Nindu Noorella Saavasam Serial Today September 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: సీసీటీవీ పుటేజీ చూసి షాకైన మను – మనును హెచ్చరించిన రణవీర్
Nindu Noorella Saavasam serial Today Episode September 19th: అమర్ తన ఇంట్లోకి వచ్చాడని మనోహరికి సీసీటీవీ పుటేజీ చూపిస్తాడు రణవీర్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అమరేంద్ర తనను కిడ్నాప్ చేసి మనోహరి గురించి అడిగాడని తనను బాగా హింసించారని రణవీర్‌కు చెప్తాడు. దీంతో రణవీర్ వెంటనే మనోహరికి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. మనోహరి వస్తుంది. రణవీర్‌ను కోపంగా చూస్తుంది.
మను: ఏంటి రణవీర్ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఫోన్ చేసి మరీ వెంటనే రమ్మన్నావు
రణవీర్: కొంప మునిగిపోతుంది. కానీ నా కొంప కాదు నీ కొంప
మను: ఏం మాట్లాడుతున్నావు రణవీర్
రణవీర్: అవును అమరేంద్ర నీకోసం చేస్తున్న వేట వేగం చేశాడు. చాలా దగ్గరగా వచ్చేశాడు
మను: అమర్ నాకోసం వెతుకుతున్నట్టు తెలుసు కానీ చాలా దగ్గరగా రావడం ఏంటి..?
రణవీర్: మొన్న అమరేంద్ర నా లాయరును కిడ్నాప్ చేసి నా వైఫ్ ఎవరని టార్చర్ పెట్టాడు
లాయరు: అవును మేడం రెండు రోజులు నన్ను బంధించి కొట్టిన చోట కొట్టకుండా కొట్టారు..
మను: నువ్వు వాళ్లతో ఏమైనా చెప్పావా..?
లాయరు: లేదు మేడం వాళ్లు ఎంత కొట్టినా నాకేం తెలియదని చెప్పాను..
మను: ( మనసులో) నేను ఇచ్చిన డబ్బుకు న్యాయం చేశాడన్న మాట
రణవీర్: అంతేకాదు మనోహరి అదే రోజు అమరేంద్ర నా ఇంటికి వచ్చాడు.. నీ గురించి వెతికాడు..
మను: వాట్ ఆ రోజు అంజు హాస్పిటల్ లో ఉంది కదా..? అమర్ బ్లడ్ కోసం తిరిగాడు కదా..?
రణవీర్: అవును అంజు హాస్పిటల్ లో ఉంది.. కానీ అమర్ బ్లడ్ కోసం వెతకలేదు.. నీ కోసం వెతికాడు.. కావాలంటే సీసీటీవీ పుటేజీ చూడు
అని లాప్‌టాప్ ఓపెన్ చేసి చూపించగానే.. మనోహరి పుటేజీ చూసి భయపడుతుంది.
రణవీర్: చూశావా ఆరోజు నేను ఇంటికి రావడం కొంచెం లేట్ అయినా మనిద్దరి పెళ్లి ఫోటో అమర్ కంట్లో పడేది. టైంకు నేను వచ్చాను కాబట్టి మన పెళ్లి ఫోటో నాతో తీసుకెళ్లిపోయాను. ఆరోజు నేను నీతో ఫోన్‌లో మాట్లాడింది అమరేంద్ర కనిపెట్టేశాడు. నాఫోన్ నుంచి నీ నెంబర్ తెలుసుకోవాలనుకున్నాడు.. కానీ లక్కీగా అది జరగలేదు.. కానీ అతి త్వరలో అమర్ నీ గురించి తెలుసుకుంటాడు మనోహరి
మను: హాస్పిటల్ లో అంజు చావు బతుకుల్లో ఉంటే.. అమర్ కు నా గురించి వెతకాల్సిన అవసరం ఏమొచ్చింది. అంజును వదిలేసి అంతగా నా మీద ఎందుకు కాన్సంట్రేషన్ చేశాడు.
రణవీర్: అదేదో నువ్వే తెలుసుకోవాలి.. లేదంటే ఇన్నాళ్లు నువ్వు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. దేని కోసం నన్ను వదిలేశావో.. ఏం సాధించడానికి మన బిడ్డను వదిలించుకున్నావో అది నీకు దక్కకుండా పోతుంది. ఇప్పటివరకు ఇది నీ ప్రాబ్లం మనోహరి.. నీ వల్ల నాకు ఏదైనా ప్రాబ్లం అయిందో ఊరుకోను..ఇది చెప్తే ముందే జాగ్రత్త పడతావని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను
మను: ఇన్నాళ్లు నాకు అడ్డుగా ఉన్నవాళ్లు పోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నేనే పోయే పరిస్థితి వచ్చింది. నేనంటూ పోతే నాతో పాటు అందరినీ తీసుకెళ్లిపోతాను..
రణవీర్: ఏంటి మనోహరి ఏం మాట్లాడుతున్నావు అందరినీ అంటే ఎవరెవరిని
మను: (మనసులో) ఇప్పటి వరకు భాగీనే అమర్‌ను ఇష్టపడుతుంది అనుకున్నాను.. ఇప్పుడు అమర్ కూడా భాగీని ఇష్టపడుతున్నాడు.. అక్కడ నాకు స్పేస్ లేదు.
రణవీర్: చెప్పు మనోహరి ఎవరెవరిని తీసుకెళ్తావు
మను: చెప్పను చేసి చూపిస్తాను
అని మను కోపంగా వెళ్లిపోతుంది. మనోహరి ఏదేదో మాట్లాడుతుంది. తను ఏం చెప్తుంది.. అంటూ రణవీర్, లాయరును అడుగుతాడు. దీంతో మేడం ఏదో ఫిక్స్ అయినట్టు ఉంది.. ఈసారి గట్టిగా ఏదో చేయబోతున్నారు ఎవరు బలి అవుతారో ఏమో అంటాడు లాయరు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















