Nindu Noorella Saavasam Serial Today May 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: రాథోడ్ కు వార్నింగ్ ఇచ్చిన భాగీ – భాగీని కూల్ చేసిన అమర్
Nindu Noorella Saavasam Today Episode: అమర్ చెప్పాడని భాగీని బయటకు తీసుకెళ్లడానికి వచ్చిన రాథోడ్‌కు భాగీ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీకి ఇంట్లోనే ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్‌తో హాస్పిటల్‌కు తీసుకెళ్దామా అని అడుగుతాడు అమర్. దీంతో డాక్టర్ అవసరం లేదని నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్లిపోతుంది.
అమర్: అసలు ఎలా పడ్డావు
భాగీ: బట్టలు ఆరేసి లోపలికి వస్తుంటే జారి పడ్డానండి
నిర్మల: నాన్నా అమర్ ఆ దేవుడి దయవల్ల మన భాగీకి పెద్ద ప్రమాదమే తప్పింది.
అమర్: అసలు చూసుకుని నడవమని నీకు ఎన్నిసార్లు చెప్పాను.. ఇవాళ ఎంత ప్రమాదం తప్పిందో చూశావా..?
భాగీ: నేను చూసుకునే నడుస్తున్నానండి కానీ అక్కడ వాటర్ ఉన్నాయి. అందుకే జారి పడిపోయాను
అమర్: స్టెప్స్ దగ్గర వాటర్ ఎలా వచ్చాయి.. అసలు అక్కడ వాటర్ ఎవరు పోశారు..
మనోహరి: అమర్ అక్కడ వాటర్ ఎవరు పోస్తారు.. మిస్సమ్మ బట్టలు తీసుకుని వెళ్లినప్పుడు పడి ఉండొచ్చు..?
నిర్మల: సరే జరిగిందేదో జరిగిపోయింది. భాగీ డాక్టర్ చెప్పింది గుర్తుంది కదా..? నాలుగు రోజులు బెడ్ మీద నుంచి కిందకు దిగకూడదు
శివరాం: ఆహా మాటలైతే చెప్పావే కానీ బెడ్ మీద కూర్చోబెట్టి సేవలు చేయమంటే ఎవరు చేస్తారే
అనామిక: నేను చేసేదాన్నే కానీ పిల్లలతోనే నాకు టైం సరిపోతుంది.. ఆంటీ చూసుకుంటారేమో
నిర్మల: అమ్మో నేనా కూర్చుంటే లేవడానికే గంట పడుతుంది. ఇక భాగీని ఏం చూసుకుంటాను అమ్మా
మనోహరి: అమర్ తనని వాళ్లింటికి పంపించేద్దాం.. అక్కడైతే వాళ్ల నాన్నా పిన్ని ఉంటారు. మళ్లీ నయం అయ్యాక ఇక్కడికి రమ్మని చెబుదాం..
అమర్: తన ఇల్లు ఇదే మనోహరి.. నువ్వు ఏ ఇంటికి పంపించాలి అనుకుంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు.
మనోహరి: నేను అలా అనలేదు అమర్. లాస్ట్ టైం నువ్వు ఇబ్బంది పడ్డట్టు మళ్లీ ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పాను
అమర్: ఇబ్బందా..? నా భారం నేను చూసుకోవడంలో ఏం ఇబ్బంది ఉంది. అయినా ఇబ్బంది ఉన్నా కూడా చేయాలి.. చేస్తాను. భర్తగా అది నా బాధ్యత భాగీని నేను చూసుకుంటాను. ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు
మనోహరి కోపంగా వెళ్లిపోతుంది.
అనామిక: నాకు తెలిసి ఇదంతా ఆ మనోహరే చేసి ఉంటుంది. దాన్ని ఏం చేసినా పాపం లేదు (మనసులో అనుకుని) జాగ్రత్త భాగీ..
అంటూ బయట లాన్‌లోకి వెళ్తుంది. అక్కడ యముడు, చిత్రగుప్త, విచిత్రగుప్త ఉంటారు.
అనామిక: సారీ రాజు గారు లోపల నా చెల్లి పడిపోయిందన్న బాధలో ఉండిపోయాను సారీ ( ఎవ్వరూ పలకరు.) ఏమైంది గుప్త గారు ఎందుకు ముగ్గురు అలా ఉన్నారు
యముడు: నువ్వు ఈ శరీరంతో ఉండటం మంచిది కాదు బాలిక. మా మాట విని మాతో రమ్ము
అనామిక: ఏంటి రాజు గారు జరిగింది అంతా చూసి కూడా నన్ను రమ్మంటున్నారా..? మనోహరి ఎంత దుర్మార్గురాలో తెలిసి కూడా నన్ను తీసుకెళ్తారా..?
యముడు: అవును బాలిక నీ సమయం ముగిసింది. నువ్వు ఇచ్చట ఉన్నన్నీ రోజులు నీకు కష్టాలే తప్పా సుఖం ఉండదు. నువ్వు చేసిన పుణ్యాలకు స్వర్గానికి వెళ్లి అనుభవించుము
అనామిక: నా కుటుంబం ఇక్కడ కష్టాల్లో ఉంటే నన్ను వెల్లి ఆనందంగా ఉండమంటున్నారా..? రాజు గారు
యముడు: బాలిక నీకు ఈ కుటుంబమునకు ఎటువంటి సంబంధం లేదు.. నీ మరణంతో రుణ బంధం ముగిసింది. మా మాట విని మాతో రమ్ము
అనామిక: సారీ రాజు గారు నేను రాలేను
యముడు: వచ్చే పౌర్ణమి నాటికి నువ్వు మా లోకానికి రాలేకపోతే నీకు మరు జన్మ ఉండదు బాలిక. నీ పాపపుణ్యాలు సమానం అయిపోతాయి.
అనామిక: పర్వాలేదు రాజు గారు ఈ లోపు మనోహరి అంతం చేసి వస్తాను.
చిత్రగుప్త: ఆలోపు నువ్వు చేయకపోతే
అనామిక: రాజు గారు చెప్పినట్టు నా జన్మ గతించిపోతుంది
అంటూ కరాకండిగా చెప్తుంది అనామిక. యముడు కోపంగా వెళ్లిపోతాడు. భాగీ దగ్గరకు వీల్ చైర్ తీసుకుని వెళ్తాడు రాథోడ్.
రాథోడ్: మిస్సమ్మ నువ్వు రెండు రోజులుగా రూంలోనే ఉన్నావు కదా నిన్ను బయటకు తీసుకురమ్మని మా సార్ నన్ను పంపించాడు.
భాగీ: మీ సార్ ఎక్కడ…?
రాథోడ్: బయట ఫోన్ మాట్లాడతున్నారు
భాగీ: మీ సారే లోపలికి వచ్చి నన్ను ఎత్తుకుని ప్రేమగా బయటకు తీసుకెళ్లాలి.
అని చెప్పగానే రాథోడ్ వెళ్లి అమర్‌కు చెప్తాడు. అమర్ లోపలికి వచ్చి భాగీని ఎత్తుకుని లాన్‌లోకి తీసుకెళ్తాడు. అక్కడే కూర్చున్న మనోహరిని చూసి భాగీ కళ్లు ఎగరేస్తుంది. దీంతో భాగీ హర్ట్ అవుతుంది. దీన్ని చంపకుండా అనవసరంగా వదిలేశాను అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















