Nindu Noorella Saavasam Serial Today July 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరి డేంజర్ లో ఉందన్న గుప్త – మిస్సమ్మను పార్టీకి తీసుకెళ్లిన అమర్
Nindu Noorella Saavasam Today Episode: త్వరలోనే మిస్సమ్మ, అమర్లను విడగొట్టి అమర్ను పెళ్లి చేసుకోవాలని మనోహరి ప్లాన్ వేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మను జాగ్రత్తగా కారులో ఇంటికి పంపిస్తాడు అమర్. సీటు బెల్ట్ కూడా అమరే పెట్టడంతో పక్కనే ఉన్న రాథోడ్ ముసిముసి నవ్వులు నవ్వుతాడు. తర్వాత అమర్, రాథోడ్‌తో జాగ్రత్తగా వెళ్లమని చెప్తాడు. కారులో రాథోడ్, మిస్సమ్మ వెళ్తుంటారు. అమర్ సీటు బెల్ట్ పెట్టడాన్నే గుర్తు చేసుకుంటుంది మిస్సమ్మ.
రాథోడ్ : ఏంటమ్మా మిస్సమ్మా.. ముసి ముసి నవ్వులు మురిసిపోవడాలు.. ఆ మధుర క్షణాలను మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకుంటున్నావా?
మిస్సమ్మ: నేనెక్కడ మురిసిపోతున్నా నార్మల్‌గానే ఉన్నాను.
రాథోడ్: మనసు ఇక్కడ ఉంటేనే కదమ్మా తెలియడానికి? నాకు తెలిసి ఆ ఆటోలో మా ఆఫీసుకు వెళ్తుందని నా అభిప్రాయం.
మిస్సమ్మ: నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. సైలెంట్‌గా డ్రైవింగ్ చేయ్.
అనగానే నువ్వు ఎన్ని చెప్పినా మేము అన్ని గమనిస్తున్నాము. సార్ ప్రవర్తన చాలా మారిపోయింది. అంటూ రాథోడ్ అమర్ గురించి గొప్పగా చెప్తాడు. తర్వాత కొడైకెనాల్‌లో మా మేడంతో మొదలైన ప్రయాణం. హైదరాబాద్‌లో మీ ఇద్దరి కలయితో ముగుస్తుంది. ఆరోజు నిన్ను కలవనందుకు మా మేడం చాలా బాధపడ్డారని రాథోడ్ చెప్తాడు. తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్ మనోహరికి ఫోన్ చేస్తుంది. స్కూల్‌లో పిల్లల్ని జాయిన్ చేయడానికి ఎందుకు రాలేదని అడుగుతుంది. మరోహరి ఏదో చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. మరోవైపు మిస్సమ్మ, రాథోడ్ ఒక పార్టీకి వెళ్తారు.
మిస్సమ్మ: రెడీ అవ్వమని కారులో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అసలు ఇది ఏం పార్టీ ఎవరి పార్టీ..
రాథోడ్: సంజయ్ సింగ్ అని మా సీనియర్. ఆయన రిటైర్‌మెంట్ పార్టీ మేడం. కళ్లు తిప్పుకోలేనంత బాగా ఉన్నారా? మా సారు గారు.
మిస్సమ్మ: అవును..
రాథోడ్: అమ్మగారు ఇంటికి వెళ్లాక మా సారుకు దిష్టి తీయండి.
వెయిటర్: వెయిట్ సార్ కపుల్ ఎంట్రీ అటువైపు ఉంది.
శివరాం: అమర్ విన్నావు కదా కపుల్ కి సెపరేట్ ఎంట్రీ అట. వెళ్లండి..
నిర్మల: వెళ్లండి అమర్ చూస్తారేంటి?
అనగానే మిస్సమ్మ, అమర్ ఇద్దరూ కలిసి కపుల్ ఎంట్రీవైపు వెళ్తారు. మరోవైపు బాబ్జీని రౌడీలు కొట్టి వాడి ఫోన్ నుంచి మనోహరికి ఫోన్ చేస్తారు. మనోహరి ఎక్కడ ఉందో అడగమని చెప్తారు. సిటీ అవుట్ స్కట్‌లో ఒక ఫాం హౌస్‌లో ఫంక్షన్‌లో ఉన్నానని చెప్తుంది. రౌడీలు అక్కడకు వెళ్తారు. తర్వాత మిస్సమ్మ, అమర్ లోపలికి వెళ్లబోతుంటే
శివరాం: ఎక్కడికి అమర్?
అమర్: లోపలికి నాన్నా..
శివరాం: మీ ఎంట్రీ ఇంకా అవ్వలేదు. ఇదిగో ఒకసారి అటు చూడు.
అమర్: నాన్నా అవన్నీ ఏమీ వద్దు పదండి లోపలికి వెళ్దాం.
శివరాం: నిర్మల ఇంట్లో రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అని ఎవరో చెప్తూ ఉంటారు కదా? ఎవరు?
అమర్: సరే పదండి..
నిర్మల: మిస్సమ్మ ఇద్దరూ కలిసి తీయించుకునే ఫస్ట్ ఫోటో బాగా తీయించుకోండి.
అని చెప్పగానే మిస్సమ్మ, అమర్ ఇద్దరూ కలిసి ఫోటో దిగి వస్తారు. వాళ్లను చూసిన మనోహరి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. తర్వాత గుప్త, అరుంధతి దగ్గరకు వచ్చి నిన్ను మా లోకంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే నువ్వేమో ఇక్కడున్నావా? అంటాడు. దీంతో మనోహరికి ఇంతకు ముందే పెళ్లి అయిందని ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసిందని అరుంధతి, గుప్తకు చెప్తుంది. తను ఎప్పుడు పెళ్లి చేసుకుంది. నా భర్త కోసం ఎందుకు వచ్చింది. ఏదో జరగబోతుంది అని అరుంధతి అడుగుతుంది. దీంతో ఆమె గతము, ఆమె భవిష్యత్తు రెండు ఎదురుపడుతున్నవి అని గుప్త చెప్పగానే ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: కూతురి పెళ్లైన కొద్దిరోజులకే ఆసుపత్రిలో చేరిన నటుడు.. వివరాలు ఇవే