అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today June 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఇంట్లో ప్రమాదం అన్న గుప్త – భయంతో వణికిపోయిన ఆరు

Nindu Noorella Saavasam Today Episode: ఇంట్లో ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుందని గుప్త చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Nindu Noorella Saavasam Serial Today Episode:  చిత్ర కోపంగా హాల్లోకి వచ్చి కొత్త కోడలిని కనీసం ఎవ్వరూ పలకరించరా అంటూ చిరాకు పడుతుంది. దీంతో నిర్మల, శివరాం, భాగీ హాల్లోకి వస్తారు. చిత్ర అరుపులకు పిల్లలు కూడా కిందకు వస్తారు. అందరూ వచ్చాక చిత్ర నగల గురించి అడుగుతుంది. ఏం నగలు అని నిర్మల అడుగుతుంది.

చిత్ర: చిన్న కొడలికి అంటూ ఏదో ఒకటి దాచి ఉంటారు కదా..? మీ నగలు, ఆరు నగలు అన్ని తీసుకొస్తే క్లియర్ చేసుకుందాం

భాగీ: ఆరు అక్క నగలు ముట్టుకోవడానికి ఎవ్వరికీ వీలు లేదు. అది ఆయన మాట

చిత్ర: మాటే కదా భాగీ మారిస్తే సరిపోతుంది. ఆరు నా ఫ్రెండ్‌ పైగా నాకు తోడి కోడలు కూడా తన నగలను నేనెందుకు ముట్టుకోకూడదు. నేను ఆ నగలను చూడాలి

నిర్మల:  ఆ నగలు ఇప్పుడు భాగీవి అమ్మా నీకు నా నగలు చిన్న కోడలు కోసం కొన్న నగలు ఉన్నాయి చూపిస్తాను రా

చిత్ర: ఒక్క నిమిషం ఆంటీ అదేంటి ఆంటీ వినోద్‌ అందరం కలిసే ఉందాం అంటున్నారు మరి మీరేంటి అప్పుడే భాగాలు పెట్టేస్తున్నారు. బంగారం ఒక్కటేనా..? ఆస్థులు కూడా భాగాలు పంచేశారా..? అంటే క్లారిటీ ఉంటే మేము ఎక్కడ ఉండాలో డిసైడ్‌ అవుదామని

భాగీ: చిత్ర నువ్వు ఇంటికి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే ఆస్థుల గురించి భాగాల గురించి మాట్లాడుతున్నావా..? ఒకటి బాగా గుర్తు పెట్టుకో ఆ అన్నదమ్ములు ఎప్పటికీ కలిసే ఉంటారు. ఉండాలి కూడా అర్తం చేసుకుని పద్దతి మార్చుకో ప్లీజ్‌ చిత్ర

చిత్ర:  నేనేదో వినోద్‌తో వేరు కాపురం పెడుతున్నట్టు నువ్వు అలా మాట్లాడుతున్నవేంటి భాగీ నేను మీ అందరితో కలిసే ఉండాలనుకుంటున్నాను. నాకు కూడా కుటుంబం కావాలి. కానీ ఇలా భాగాలు పెట్టే ప్రేమ నాకు అసలు వద్దు.

నిర్మల: అమ్మా చిత్ర ఎవ్వరూ భాగాలు పెట్టలేదు అమ్మా ఆరు నగలు ఎవ్వరూ ముట్టుకోరు అదే చెప్తున్నాను

చిత్ర:  మీరు భలే గమ్మతుగా మాట్లాడుతున్నారు ఆంటీ ఆరు నగలు భాగీవి అంటున్నారు. వాటిని ఎవ్వరూ ముట్టుకోకూడదు అంటున్నారు. మళ్లీ అందరం కలిసే ఉండాలంటున్నారు బాగుంది ఆంటీ మీ పద్దతి చాలా బాగుంది

 

ఆరు: ఏంటి గుప్త గారు అసలు భాగీ, అత్తయ్యా దానికి అంత సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి..? నాలుగు తగిలించి లోపలికి పోవాలని చెప్పక

గుప్త: ఓర్పుతో, ప్రేమతో ఆ బాలిక మనసు మార్చాలని చూస్తున్నారు

ఆరు: ఒళ్లంతా పొగరున్న దానితో ఏంటండి ఓర్పు.. నాకే కనక చాన్స్‌ ఉంటేనా… దాన్ని నాలుగు తగిలించే దాన్ని

చిత్ర:  చెప్పండి ఆంటీ మీరు చెప్పే దాంట్లో న్యాయం ఉందా..?

అంజు:  చిత్ర పిన్ని అసలేమైంది మీకు నిన్నేమో కలశం చెంబు మిస్సమ్మకు తగిలేలా చేశారు. ఇప్పుడు నాన్నమ్మతో గొడవ పడుతున్నారు అసలేంటి మీరు

చిత్ర: ఓహో అయితే  నేను వచ్చిన తర్వాత ఇంట్లో మనఃశాంతి లేదు అంటున్నావా..? అంజు

భాగీ: చిత్ర పిల్లల జోలికి రావొద్దు చెప్తున్నా..?

చిత్ర: ఓహో నేను కొత్తగా వచ్చాను ఎక్కడ అందరూ నన్ను మెచ్చుకుని నన్ను మంచి అంటారని భయపడి పిల్లలకు ట్రైనింగ్‌ ఇచ్చి నా మీదకు ఉసిగొల్పుతున్నావా..? భాగీ

అమ్ము: చిత్ర పిన్ని ఊరికే నోరు పారేసుకోకండి మిస్సమ్మ మాకేం నేర్పలేదు

చిత్ర: అయితే వేలడంత లేరు మీరు నాకు చెప్తున్నారా..? నన్ను ఇన్ని మాటలు అంటారా.?

ఆనంద్‌:  ఇప్పుడు మేము మిమ్మల్ని ఏమన్నామని అలా మాట్లాడతున్నారు.

ఆకాష్‌: అయినా పెళ్లికి ముందు వరకు మాతో బాగానే ఉన్నారు కదా ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు

చిత్ర: అందరూ కలిసి నన్ను టార్గెట్‌ చేసి నన్ను ఇన్ని మాటలు అంటున్నారు కదూ ఇప్పుడే వెళ్లి వినోద్‌ను తీసుకొస్తాను. వినోద్‌ వచ్చి మీ అందరికీ ఈ ఇంట్లో నా స్థానం గురించి చెప్తాడు.

అని కోపంగా వినోద్‌ కోసం వెళ్తుంది.

ఆరు: గుప్త గారు నా కుటుంబాన్ని ఇంత బాధ పెడుతున్న దాన్ని ఏమీ చేయలేకపోతున్నాను. ఫ్లీజ్‌  చిత్రకు బుద్ది చెప్పాలి ఎలా

గుప్త: బాలిక నీకున్న శక్తులు అన్ని ఉపయోగించి ఎవ్వరికీ ఎలాంటి హానీ చేయకూడదు

ఆరు: అవును కదా నాకు శక్తులు ఉన్నాయి కదా

అనుకుంటూ లాన్‌లోకి వెళ్తుంది. పైన వినోద్‌  కోసం వెతుకుతున్న చిత్రను చూసి చిత్ర మెట్ల మీద నుంచి కింద పడిపోవాలి అంటుంది. వెంటనే చిత్ర కింద పడిపోతుంది. వినోద్‌ వచ్చి చిత్రను ఎత్తుకుని వెల్తాడు. ఆరు హ్యపీగా నవ్వుతుంటే..   

గుప్త:  ఈ ఇంట్లో పెద్ద ప్రమాదం జరగబోతుంది. ఏదో ప్రళయం ముంచుకొస్తుంది. కానీ ఎవరికీ ఏమి జరగుతుదో తెలియడం లేదు. ఆ ప్రమాదం నీకు జరుగుతుందా..? లేక నీ పిల్ల పిచ్చులకు జరుగుతుందా..? అనేది తెలియడం లేదు. ఒక వేళ నీ పతిదేవునకు జరుగునా అన్నది కానీ నీ సహోదరికి జరుగునా తెలియడం లేదు బాలిక. కానీ ఏదో కీడు జరగబోతుంది.

అంటూ గుప్త హెచ్చరించడంతో ఆరు భయపడుతుంది. ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో రణవీర్‌ రౌడీలను తీసుకుని అమర్‌ ఇంటి ముందు వచ్చి వెయిట్‌ చేస్తుంటాడు. రాథోడ్‌ పిల్లలను స్కూల్‌లో డ్రాప్‌ చేయడానికి బయటకు వస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget