అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ :  భాగీని ఇంటికి తీసుకొచ్చిన అమర్‌ - మనోహరికి భాగీ వార్నింగ్

Nindu Noorella Saavasam Today Episode:  అమర్‌ తో పాటు ఇంటికి వచ్చిన భాగీ, మనోహరికి వార్నింగ్‌ ఇవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌, రామ్మూర్తితో మిస్సమ్మను తీసుకెళ్లడానికే వచ్చాను. అని చెప్పగానే రామ్మూర్తి తీసుకెళ్లండి బాబు.. భాగీ ఇప్పుడు  మీ భార్య, వాళ్లకు అమ్మ.. మీరు ఎప్పుడైనా తీసుకెళ్లండి అని చెప్తాడు రామ్మూర్తి. దీంతో అమ్ము హ్యాపీగా అయితే ఇప్పుడే మిస్సమ్మను తీసుకెళ్లవచ్చా..? అని అడుగుతుంది. అది భాగీ ఇష్టం అమ్మా ఇప్పుడే వెళ్లాలి అనుకుంటే వెళ్లండి. రెండు రోజులు ఉండి వెళ్లాలి అనుకుంటే వెళ్లొచ్చు అని చెప్తాడు రామ్మూర్తి. ఇంతలో మిస్సమ్మ నేను రెండు రోజులు ఉండి వస్తాను. ఆయన రమ్మని గట్టిగా పిలవట్లేదు కదా..? కానీ మా నాన్న ఇక్కడ ఉండమని ప్రేమగా అడుగుతున్నారు అందుకే.

అమర్‌: మిస్సమ్మ ఇంటికి వెళ్దాం పద. నేను పిల్లలు నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాం. రెండు రోజులు ఆగి కాదు. ఇవాళే మాతో రా.. సరేనా..?

భాగీ: సరే అండి ఇప్పుడే బట్టలు తెచ్చుకుంటాను.

రామ్మూర్తి: బాబుగారు గంటన్నర సేపు రాహుకాలం ఉంది. అది వెళ్లాక మీరు వెల్లుదురు. ఇబ్బందేం లేదు కదా..? బాబు.

అమర్‌: ఇబ్బందేం లేదండి.

అని చెప్పగానే రామ్మూర్తి పిల్లలకు ఐస్‌క్రీమ్‌ తీసుకురావడానికి వెళ్తుంటే.. అమర్‌ బయటకు వెళ్లి సారీ చెప్పబోతుంటే.. వద్దని రామ్మూర్తి మీ ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య వచ్చినా.. మీకు మీరే పరిష్కరించుకోవాలి. అని చెప్పి వెళ్తాడు. అమర్‌ లోపలికి వచ్చేసరికి భాగీ పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. అది చూసి అమర్‌ ఎమోషన్‌ అవుతాడు. మరోవైపు యముడు కోపంగా ఎవరు తనను డిస్టర్బ్‌ చేశారని గుప్తను తిడతాడు. దీంతో గుప్త ఆరు వల్లే మీకు డిస్టర్బ్‌ అవుతున్నారని చెప్తాడు.

యముడు: ఇంత కష్టంలో కూడా ఆ బాలిక ఇంత సంతోషంగా ఎలా ఉంది.

గుప్త: అయ్యో ప్రభు ఇంత జరిగినా మీకు ఇంకా ఆ బాలిక గురించి అర్థం కాలేదు. ఆ బాలిక తనకు తన కుటుంబానికి ఎదురైన కష్టాలను చూసిన తర్వాత నాకు మానవ లోకంపై అభిమానం ఏర్పడింది.

యముడు: ఏది ఏమైనా ఈ అమావాస్య నాడు ఆ బాలికను మనం మన లోకానికి తీసుకెళ్లాలి.

గుప్త: నా అనుభవంతో చెప్తున్నాను. మనం అనుకున్నప్పుడు ఆ బాలిక రాదు.

ఇంతలో ఆరు వస్తుంది. ఎంటి రాజు గారు మా గుప్త గారిని భయపెడుతున్నారు అని అడుగుతుంది. నన్ను ఎలా తీసుకెళ్లాలా అని ప్లాన్‌ చేస్తున్నారా..? అని అడుగుతుంది. ప్రణాళిక వేయాల్సిన అవసరం మాకెం ఉంది. అని యముడు చెప్పగానే యముడిని మళ్లీ పొగడ్తలతో ముంచెత్తుతుంది ఆరు. భాగీ వస్తుందని ఆరు సంతోషంగా ఉంటుంది. ఇంతలో అమర్‌, భాగీ పిల్లలు వస్తారు. వాళ్లను చూసిన మనోహరి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. నిర్మల వాళ్ళకు దిష్టి తీస్తుంది.

అంజు: నిమ్ము డార్లింగ్ ఇది నీకు కొంచెం ఎక్కువగా అనిపించడం లేదా..?

నిర్మల: అనిపించడం లేదు. ఇలా మీ అందరిని సంతోషంగా చూశారు కాబట్టే మిస్సమ్మ మా ఇంట్లోంచి వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ ఆ దేవుడి దయ వల్ల మీరందరూ కలుసుకున్నారు.

అంజు: హారతి మిస్సమ్మకు కదా.. ఇచ్చుకోండి వెళ్లిపోతాను.

భాగీ: నువ్వు కూడా ఉంటేనే మన ఫ్యామిలీ కంప్లీట్‌ అవుతుంది అంజు నువ్వు కూడా ఉండు. మీరు తీయండి అత్తయ్యా..

అని చెప్పగానే నిర్మల దిష్టి తీస్తుంది. అంతా గమనిస్తున్న మనసులో రగిలిపోతుంది. అందరూ లోపలికి వస్తారు. భాగీని చూసి మనోహరి ముఖం పక్కకు తిప్పుకుంటుంది. అందరూ వెళ్లిపోయాక భాగీ, మనోహరి రూంలోకి వెళ్తుంది. ఏం జరిగింది మను.. నీ కాలు విరిగింది అని విన్నాను. ఎక్కడ పడితే అక్కడ కాలు పెడితే ఇలాగే ఉంటుంది అని వార్నింగ్‌ ఇస్తుంది. నన్ను పర్మినెంట్‌ గా పంపించేసి నువ్వు ఆయన పక్కన పర్మినెంట్‌ గా సెటిల్‌ అవుదామనుకున్నావా..? అని అడుగుతుంది. ఆరు ఫోటో గురించి పిల్లలకు నువ్వే నూరిపోశావా అంటూ నిలదీస్తుంది. దీంతో ఒక్కసారి పంపించిన దాన్ని మళ్లీ పంపిచలేను అనుకున్నావా..? అనగానే నువ్వు ఎన్నిసార్లు పంపించినా.. నేను మళ్లీ మళ్లీ వస్తాను. అది నా పవర్‌ కాదు. అంటూ తాళి చూపిస్తూ దీని పవర్‌. అని చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget