Nindu Noorella Saavasam Serial Today July 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్‌ను జైలుకు పంపిస్తానన్న రణవీర్ - అంజును సేవ్ చేసిన అమర్
Nindu Noorella Saavasam Today Episode: తన కూతురు దుర్గను మీరే దత్తత తీసుకున్నారని తన జాడ చెప్పకపోతే అమర్‌ను జైలుకు పంపిస్తానని రణవీర్ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తి గా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: రోడ్డు మీదకు వచ్చిన అంజును కిడ్నాప్ చేసేందుకు రణవీర్ కారులో స్పీడుగా వస్తుంటాడు. అప్పుడే గేటు దాటి అంజు కోపం కంగారుగా వచ్చిన భాగీ ఆ కారును చూసి భయంతో అంజు అంటూ అరుస్తుంది. ఆ అరుపులకు లోపల గార్డెన్‌లో ఉన్న పిల్లలు కంగారుగా బయటకు పరుగెత్తుకొస్తారు. మనోహరి మాత్రం అంజలి కిడ్నాప్ అయ్యుండొచ్చు అనుకుని చిన్నగా నవ్వుకుంటుంది. బయట అమర్ కారుతో వచ్చి అంజును సేవ్ చేస్తాడు.
అమర్: అంజు నువ్వు లోపలికి వెళ్లు..
అంజు: అలాగే డాడ్..
అమర్ రణవీర్ కారు వెనకాల పరుగెత్తుకుంటూ వెళ్లి రణవీర్‌ను పట్టుకుంటాడు. ముఖానికి ఉన్న మాస్క్ తీసేందుకు ప్రయత్నిస్తుంటే తప్పించుకుని పారిపోతాడు. అంజును తీసుకుని భాగీ లోపలికి వెళ్లిపోతుంది.
భాగీ: అంజు నీకేం కాలేదు కదా..?
అమ్ము: మిస్సమ్మ ఏమైంది ఎందుకలా అరిచావు
రాథోడ్: అంజు పాప నీకేం కాలేదు కదా
అంజు: ఏమైంది ఎందుకు అందరూ కంగారు పడుతున్నారు
అమర్: అంజు నీకేం కాలేదు కదా..?
అంజు: నాకేం కాలేదు డాడ్ ఎందుకు అంత కంగారు పడుతున్నారు..?
అమర్: ఏం లేదు ఒక్కదానివే రోడ్డు మీదకు రాకూడదని చెప్పాను కదా ఎందుకు వచ్చావు
అంజు: అంటే బాల్ పడిందని వచ్చాను
మనోహరి: అమర్ ఏమైంది ఎందుకు అంత కంగారుపడుతున్నారు
అమర్: అంజును ఇప్పుడు అటాక్ చేయాలని చూశారు మనోహరి. రణవీర్ మనుషులు ఇంటి చుట్టే తిరుగుతున్నారు. అది రణవీర్ వైఫ్ అని మా అనుమానం.
మనోహరి: నీకెందుకు అనుమానం వచ్చింది అమర్. అసలు వాళ్లు రణవీర్ మనుషులు అని నీకెలా తెలుసు..?
అమర్: మేము రణవీర్ ఫోన్‌ను టాప్ చేస్తున్నాము మనోహరి (మనోహరి షాక్) అతనికి రెగ్యులర్‌గా ఇక్కడి నుంచే కొత్త నెంబర్స్ నుంచి కాల్స్ వెళ్తున్నాయి
రాథోడ్: ఫేక్ ఫ్రూప్స్ తో నెంబర్స్ తీసుకుంటున్నారు. ఆ మాస్క్ దాటి మనిషిని గుర్తించే రోజు దగ్గరలోనే
అమర్: ఇప్పటి నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. అంజు నువ్వు ఎవ్వరి పర్మిషన్ లేకుండా బయటకు రావొద్దు
అని చెప్తూ అందరినీ తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు అమర్. ఇక్కడ జరిగిన విషయాలన్నీ రణవీర్‌కు లెటర్ రాస్తుంది మనోహరి తన సిమ్ తీసేశానని.. రణవీర్ సిమ్ కూడా తీసేయమని అందులో రాస్తుంది. అందంతా చదివిన రణవీర్ ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంటే లాయరు వస్తాడు.
లాయరు: ఇప్పుడు ఏం చేద్దాం రణవీర్
రణవీర్: ఒక్క నిమిషం అమర్ లేటుగా వచ్చినా ఈ పాటికి అంజలి నా కంట్రోల్ లో ఉండేది ఎందుకు ఇన్ని సార్లు ప్రయత్నించినా అంజలిని తీసుకురాలేకపోతున్నాను
లాయరు: అంజలిని తీసుకురాలేకపోతున్నావు సరే కానీ ఏ క్షణమైనా పోలీసులు నిన్ను కనిపెట్టేస్తారు
రణవీర్: నాకు బెయిల్ కావాలి లాయరు.
లాయరు: ఇప్పుడు మనం ఏమీ చేయలేము.. నీ మీద వారెంట్ కూడా ఇష్యూ అయింది.. బెయిల్ కూడా రాదు
రణవీర్: నీకు కుదురితే పోలీసులను కొను.. లేదా లాయర్ని, జడ్జిని అందరినీ కొను.. నాకు బెయిల్ కావాలి అంతే.. అర్థం అవుతుందా..?
లాయరు: సరే నేను ట్రై చేస్తాను.. కానీ డబ్బు లక్షల్లో అవుతుంది
రణవీర్: ఎంత అయినా పర్వాలేదు అంజలిని కిడ్నాప్ చేసే వరకు నేను బయటే ఉండాలి
అని చెప్పగానే లాయరు సరే అంటూ వెళ్లిపోతాడు. తర్వాత రణవీర్ నేరుగా అమర్ ఇంటికి వెళ్తాడు.
అమర్: కూర్చో రణవీర్
రణవీర్: నేను కూర్చుని మాట్లాడటానికి రాలేదు అమర్.. నాకు సమాధానం కావాలి. నా కూతురు దుర్గ ఎక్కడ ఉంది..? అసలు నా కూతురు ప్రాణాలతోనే ఉందా అమర్..? నా అన్ని ప్రశ్నలకు నాకు త్వరలోనే సమాధానం కావాలి అమర్. లేదంటే నేను లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది.
అంటూ రణవీర్ మరో రూట్‌లో అమర్‌ను బెదిరించాలని అనుకుంటాడు. కానీ అమర్ సైలెంట్‌గా ఉంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















