అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today June 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేసిన పిల్లలు – అమర్, మిస్సమ్మ మధ్య మొదలైన సైలెంట్ రొమాన్స్

Nindu Noorella Saavasam Today Episode: అమర్, మిస్సమ్మ ల మధ్య సైలెంట్ రొమాన్స్ మొదలవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి గార్డెన్‌లోకి వచ్చి అరుంధతిని బెదిరిస్తుంది. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండు నీ పెద్ద కూతురు కూడా పైకి వస్తుంది. తీసుకుని వెళ్దువు కానీ అంటుంది. నిన్న నీ కూతురు అచ్చం నీలాగే మాట్లాడింది. అయినా నా గురించి నిజం తెలిసిన ఎవరినైనా అడ్డు తొలగించుకోవడం నాకు అలవాటే కదా అని వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. అరుంధతి ఏడుస్తుంది. నిన్న నేను లేని సమయం చూసి ఏం చేసితివి అని గుప్త అడిగి వెంటనే నిన్న పౌర్ణమి అంటే అని అరుంధతి అమ్ము లోపలికి వెళ్లిన విషయం తెలుసుకుని అరుంధతిని తిడతాడు గుప్త. మరోవైపు మిస్సమ్మ, అమర్‌ కు తల ఢీ కొడుతుంది.

మిస్సమ్మ: ఆగండి..

అమర్‌: ఏంటి?

మిస్సమ్మ: ఇంకోసారి డాష్‌ ఇవ్వండి. మీ కోసమే చెప్తున్నా.. కొమ్ములు వస్తే చూడ్డానికి అదోలా ఉంటుంది. ఒక్కసారి తల కొట్టుకుంటే కొమ్ముల వస్తాయని తెలియని మనిషిని పెళ్లి చేసుకున్నానే.. ఎందుకు దేవుడా నాకు ఏమీ తెలియని ఇలాంటి భర్తను ఇచ్చావు.

అమర్‌: నీకెవరు ఇవ్వలేదు. నీకు నువ్వే వచ్చి ముసుగేసుకుని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు.

మిస్సమ్మ: మీకు ఎన్ని సార్లు చెప్పాను. ఆ పెళ్లి టాపిక్‌ తీయొద్దని

అని ఇద్దరూ గొడవ పడతారు. అమర్‌, మిస్సమ్మను తోస్తుంటే మిస్సమ్మ తల మరోసారి అమర్‌ తలకు తగులతుంది. దీంతో మిస్సమ్మ నేనే గెలిచాను అని హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు మనోహరి, అమ్ము వార్నింగ్ ఇవ్వడాన్ని గుర్తు చేసుకుంటుంది. లీల కాఫీ తీసుకొచ్చి  అమ్ము గురించి చెప్తుంది. దీంతో కోపంగా కాఫీ లీల ముఖానికి కొడుతుంది.

మనోహరి: ఇంకోసారి ఇలా అనుకుంటే చంపేస్తాను. ఈ ఇల్లు నాది అమర్‌ నావాడు. నేను ఈ ఇంటి కోడల్ని. ఈ ఇల్లే నాది. అమర్‌ తలరాతలో ఎరున్నా బతుకులో మాత్రం నేనే ఉంటా?

 అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు పిల్లలు అమర్‌కు గిఫ్ట్‌ ఇవ్వడానికి రెడీ అవుతారు. అమ్ము వచ్చి నువ్వు ఏ గిఫ్ట్‌ ఇస్తున్నావు అంజు అని అడుగుతుంది. దీంతో అంజు గిఫ్ట్‌ ఓపెన్‌ చేసి చూసి హ్యాపీగా ఫీలవుతారు. అమర్‌, అరుంధతిల ఫోటో డ్రాయింగ్‌ వేసి ఉంటుంది. అవి తీసుకుని బయటకు వెళ్లబోతుంటే మనోహరి వస్తుంది.

అంజు: హాయ్‌ ఆంటీ రాత్రంతా కనబడలేదు. ఎక్కడికి వెళ్లారు.

అమ్ము: ఏంటి ఆంటీ అలా చూస్తున్నారు. నిన్న జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకండి. నేను మర్చిపోయా.. మీరు మర్చిపోండి. తెలుసు కదా మీరంటే నాకు ఎంత ఇష్టమే.. ఫాదర్స్‌ డే సెలబ్రేషన్‌ చేయడానికి లేట్‌ అవుతుంది. మీరు రావట్లేదా?

 అని పిల్లలందరూ కిందకు వెళ్తారు. కింద రాథోడ్‌ ఇల్లు మొత్తం డెకరేట్‌ చేస్తుంటాడు. ఇంతలో మిస్సమ్మ వస్తుంది. ఎవ్వరూ పిలిచినా మిస్సమ్మ పలకదు. నడుచుకుంటూ వెళ్లి అంజు వేసిన డ్రాయింగ్‌ ఓపెన్‌ చేయడానికి ప్రయత్నిస్తే అంజు వచ్చి లాగేసుకుంటుంది. నా వస్తువులు నా పర్మిషన్‌ లేకుండా ముట్టుకోవద్దు అంటుంది. మరోవైపు అరుంధతి ఏడుస్తుంది.

అరు: నా కూతురుకు ఏమీ కాకూడదు గుప్త గారు ప్లీజ్‌ మీరే ఏదైనా చేయండి.

గుప్త: విధిని ఎదిరించే ప్రయత్నం చేసినచో పరిణామాలు చాలా తీవ్రంగా ఉండునని నేను ఏనాడో నిన్ను హెచ్చరించితిని బాలిక. మరి తప్పిదమునకు మూల్యం చెల్లించాలి కదా?

అరు: మీకు దండం పెడతాను గుప్త గారు దాన్ని కాపాడుకునే శక్తి నాకు ఇవ్వండి ప్లీజ్‌..

అనగానే ఏం జరుగుతుందో చూద్దామని ప్రస్తుతం నీ పిల్లలు ఫాదర్స్‌ డే చేస్తున్నారు వెళ్లి చూద్దాం పద అని లోపలికి వెళ్తారు. మరోవైపు లీల పైకి వచ్చి మనోహరిని కిందకు వెళ్దాం పద అని అడగ్గానే మనోహరి రానని చెప్తుంది. మరోవైపు పిల్లలు అమర్‌కు ఫాదర్స్‌ డే విషెస్‌ చెప్పగానే అరుంధతి తాను బతికున్నప్పుడు జరుపుకున్న ఫాదర్స్‌ డేను గుర్తు చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఫ్యామిలీతో సహా ప్రధాని మోదీతో పవన్ భేటీ - ఆత్మీయ పలకరింపులు !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Embed widget