Nindu Noorella Saavasam Serial Today July 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు అస్థికల కోసం స్మశానానికి వెళ్లిన మనోహరి – ప్రిన్సిపాల్ కు వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మ
Nindu Noorella Saavasam Today Episode: ఆరు అస్థికలు తీసుకొచ్చి ఘోరకు ఇచ్చేందుకు మనోహరి స్మశానానికి వెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి వెళ్తుంటే వెనక నుంచి మిస్సమ్మ గమనిస్తుంది. రాథోడ్ వచ్చి ఏం చేస్తున్నావని అడిగితే మనోహరి నెక్ట్స్ ప్లాన్ ఏంటోనని ఆలోచిస్తున్నాను అని చెప్తుంది. మనోహరి బిహేవియర్‌లో మార్పు వచ్చిందని ఈసారి ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్లుందని మిస్సమ్మ చెప్తుంది. ఇంతలో మనోహరి, ఆరు అస్థికల గురించి అమర్‌ను అడిగిన విషయం గుర్తు చేసుకుంటుంది. పిల్లలు స్కూలుకు వెళ్లాక తనను అస్థికలు ఉన్న ప్లేస్‌కు తీసుకువెళ్లమని అడుగుతుంది.
రాథోడ్: ఎందుకు మిస్సమ్మ..
మిస్సమ్మ: మనోహరి ఇప్పుడు అక్కడికే వెళ్లి ఉండాలి రాథోడ్. అదే నిజమైతే మనోహరి అస్థికలను ఏదో చేయాలనుకుంటుంది. ఆయనకు అక్క గుర్తుగా మిగిలింది అక్క అస్థికలు మాత్రమే. అక్క అస్థికలను ఎలాగైనా కాపాడాలి. కాపాడి తీరుతాను.
రాథోడ్: అలాగే మిస్సమ్మ పిల్లల్ని స్కూలు దగ్గర దించి వెళదాం.
ఆరు: పాతికేళ్లు దానితో కలిసున్నా.. దాన్ని అనుమానించకపోవడం నా తప్పు. ఆ తప్పు నువ్వు చేయడం లేదు మిస్సమ్మ. మను కృరత్వాన్ని చాలా త్వరగానే కనిపెట్టావు.
అని కింద నుంచి అంతా గమనిస్తున్న ఆరు మనసులో అనుకుంటుంది. తర్వాత అమర్ పిల్లలను స్కూలుకు వెళదాం అని పిలుస్తాడు. కిందకు ముగ్గురు పిల్లలే వస్తారు. అంజు రాదు. రాథోడ్ నవ్వుతుంటాడు. ఇంతలో ఇక్కడే ఉన్నాను డాడ్ అని అంజు వస్తుంది. మిస్సమ్మ వచ్చి పిల్లల్ని స్కూలుకు నేను తీసుకెళ్తాను అని చెప్తుంది. సరేనని పిల్లల్ని, మిస్సమ్మను స్కూలుకు తీసుకెళ్లమని రాథోడ్ కు చెప్పి అమర్ వెళ్లిపోతాడు. మరోవైపు ఘోర స్మశానంలో ఉంటాడు.
ఘోర: ఆత్మ నీకు అడుగు దూరంలో ఉన్నా... దేవా ఇన్నేళ్లలో నీ సాయం నేను ఎప్పుడూ కోరలేదు. నీ ఆశీస్సులు ఉంటే చాలు అనుకున్నా.. కానీ మొదటి సారి నీ సాయం కోరుతున్నా.. ఇవాళ అస్థికలు నా చేతికి వచ్చేలా చూడు. నాకు ఈ ఒక్క విజయాన్ని ప్రసాదించు.
మనోహరి: ఘోర పద మనం వెళ్లి దాని అస్థికలు తీసుకొచ్చి దాన్ని శాశ్వతంగా నా దారికి అడ్డు తొలగిద్దాం.
ఘోర: నాకు లోపలికి ప్రవేశం లేదు మనోహరి. నువ్వు ఒక్కదానివే వెళ్లి ఆ పని పూర్తి చేయాలి.
మనోహరి: సరే నేనే వెళ్లి ఎదో ఒకటి చేసి ఆ అస్థికలను తీసుకుని వస్తాను.
అని మనోహరి వెళ్తుంటే ఘోర ఒక చిన్న కుండ ఇచ్చి ఇది తీసుకుని వెళ్లి అక్కడి అస్థికలు తీసుకుని రా అని చెప్తాడు. మనోహరి సరేనని వెళ్తుంది. ఇంతలో అక్కడికి ఆరు వస్తుంది. మనోహరి లాకర్ రూంలోకి వెళ్లి లాకర్‌లో ఉన్నా ఆరు అస్థికలు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు స్కూలుకు వెళ్లిన మిస్సమ్మను స్కూల్ ప్రిన్సిపాల్ తిడుతుంది.
ప్రిన్సిపాల్: ఏదో తల్లి లేని పిల్లలు కదా అని చూసి చూడనట్టు వదిలేస్తున్నా? అయినా అంజలి అన్ని హద్దులు దాటేసింది. అయినా మీరొచ్చారేంటి? అంజలి పేరేంట్ ను కదా చెప్పాను.
మిస్సమ్మ: అందుకే కదా నేనొచ్చా? మథర్ పేరెంట్ అవ్వదా ప్రిన్సిపాల్ గారు.
ప్రిన్సిపాల్: అంటే మీరు పిల్లలకు అమ్మ కాదు కదా? ఏంటి అలా చూస్తున్నారు అమరేంద్ర గారితో మీకు పెళ్లి అయితే మీరు వీళ్లకు గార్డెన్ అవుతారు కానీ అమ్మా అవ్వలేరు కదా?
అని ప్రిన్సిపాల్ అనగానే మిస్సమ్మ కోపంగా వార్నింగ్ ఇస్తుంది. దీంతో బయపడిపోయిన ప్రిన్సిపాల్ కూల్‌గా అంజలి, లిల్లి అనే పాపని కొట్టింది. వాళ్ల పేరెంట్స్ కంప్లయింట్ ఇచ్చారు. అందుకే అంజలితో అపాలజీ లెటర్ తీసుకోవాలి అంటుంది. కాదు అంటే అని మిస్సమ్మ అడగ్గానే టీసీ ఇచ్చి పంపించేస్తాం. అనగానే అయితే ఇవ్వండి అని మిస్సమ్మ అడుగుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.