బస్టర్ టాక్ - మరి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఉందా?
Upcoming Affordable 7 Seater Cars: త్వరలో రానున్న బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే - ఫ్యామిలీకి పర్ఫెక్ట్!
త్వరలో రానున్న బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే - ఫ్యామిలీకి పర్ఫెక్ట్!
Embed widget