Nindu Noorella Saavasam Serial Today November 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ : పిల్లలను తిట్టిన మనోహరి – మనోహరికి వార్నింగ్ ఇచ్చిన భాగీ
Nindu Noorella Saavasam Today Episode: ఎక్స్ కర్షన్ కు వెళ్లాలని పిల్లుల చెప్పడంతో మనోహరి వాళ్లను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: గుప్త మంత్రం పటించగానే మాయా పేటిక వస్తుంది. అందులో జరగబోయేది చూసి గుప్త షాక్ అవుతాడు. ఒక్కరోజులో ఇంత విధ్వంసం జరగనుందా అనుకుంటూ బయపడతాడు. ఇంతలో అక్కడికి ఆరు వస్తుంది.
ఆరు: గుప్త గారు మీకు కొంచెం మెంటల్ ఉంది కానీ మంచివారే.. అరుస్తారు.. కరుస్తారు.. చిరాకుపడతారు కానీ చెప్పిన పని చేస్తారు. నేను అడిగానని మాయా పేటిక తెప్పించి మళ్లీ ఆలోచిస్తున్నారా..?
గుప్త: వద్దు బాలిక ఇది నువ్వు వీక్షించరాదు.. మేము మాత్రమే వీక్షించాలి. మాయా పేటికను మానవులు వీక్షించరాదు.
ఆరు: అయితే నేను మానవురాలిని కాదు కదా..? నేనొక ఆత్మను ఇటివ్వండి.
గుప్త: బాలిక మాయా పేటిక విషయంలో చమత్కారం వలదు. జరుగుతున్నది వీక్షించాలి తప్పా జరగబోయేది వీక్షించాలి అనుకోకూడదు.
ఆరు: సరే మీరు ఆ పేటికలో ఏం చూశారో చెప్పండి.
గుప్త: నేనేమీ వీక్షించలేదు.
ఆరు: ఏంటి గుప్త గారు మాట ఒకటి వస్తుంది. మీ ముఖం ఇంకోలా ఉంది. నా కుంటుంబంలో ఎవరికైనా ఏమైనా అవుతుందా..?
అని ఆరు అడగ్గానే నువ్వు తక్షణమే మా లోకానికి వస్తానంటే నిజం చెప్తాను అంటాడు గుప్త. అయితే తాను రావడం కుదరదని కరాకండిగా చెప్పి వెళ్లిపోతుంది ఆరు. ఇంతలో పిల్లలను తీసుకుని స్కూల్ నుంచి రాథోడ్ వస్తాడు. పిల్లలు డల్లుగా రావడం చూసిన ఆరు వారి దగ్గరకు వెళ్తుంది. పిల్లుల లోపలికి వెళ్తారు. హాల్లో ఉన్న అమర్ ఏమైందని అడుగుతాడు.
రాథోడ్: సార్ మీతో ఒక విషయం చెప్పాలి.
అమర్: చెప్పు రాథోడ్ ఏం జరిగింది.
రాథోడ్: ఈరోజు అంజు పాప మీద కిడ్నాప్ అంటెప్ట్ జరిగింది.
అమర్: ఏమైంది అంజు అసలు ఏం జరిగింది.
అని అమర్ అడగ్గానే స్కూల్ లో జరిగిన విషయం చెప్తుంది అంజు. భాగీ భయంతో ఏడుస్తూ అంజును హగ్ చేసుకుంటుంది.
భాగీ: అంజు నీకేం కాలేదు కదా..? దెబ్బలు ఏం తగల్లేందు కదా..?
అంజు: నేను బాగానే ఉన్నాను.
నిర్మల: అంజు పాపను హాస్పిటల్ కు తీసుకెళ్దాం అమర్. అంజు భయపడింది మళ్లీ జ్వరం వస్తుందేమో…?
అంజు: ఎందుకు నాన్నమ్మ హాస్పిటల్ కు నేనేం భయపడలేదు.
శివరాం: ఇంత మాత్రం దానికే ఈ పొట్టిది భయపడతుందా..? వాళ్లనే బెదిరిస్తుంది.
భాగీ: ఏమైంది అమ్ము అలా చూస్తున్నావు.
అమ్ము: ఎల్లుండి ఎక్స్ కర్షన్ కు వెళ్దామని ప్రిన్సిపాల్ చెప్పారు. ఇప్పుడు వెళ్లకపోతే క్లాస్ లీడర్‌గా నన్ను తీసేస్తుంది.
మనోహరి: ఏయ్ ఇక్కడ ప్రాణాలే పోతుంటే.. పోస్ట్ పోతుంది అటారేంటి..? పోతే పోయింది వెదవ పోస్ట్, అదేదో ప్రెసిడెంట్ పోస్ట్ లా ఫీలవుతున్నారేంటి..?
భాగీ: మనోహరి గారు పిల్లలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మనం చెప్పిన ప్రతిదీ అర్థం చేసుకునే వయసు, అనుభవం వాళ్లకు లేదు. మనమే కొంచెం నిదానంగా అర్థం అయ్యేలా చెప్పాలి. ఇంకొకసారి పిల్లల గురించి ఇలా మాట్లాడితే నేను ఇంత మంచిగా మాట్లాడను మనోహరి గారు. ఎక్స్ కర్షన్ ఎల్లుండి రేపే ఆయన వాళ్లను పట్టుకుంటే ఎల్లుండి హ్యాపీగా పంపొచ్చు.
రాథోడ్: ఏం చెప్పావు మిస్సమ్మ.. నువ్వు సూపర్..
శివరాం: ఒకవైపు భర్త సామర్థ్యాన్ని పొగుడుతూనే పిల్లలకు మంచి బూస్ట్ ఇచ్చావు మిస్సమ్మ నువ్వు సూపర్.
అని చెప్పగానే అమర్ అందరికీ జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రామ్మూర్తికి ఫోన్ చేసి ఇక్కడకు రమ్మనమని చెప్పు అంటూ నిర్మల, భాగీకి చెప్తుంది. దీంతో భాగీ రామ్మూర్తికి ఫోన్ చేస్తుంది. ఇంటికి త్వరగా రమ్మని చెప్తుంది. రామ్మూర్తి మమ్మల్ని ఎవరేం చేస్తారమ్మా ఇంటి చుట్టు ఇండ్లు ఉంటాయి. మాకేం ప్రాబ్లం కాదులే అని చెప్తాడు. అయితే ఏదైనా సమస్య వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి అని చెప్తుంది భాగీ. తర్వాత రూంలో మనోహరి అటూ ఇటూ తిరుగుతుంది. ఎప్పుడు ఎవడు ఎటు నుంచి వచ్చి అటాక్ చేస్తారోనని భయంగా ఉంది. అసలు ఇదంతా ఆ పిల్ల రాక్షసి వల్లే అనుకుంటూ భయపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
Also Read: అసలా 3 గంటల్లో ఏం జరిగింది? త్రినయని.. త్రినేత్రి.. గుర్తుంచుకునేదెలా?