Nindu Noorella Saavasam Serial Today November 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్‌కు డేంజర్ ఉందన్న మిలటరీ – అంజును కిడ్నాప్ చేయాలనుకున్న తీవ్రవాదులు
Nindu Noorella Saavasam Today Episode: అమరేంద్ర ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేయోచ్చన్న సమాచారంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఉత్కంఠగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: అమ్మును ప్రిన్సిపాల్ పిలిచిందని మళ్లీ తనకు ఎలాంటి పనిష్ మెంట్ ఇవ్వబోతుందోనని అంజు భయపడుతుంది. ఇంతలో రామ్మూర్తి వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఆనంద్, ఆకాష్ ఇద్దరూ అమ్ము ప్రిన్సిపాల్ రూంలోకి వెళ్లిందని అందుకే అంజు భయపడుతుందని చెప్తారు. భయం దేనికి అని రామ్మూర్తి అడగ్గానే అరోజు తాను చేసిన తప్పులు చెప్తుంది అంజు. దీంతో రామ్మూర్తి షాక్ అవుతాడు. ఇంతలో అమ్ము వస్తుంది. అంజు కంగారుగా ఏమైందని అడుగుతుంది. ఏమీ కాలేదని ఎక్స్ కర్షన్ కు వెళ్లాలని అందుకోసమే మేడం నన్ను పిలిచిందని చెప్తుంది అమ్ము. దీంతో ఊపిరి పీల్చుకున్న అంజు హ్యాపీగా క్లాస్ రూంలోకి వెళ్తుంది. గార్డెన్ లో కోపంగా ఆరు అటూ ఇటూ తిరుగుతుంది.
గుప్త: ఏమిటి బాలిక నువ్వు ఇంకా ఆ సాంబ్రాణి దూపం వద్దే ఆగితివా..?
ఆరు కోపంగా చూస్తుంది. ఇంతలో రాథోడ్ ఏదో ఫైల్ తీసుకుని వస్తాడు.
ఆరు: గుప్త గారు.. రాథోడ్ అంత కంగారుగా ఫైల్ తీసుకుని వెళ్తున్నాడేంటి చూద్దాం రండి.
గుప్త: అ చూద్దాం ఎవరు ఏ పని చేస్తున్నారో ఎక్కడ ఏమీ జరుగుతుందో వీక్షించడం తప్పా మాకేమీ పని లేదనుకుంటివా..?
Also Read: దీపకి మల్లెపూలు ఇచ్చిన కార్తీక్.. దీపని చంపడానికి జ్యోత్స్న ప్లాన్!
మరోవైపు లోపలికి వెళ్లిన రాథోడ్ ఫైల్ అమర్‌కు ఇస్తాడు. ఫైల్ చూసిన అమర్ సీరియస్‌గా రాథోడ్ మన వాళ్లతో మాట్లాడాలి అంటాడు. అందరినీ హాల్లోకి పిలుస్తాడు రాథోడ్. ఆరు గుమ్మం దగ్గరకు వచ్చి వింటుంది.
అమర్: ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విని మీరెవ్వరూ కంగారు పడరని చెప్తున్నాను.
శివరాం: అసలు విషయం ఏంటో చెప్పు అమర్.
అమర్: స్కూల్ లో పిల్లల మీద అటాక్ జరిగిన విషయం మీకు తెలుసు కదా..? వాళ్లే ఇప్పుడు మన మీద అటాక్ చేయబోతున్నారని సమాచారం వచ్చింది.
నిర్మల: అయ్యో భగవంతుడా.. వినాయక చవితి రోజు గండం నుంచి బయటపడ్డామని ఆనంద పడే లోపే మళ్లీ ఇంకొక గండమా..?
శివరాం: ఏయ్ నోర్మూయ్.. అమర్ ఇప్పుడే చెప్పాడు కదా భయపడొద్దని. చూడండి మనలో ఎవరు భయపడినా అమర్ ధైర్యం కోల్పోయేలా చేసి శత్రవుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.
భాగీ: మా గురించి మాకు ఏ భయం లేదు మామయ్యా. నా భయం ఆయన గురించే.. మమ్మల్ని కాపాడుతూ వాళ్లను ఎదుర్కొంటే ఆయనకు ఏమైనా అవుతుందేమోనన్న భయం. ఆయనకు ఏమైనా అయితే ఈ ఇంట్లో ఆయన కాపాడిన ఏ ఒక్కప్రాణం నిలవదు మామయ్య.
అమర్: నాకేం కాదు మిస్సమ్మ.. రాథోడ్ స్కూల్ కు వెళ్లి పిల్లలను తీసుకునిరా..? సెక్యూరిటీ టీం వచ్చే వరకు ఎవ్వరూ భయటకు వెళ్లొద్దు.
అని చెప్పి అమర్ వెళ్లిపోతాడు. గుమ్మం దగ్గర నుంచి అంతా విన్న ఆరు గుప్త దగ్గరకు పరుగెత్తుకెళ్లి మాయ పేటిక ఇవ్వమని అడుగుతుంది. అది ఇస్తే ఆ దుర్మార్గులు ఎక్కడున్నారో కనిపెడతానని అడుగుతుంది. దీంతో గుప్త విషయం అర్థం కాక ఇరిటేటింగ్ గా మరి కొన్ని రోజులు నేను ఇచ్చటనే ఉన్నచో మతిస్థిమితం కోల్పోయెదను అనుకుంటూ వెళ్లిపోతాడు. స్కూల్ దగ్గరకు వచ్చిన తీవ్రవాదులు అంజును కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. అందుకోసం ఒక తీవ్రవాది స్కూల్ లోపలికి వెళ్తాడు. అంజు చూసి కిడ్నాప్ చేద్దాం అనుకునే లోపు అంజు ఎస్కేప్ అవుతుంది. ప్రిన్సిపాల్ అమ్మును ఎక్స్ కర్షన్ కు తీసుకెళ్లి ఎలాగైనా ఇరికించాలని ప్లాన్ చేస్తుంది. అంజు ప్రిన్సిపాల్ దగ్గరకు వెల్లి గొడవ పడుతుంది. మరోవైపు అమర్ ఇంటికి సెక్యూరిటీగా స్పెషల్ ఫోర్స్ వస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
Also Read: భూమికి ప్రపోజ్ చేయాలనుకున్న గగన్ – వంశీ, ఇందులకు వార్నింగ్ ఇచ్చిన రమేష్