Nindu Noorella Saavasam Serial Today march 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్ కు సలహాలు ఇచ్చిన రాథోడ్ - లాల్ సింగ్ ముందు నటించిన భాగీ
Nindu Noorella Saavasam serial Today Episode march 23rd: అమ్మును ఢిల్లీలో డ్రాప్ చేసి వచ్చాక అమర్‌కు కొత్త టెన్షన్ మొదలవుతుంది. దీంతో రాథోడ్ సలహా ఇస్తాడు.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఢిల్లీకి బయలుదేరుతున్న అమ్ము ఆరు ఫోటో దగ్గరకు వెళ్లి ఏడుస్తుంటే.. వెనక నుంచి దగ్గరకు వెళ్లిన బుజ్జమ్మ ఆరులాగే అమ్ము అని పిలుస్తుంది. బుజ్జమ్మ పిలుపునకు అందరూ షాక్ అవుతారు.
బుజ్జమ్మ: అమ్ము మా అందరికి దూరంగా వెళ్తున్నానని బాధపడకు డాడీకి మంచి పేరు తీసుకురావాలి. నీ మీద డాడీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకు సరేనా
అమర్, మిస్సమ్మ, రాథోడ్ ఎమోషనల్ అవుతారు.
భాగీ: బుజ్జమ్మ మాట్లాడుతుంటే సాక్ష్యాత్తు మా అక్క మాట్లాడినట్టే ఉంది కదా రాథోడ్..
రాథోడ్: మరి బుజ్జమ్మ ఎవరు మళ్లీ పుట్టిన అరుంధతి అమ్మే కదా మిస్సమ్మ
అమర్: (మనసులో) బుజ్జమ్మ మాట్లాడుతుంటే ఆరు గొంతులా వినిపిస్తుందేంటి..? బహుషా ఆరు బతికి ఉంటే ఇలాగే చెప్పేదేమో..?
బుజ్జమ్మ: అమ్ము ఏడవకుండా బాధపడకుండా వెళ్లు.. సంతోషంగా చదువుకో.. నీతో రోజూ ఫోన్ లో మాట్లాడతాను. అప్పుడప్పుడు నిన్ను చూడటానికి కూడా వస్తాను.. నీకేం భయం లేదు.. మేమంతా నీకు ఉన్నాము.
యాదమ్మ: ఏంటి మనోహరి ఆ పిల్ల పెద్ద ఆరిందలా మాట్లాడుతుంది.
మనోహరి: అది ఆరిందా కాదు మళ్లీ పుట్టిన అరుంధతి.. పై చదువులకు వెళ్తున్న కూతురుకు సెండాఫ్ ఇస్తుంది
అమ్ము: ( బుజ్జమ్మను హగ్ చేసుకుని మనసులో) థాంక్యూ అమ్మా.. బయలుదేరుతాను అంజు, బై ఆనంద్.. బై ఆకాష్.. మీరు కూడా బాగా చదువుకోండి.. వెళ్లోస్తాను మిస్సమ్మ
భాగీ: నువ్వు దూరంగా వెళ్లిపోతున్నాను అనుకోకు మేము ఫోన్‌లో టచ్ లో ఉంటాం.. నువ్వు మాత్రం చదువు మీద కాంసట్రేట్ చేయ్..
అమర్: ఫ్లైట్‌కు టైం అవుతుంది అమ్ము వెళ్దాం
అమ్ము: డాడ్ ఐ మిస్ యూ..
అమర్: అమ్ము నేను మిమ్మల్ని డిసిప్లిన్ గా పెంచినా మీరంటే నాకు ప్రాణం ముఖ్యంగా నువ్వంటే.. నాకెంతో ఇష్టం అమ్ము.. నిన్ను అంత దూరం పంపించడం నాకు ఇష్టం లేదు.. కానీ మీ అమ్మ ఆశయం నువ్వు నెరవేర్చాలి అంటే నువ్వు తప్పకుండా వెళ్లాలి
అంటూ అమ్మును తీసుకెళ్లి ఢిల్లీలో డ్రాప్ చేసి వస్తాడు. ఎయిర్ ఫోర్ట్ నుంచి అప్పుడే ఇంటికి వచ్చిన అమర్ కు ఎయిర్ పోర్ట్ నుంచే లాల్ సింగ్ ఫోన్ చేస్తాడు.
అమర్: హలో లాల్ సింగ్ ఎలా ఉన్నావురా…? ఎక్కడ ఉన్నావు..? చాలా రోజులకు కాల్ చేశావు.. ఏంటి విషయం..
లాల్‌సింగ్: హాయ్ అమర్ ఐయామ్ ఫైన్ నువ్వెలా ఉన్నావు..? నేను ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాను.. ఎయిర్‌ఫోర్ట్ లో ఉన్నాను ఇంకో రెండు గంటల్లో మీ ఇంట్లో ఉంటాను.. ఫ్యామిలీతో వచ్చాను
అమర్: అవునా ఓకే నీకోసం వెయిట్ చేస్తుంటాను..
అని చెప్పి అమర్ కాల్ కట్ చేస్తాడు. టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగుతుంటే.. రాథోడ్ వస్తాడు.
రాథోడ్: ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు. ఎవరు ఫోన్..
అమర్: లాల్ సింగ్ హైదారాబాద్ వచ్చాడు ఇంకో రెండు గంటల్లో ఇంటికి వస్తున్నాడు.
రాథోడ్: ఆయన వస్తే మీరెందుకు సార్ టెన్షన్ పడుతున్నారు.
అమర్: లాల్‌సింగ్‌కు నా గురించి అన్ని విషయాలు తెలుసు.. అయితే నేను భాగీ విడిపోయామని.. మాకు పుట్టిన పాప ఎక్కడుందోనన్న విషయం తెలియదు.. ఆ విషయం లాల్‌సింగ్‌కు తెలిస్తే బాడ్‌గా ఉంటుంది
రాథోడ్: ఓస్ దానికి టెన్షన్ ఎందుకు సార్ లాల్‌సింగ్ ఇక్కడ ఉన్నన్ని రోజులు బుజ్జమ్మ మీకు మిస్సమ్మకు పుట్టిన కూతురు అని చెప్పండి
అనగానే అమర్ భాగీ ఒప్పుకుంటుందా.. అంటాడు. మీరు వెళ్లి ఒప్పించండి సార్ అని చెప్పగానే.. అమర్ వెళ్లి భాగీకి విషయం చెప్తాడు. ఇంతలో లాల్‌సింగ్ వైఫ్‌తో అమర్ ఇంటికి వస్తాడు. అమర్ భాగీని పిలవగానే.. భాగీకి కిందకు వస్తుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
Before You Go
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















