అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today March 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని చంపేస్తానన్న మీనన్‌ - ఆందోళనలో పిల్లలు, అమర్‌

Nindu Noorella Saavasam Today Episode: భాగీని స్టేజీ మీదకు పిలిచిన మీనన్‌ గన్‌ తీసి చంపబోతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.      

Nindu Noorella Saavasam Serial Today Episode: అమ్ము డాన్స్‌ బాగా చేసి వచ్చి భాగీని హగ్‌ చేసుకుని థాంక్స్‌ చెప్తుంది. ఆ వెంటనే అంజు కూడా యాక్టింగ్‌ సూపర్ గా చేస్తుంది. అంజు యాక్టింగ్‌ చూసిన భాగీ, ఆరు హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు మ్యాన్‌ హోల్‌ నుంచి మీనన్‌ తన మనుషులతో స్కూల్‌ లోపలికి ఎంటర్‌ అవుతుంటాడు. అమర్‌ అనుమానంగా ఆలోచిస్తుంటే ప్రిన్సిపాల్‌ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి స్కూల్‌ బ్యాక్‌ సైడ్‌ వెళ్తుంటాడు. అక్కడే కాపలా ఉన్న కానిస్టేబుల్‌ను చంపాలనుకుంటుంది మనోహరి. అక్కడికి అమర్‌ రావడం చూసి షాక్‌ అవుతుంది. చాటుగా వెళ్లిపోతుంది. 

అమర్‌: ఎవరైనా వచ్చారా ఇక్కడికి

కానిస్టేబుల్‌: ఎవరూ రాలేదు సార్‌..

అమర్‌: ఇక్కడ ఇంకేమైనా రూట్స్‌ ఉన్నాయా..?

కానిస్టేబుల్‌: ఏం లేవు సార్‌..

అమర్‌: చుట్టు పక్కల ఎవరైనా తిరుగుతున్న అలికిడి వినిపిస్తుందా..?

కానిస్టేబుల్‌: అలాంటిదేం లేదు సార్‌

అమర్‌: ఓకే టేక్‌ కేర్‌

అని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అమర్‌. అమర్‌ వెళ్లడం చూసిన మనోహరి కర్ర తీసుకుని వచ్చి కానిస్టేబుల్‌ ను తల మీద కొడుతుంది. దీంతో కానిస్టేబుల్‌ స్పృహ తప్పి కింద పడిపోతాడు. అదే కర్రతో మనోహరి మ్యాన్‌ హోల్‌ కు ఉన్న లాక్‌ పగులగొట్టి మీనన్‌ వాళ్లను బయటకు పిలుస్తుంది. మీనన్‌ వాళ్లు బయటకు వస్తారు.

మీనన్‌:  అమర్‌కు అనుమానం వచ్చినట్టు ఉంది కదా..?

మనోహరి:  అవును ఇక్కడ ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం పదండి..

అని చెప్తూ.. మీనన్‌ వాళ్లను పక్కకు తీసుకెళ్తుంది మనోహరి.

మనోహరి: అదిగో అదే అడిటోరియం ఇప్పుడే మినిస్టర్‌ అక్కడికి వెళ్లాడు.

మీనన్‌:  థాంక్స్‌ మిత్రమా ఆపదలో వచ్చి ఆదుకున్నావు

మనోహరి:  డబ్బులు ఇవ్వాలని మర్చిపోకు

మీనన్‌: నీకు చెప్పిన అమౌంట్‌ నీకు చేరుతుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లొచ్చు..ఇక మేము చూసుకుంటాం

మనోహరి:  అవును మీరు అటాక్‌ చేస్తుంది. మీకు కావాల్సిన మనుషుల్ని జైలు నుంచి విడిపించుకోవడానికే కదా..?

మీనన్‌:  అవును.. నీకెందుకు ఆ డౌటు..?

మనోహరి: ఇప్పుడు ఆడిటోరియం మీ కంట్రోల్‌ లోకి తీసుకున్నాక మీరు ఎవరినైనా కావాలంటే చంపేయవచ్చా

మీనన్‌:  నువ్వు ఎవరి చావు కోరుకుంటున్నావో చెప్పు చాలు

మనోహరి: భాగీ.. అమరేంద్ర భార్య అది మీ అటాక్‌లో చనిపోవాలి.

మీనన్‌:  పెద్దతలకాయే కొంచెం రిస్కే..?

మనోహరి: నువ్వు వాళ్లను కంట్రోల్‌ లోకి తీసుకున్నంత మాత్రాన అమర్‌ నీ మాట వింటాడన్న గ్యారంటీ లేదు. అదే నువ్వు అమర్‌ భార్యను చంపితే ఆ తర్వాత పిల్లలను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాడు.

మీనన్‌: సరే ప్లాన్‌ బాగానే ఉంది. కానీ నా పని అయ్యాకే నీ పని చేస్తాను.

మనోహరి:  ఆ అమ్మాయి ఎవరో నీకు చూపిస్తాను. ఆడిటోరియంలోకి వెళ్లే మార్గం కూడా చూపిస్తాను రండి

అంటూ మీనన్‌ ను తీసుకుని అడిటోరియం వైపు వెళ్తుంది మనోహరి. ఆడిటోరియం దగ్గరకు వెళ్లాక ఏమీ తెలియనట్టు మనోహరి లోపలికి వెళ్లి కూర్చుంటుంది. ఇంతలో మీనన్‌ గన్‌ తీసుకుని స్టేజీ మీదకు వచ్చి మినిస్టర్‌కు గన్‌ ఎక్కు పెట్టగానే.. సెక్యూరిటీ మీనన్‌ మీదకు వెళ్తుంటే.. సెక్యూరిటీని కాలుస్తాడు మీనన్‌.

మీనన్‌: అమరేంద్ర  గారి భార్య గారు ఒక్కసారి పైకి రండమ్మా..?

అని మీనన్‌ పిలవగానే.. భాగీ స్టేజీ మీదకు వెళ్తుంది.

మీనన్‌: అమ్మా నువ్వు మొండోడిని పెళ్లి చేసుకున్నావు.. అతని వల్ల నీ ప్రాణాలు పోతున్నాయి. హ్యాపీ జర్నీ భాగీ

అంటూ భాగీని మీనన్‌  కాల్చస్తాడు. ఇంతలో అమర్‌ వస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget