Nindu Noorella Saavasam Serial Today October 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరుకు పిండ ప్రదానం చేసిన అమర్ - కింద పడిపోయిన భాగీ
Nindu Noorella Saavasam serial Today Episode October 15th: అమర్ నదిలోకి వెళ్లి ఆస్తికలు వదిలి వెంటనే బయట ఉన్న భాగీ కింద పడిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు అస్థికలు తీసుకుని నది దగ్గర పిండ ప్రదానం నిర్వహిస్తుంటాడు అమర్. అందరూ ఎమోషనల్ గా చూస్తుంటారు.
రామ్మూర్తి: కార్యం కాకముందే అక్క వెళ్లిపోయిందా అమ్మా
భాగీ: తెలియదు నాన్నా.. ఈ ఘడియల్లోనే కార్యం జరగాలని అక్క చెప్పింది. అప్పుడే తాను మళ్లీ పుడతుందట
రామ్మూర్తి: అందుకే కదమ్మా అల్లుడు గారు వద్దంటున్నా బలవంతంగా ఒప్పించి ఈ కార్యం జరిపిస్తున్నాం. లేదంటే అక్క కొన్ని రోజులైనా మనతో ఉండేది.
భాగీ: అదే నేను ఆశ పడ్డాను నాన్న.. మీకైనా అక్కతో కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు అవి కూడా లేవు. ఇన్నాళ్లు అక్క నాకు కనిపించినా అప్పుడు అక్క అని నాకు తెలియదు.. ఆత్మ అని కూడా తెలియలేదు. నిజం తెలిసిన వెంటనే అక్క దూరం అవుతుంది.
రామ్మూర్తి: బాధపడకు తల్లి అక్క మళ్లీ వస్తుంది. మనల్ని కలుస్తుంది నాకు ఆ నమ్మకం ఉందమ్మా
మంగళతో మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది.
మను: నేను ఇన్నాళ్లు ఎదురుచూసిన క్షణం వచ్చింది. కాసేపట్లో ఆరు ఆస్థికలు గంగలో కలుస్తాయి. నాకు దాని పీడ శాశ్వతంగా విరగడి అవుతుంది
మంగళ: (మనసులో) ఎక్కడ విరగడి అవుతుంది. ఆ కలశంలో ఉన్నవి అరుంధతి అస్థికలు కాదు బూడిద
మను: అది బతికున్నన్ని రోజులు నాకు మనఃశాంతి లేకుండా చేసింది. చచ్చాక కూడా సాధించింది. దాన్ని నాశనం చేయడానికి నేను చేయని ప్రయత్నం లేదు. కానీ ఈ క్షణం నా ఆశ నెరవేరబోతుంది.
మంగళ: ( మనసులో) లేదు నీకు మళ్లీ నిరాశ ఎదురవబోతుంది మనోహరి. నువ్వు కన్న కలలన్నీ కరిగిపోతాయి. అరుంధతి ఆత్మ ఎక్కడికి వెల్లదు. ఇక్కడే ఉంటుంది.
మను: ఏంటి సైలెంట్ గా ఉన్నావు..
మంగళ: ఏం లేదు..
మను: ఏదైనా చెయ్యకూడని పని ఏదైనా చేశావా…? ఏదైనా ఉంటే ముందే చెప్పి చావు
మంగళ: అయ్యయ్యో అందరూ నన్ను అనుమానిస్తున్నారేంటి..? నా ముఖం మీద తప్పు చేసినట్టు ఏమైనా రాసి పెట్టి ఉందా..?
మను: నీ జాతకం అలాంటిది మరి
మంగళ: ( మనసులో) నీది మహర్జాతకం మరి
మను: ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు తర్వాత ఏదైనా తేడా జరిగిందో నిన్ను అసలు వదిలిపెట్టను.. ఆరును చంపినట్టు నిన్ను చంపేస్తాను..
మంగళ: ( మనసులో నువ్వు చంపడం ఎందుకు..? కలశం మార్చానని తెలిస్తే అల్లుడుగారే చంపేస్తారు.. అల్లుడు గారు అరుంధతికి పెట్టాల్సిన పిండాన్ని నాకు పెడతారు.) ఏం చేయలేదని చెప్పాను కదా..?
మను: సరేలే
అంటూ మాట్లాడుకుంటుండగా.. అమర్ అస్థికలు తీసుకుని నది లోకి వెళ్తాడు. అప్పుడే చంభా దగ్గర నుంచి నిజమైన అస్థికలు తీసుకుని అంజు వచ్చి అమర్‌కు జరిగింది చెప్తుంది. దీంతో పంతులు మరోసారి పూజ చేసి అస్థికలు అమర్‌కు ఇవ్వగానే.. అమర్ నదిలోకి వెళ్లి అస్థికలు నిమజ్జనం చేస్తాడు. అంతసేపు అక్కడే ఉండి భాగీకి కనిపించిన ఆరు కనిపించదు. దీంతో భాగీ అక్కా అంటూ చుట్టూ వెతుకుతుంది. ఎక్కడా ఆరు కనిపించదు. దీంతో భాగీ కళ్లు తిరిగి కింద పడిపోతుంది. అమర్ టెన్షన్ పడుతూ నది దగ్గర నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి భాగీని పట్టుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















