Nindu Noorella Saavasam Serial Today July 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు అస్థికలు ఘోరకు ఇచ్చిన మనోహరి – మిస్సమ్మను చేసిన ప్రయత్నం వృథా
Nindu Noorella Saavasam Today Episode: స్మశానం లాకర్ లో ఉన్న ఆరు అస్థికలు తీసుకెళ్లి మనోహరి ఘోరకు ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: అంజుకు టీసీ ఇస్తానన్న స్కూల్ ప్రిన్సిపాల్‌కు మిస్సమ్మ వార్నింగ్ ఇస్తుంది. మీ పర్సనల్ పగ తీర్చుకోవడానికి ఇదంతా క్రియేట్ చేశారని తెలుసుకున్నాను అంటూ మిస్సమ్మ చెప్పగానే ప్రిన్సిపాల్ షాక్ అవుతుంది. అమ్మో మొత్తం తెలుసుకుని వచ్చినట్లుంది అని మనసులో అనుకుంటుంది. పిల్లలకు నేనున్నానని చెప్పి పిల్లల్ని తీసుకుని మిస్సమ్మ వెళ్లిపోతుంది. మరోవైపు స్మశానంలో లాకర్ ఓపెన్ చేస్తున్న మనోహరికి లాకర్ ఓపెన్ కాదు. ఇంతలో మిస్సమ్మ, రాథోడ్ స్మశానం దగ్గరకు వస్తారు. వాళ్లన చూసిన ఘోర మనోహరికి ఫోన్ చేస్తాడు.
మనోహరి: ఈ ఘోర ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. హలో ఘోర తీసుకొస్తానని చెప్పాను కదా మళ్లీ ఎందుకు ఫోన్ చేశావు. నేను మాట్లాడ్డం ఎవరైనా వింటే నేను దొరికిపోతాను.
ఘోర: నువ్వు మాట్లాడకపోయినా దొరికిపోతావు మనోహరి.
మనోహరి: ఏం మాట్లాడుతున్నావు. దొరికిపోవడం ఏంటి?
ఘోర: మనోహరి ఆ భాగీ, రాథోడ్ లు లోపలికి వస్తున్నారు.
ఆరు: మిస్సమ్మ వచ్చిందా? నీకుందే ఇవాళ నిన్ను ఇక్కడ చూసిన వెంటనే ఆయనకు ఫోన్ చేసి చెప్తుంది. ఆయనకు నీ మీద అనుమానం వస్తుంది. అప్పుడు నీకుంటుంది.
మనోహరి: అబ్బా ఈ టైంలో రావడం ఏంటి?
మిస్సమ్మ, రాథోడ్ లాకర్ లోపలికి వస్తుంటే మనోహరి పక్కకు వెళ్లి దాక్కుంటుంది. మిస్సమ్మ, రాథోడ్ లోపలికి వచ్చి లాకర్ ఓపెన్ చేసి ఆస్థికలు చూస్తారు.
మిస్సమ్మ: మనోహరి ఈ ఆస్థికల గురించి ఎందుకు అడిగిందో మనం కనిపెట్టాలి రాథోడ్. కచ్చితంగా అదేదో ప్లాన్ చేసి ఉంటుంది.
రాథోడ్: అలాగే మిస్సమ్మా..
మిస్సమ్మ: రాథోడ్ ఒకవేళ ఆ మనోహరి వచ్చి ఉంటుందంటావా?
రాథోడ్: తెలియదు మిస్సమ్మ..
మిస్సమ్మ: పద కనుక్కుందాం… ఏవండి 302 కోసం ఎవరైనా వచ్చారా?
సెక్యూరిటీ: అబ్బే రాలేదు మేడం.
మిస్సమ్మ: సరే అండి ఎవరొచ్చినా ఇప్పుడు ఇక్కడ రాసిన నంబర్‌కు కాల్ చేసి చెప్పండి.
అని చెప్పి మిస్సమ్మ, రాథోడ్ వెళ్లిపోతారు. ఇంతలో లోపల ఉన్న మనోహరి లాకర్ ఓపెన్ చేసి ఆరు అస్థికలు తీసుకుని వెళ్తుంది. అక్కడే ఉన్న ఆరు బాధపడుతుంది. బయట సెక్యూరిటీ కూడా లేకపోవడంతో అస్థికలు తీసుకుని బయటకు వస్తుంది మనోహరి. అస్థికలు చూసిన ఘోర హ్యాపీగా ఫీలవుతాడు.
ఘోర: వాళ్లు లోపలికి వచ్చారు కదా నిన్ను చూడలేదా?
మనోహరి: నేను మేనేజ్ చేశాను.
ఘోర: ఇవి ఆ ఆత్మ అస్థికలేనా మనోహరి.
అని ఘోర అడగ్గానే అవునని అస్థికలు ఘోరకు ఇస్తుంది. దూరం నుంచి చూస్తున్న ఆరు ఆత్మ, ఘోరను చూసి భయపడతుంది. అస్థికలను ఉపయోగించి నేను ఆత్మను బంధించబోతున్నాను.. నాకు శక్తులు వచ్చిన మరుక్షణం అమరేంద్ర వచ్చి నిన్ను పెళ్లి చేసుకునేలా చేస్తానని.. అతడే మిస్సమ్మను చంపేసేలా చేస్తానని ఘోర చెప్తాడు. అది విన్న మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. ఆరు బాధపడుతుంది. తర్వాత అమర్ విండో దగ్గర నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆరు ఆత్మ వస్తుంది.
ఆరు: పిల్లల నవ్వులతో అల్లర్లతో అత్తయ్యా మామయ్యలతో కళకళలాడే ఈ ఇల్లు ఆ మనోహరి రావడంతో కష్టాలతో కన్నీళ్ళతో నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఎప్పుడైనా ఆ ఘోర నన్ను బంధించేయొచ్చు.
అంటూ గతం గుర్తుచేసుకుంటూ ఆరు ఏడుస్తుంది. అమర్ కూడా ఆర ఉన్నట్లే ఫీలవుతూ బాధపడుతుంటాడు. మనోహరిని శాశ్వతంగా ఇంటి నుంచి దూరం చేశాకే నేను ఎక్కడికైనా వెళ్తాను. అంటూ ఆ మనోహరి చేసిన దుర్మార్గాలు అన్ని డైరీలో రాశాను ఒక్కసారి ఆ డైరీ చదవండి అని ఆరు అనగానే అమర్‌కు వెంటనే డైరీ గుర్తుకు వస్తుంది. ఆరు డైరీ రాస్తున్న విషయం గుర్తు చేసుకుంటాడు అమర్. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: వారి అభిమానంతో నా మనసు పులకించింది- ఫ్యాన్స్ ప్రేమకు ‘పుష్ప’ బ్యూటీ ఫిదా