అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today January 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: విక్రమ్‌ను బతికించిన భాగీ, బుజ్జమ్మ – మనోహరి టార్చర్‌కు భయపడ్డ పిల్లలు

Nindu Noorella Saavasam serial Today Episode January 4th: బస్సులో హైదరాబాద్‌ వెళ్తున్న విక్రమ్‌కు స్ర్టోక్‌ వస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లో మనోహరి పిల్లలను టార్చర్‌ చేస్తుంది. వాళ్లు ఏం చేసినా తప్పు చూపించి తిట్టడం చేస్తుంది. అమర్‌ కూడా ఇంట్లో పిల్లలను పట్టించుకోకుండా మనోహరి మీదే వదిలేస్తాడు. దీంతో పిల్లలు బాధపడుతుంటారు. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు.

అంజు: రోజు రోజుకు మనోహరి టార్చర్‌ ఎక్కువ అవుతుంది. ఏం చేద్దాం

ఆనంద్‌: మిస్సమ్మ వెళ్లిపోయాక మనోహరి ఆంటీ మనల్ని స్లేవ్స్‌ లాగా చూస్తుంది. చీటికి మాటికి మనల్ని కొట్టి తిట్టి  ఇన్‌సల్ట్‌ చేస్తుంది

ఆకాష్‌: డాడ్‌ కూడా ఆమెనే సపోర్ట్‌ చేస్తూ మనల్ని అసలు పట్టించుకోవడం లేదు.. మనం ఏదో ఒకటి  చేయాలి

అమ్ము: డాడ్‌ సపోర్ట్‌ లేకుండా మనం ఆమెను ఎదిరించి మనం ఏమీ చేయలేం అందుకే నేను హాస్టల్ కు వెళ్లిపోదాం అనుకుంటున్నాను

అంజు: నువ్వు హాస్టల్‌ కు వెళితే మరి మా పరిస్థితి ఏంటి అమ్ము.. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు

అమ్ము: నువ్వు ఎప్పటి నుంచో కొడైకెనాల్‌ స్కూల్‌ లో చదువుకోవాలని అనుకుంటున్నావు కదా..? పైగా నీ ఫ్రెండ్స్‌ అందరూ అక్కడే ఉన్నారు నువ్వు అక్కడికే వెళ్లు

ఆనంద్‌: నువ్వు హాస్టల్‌ కు వెళ్తావు.. అంజు కొడైకెనాల్‌ వెళ్తుంది. మరి మేము ఎక్కడికి వెళ్లాలి అమ్ము

ఆకాష్‌: మేము ఇక్కడే ఉండి మనోహరి ఆంటీ టార్చర్‌ భరించాలా..?

అమ్ము: అవసరం లేదు నేను మీ గురించి కూడా ఆలోచించాను. మీరిద్దరూ డెహ్రాడూన్‌ క్యాంపస్‌కు వెళ్లండి

అంజు: అదేంటి మనం నలుగురం ఒక్కచోట ఉండలేమా..? తలో వైపు వెళ్లిపోవాల్సిందేనా..?

అమ్ము: అవ్వదు అంజు మిస్సమ్మ తిరిగి వస్తుందని ఫైవ్‌ ఇయర్స్‌ నుంచి ఎదురుచూస్తున్నాను.. తను రాలేదు సరికదా..? తను, బుజ్జమ్మ ఎక్కడున్నారో కూడా మనకు తెలియదు.. మిస్సమ్మ లేకుండా మనం ఈ ఇంట్లో ఉండలేము.. అందరం కలిసి ఒకేచోట చదువుకునే పరిస్థితి కూడా లేదు.. మనం ఎక్కడున్నా రెండు రోజులకు ఒకసారి ఫోన్‌లో మాట్లాడుకుందాం.. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి డాడ్‌ను చూసి వెళ్దాం..

ఆనంద్: ఇలాంటి సిచుయేషన్‌ వస్తుందని అసలు ఊహించలేదు అమ్ము.. అమ్మ ఉంటే అసలు ఇలా జరిగేదే కాదు..

ఆకాష్‌: మిస్సమ్మ ఉంటే అసలు ఇలా జరగనిచ్చేదే కాదు.. అవును అమ్ము చాలా బాధగా ఉంది. మనం విడిపోతాము అంటే ఏడుపు వస్తుంది. మనకే ఎందుకు ఇలా జరగాలి

అమ్ము: ఏడవకండి ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి

అంజు: అమ్ము మనం చిన్న పిల్లలం కదా ఆ దేవుడు మనకు ఎందుకు ఇలా చేశాడు..

ఆనంద్‌: ఒకసారి అమ్మను దూరం చేశాడు.. తర్వాత మిస్సమ్మను దూరం చేశాడు. చివరికి బుజ్జమ్మ కూడా దూరం అయింది

ఆకాష్‌: మన కోసం ఎవ్వరూ రారా అమ్మూ.. మన బాధల్ని తీర్చడానికి మన కన్నీళ్లు తుడవడానికి ఎవరూ రారా..?

అమ్ము: బుజ్జమ్మను తీసుకుని మిస్సమ్మ ఇంటికి తిరిగి వస్తుందని కృష్ణుడి పాదాలు వేశాం.. కానీ మనమే ఇంట్లో లేకుండా పోతున్నాం.. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కూడా అనుకోలేదు..

అంజు: ఒకవేళ మనం వెళ్లిపోయాక మిస్సమ్మ, బుజ్జమ్మ తిరిగి వస్తే..

ఆనంద్‌: వాళ్లు ఎప్పటికీ తిరిగి రారు అని మనోహరి ఆంటీ అంతుంది కదా అంజు

ఆకాష్: డాడ్‌ కూడా ఆ మాటే అంటున్నారు.. డాడ్‌ చెప్పారంటే.. వాళ్లు తిరిగి రాకపోవచ్చు

అమ్ము: నేను డాడ్‌ తో చెప్తాను.. మనం రెండు రోజుల్లో వెళ్లిపోదాం.. మనం వెళ్లాక మిస్సమ్మ, బుజ్జమ్మ తిరిగి వస్తే.. మనం ఎక్కడున్నా సరే మిస్సమ్మ మనల్ని ఇక్కడకు తీసుకొస్తుంది. మనల్ని టార్చర్‌ చేస్తున్న మనోహరి ఆంటీకి మిస్సమ్మ బుద్ది చెప్తుంది.

అంజు: అయితే మనం వెళ్లకముందే మిస్సమ్మ, బుజ్జమ్మ ఇంటికి తిరిగి వస్తే బాగుండు

అంటూ పిల్లలు ఒకరినొకరు పట్టుకుని బాధపడుతుంటారు. మరోవైపు అరకు నుంచి బసులో వస్తున్న విక్రమ్‌కు సడెన్‌గా హర్ట్‌ స్ర్టోక్‌ వస్తుంది. బాధతో విలవిలలాడుతుంటే.. బుజ్జమ్మ చూసి భాగీకి చెప్తుంది. ఇద్దరూ కలిసి విక్రమ్‌కు సీపీఆర్‌ చేసి బతికిస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today July 28th:ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్న మాధవ్‌,కేశవ్‌, కన్నా....దీనికి మహాలక్ష్మీ రియాక్షన్ ఏంటి..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్న మాధవ్‌,కేశవ్‌, కన్నా....దీనికి మహాలక్ష్మీ రియాక్షన్ ఏంటి..?
Brahmamudi Serial Today July 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, మదన్ మధ్య గొడవ – శశికి పడిపోయిన ఐషు
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, మదన్ మధ్య గొడవ – శశికి పడిపోయిన ఐషు
Nuvvu leka Neanu Lenu Serial Today July 28th:హాల్‌లో చాపమీద పడుకున్న విక్కీ....తిట్టి రాధ గదిలోకి పంపించిన సునంద
నువ్వులేక నేను లేను: హాల్‌లో చాపమీద పడుకున్న విక్కీ....తిట్టి రాధ గదిలోకి పంపించిన సునంద
Illu Illalu Pillalu Serial Today July 28th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ సీక్రెట్‌ అందరి ముందు బట్టబయలు! ఒక్క చెంప దెబ్బతో ట్విస్ట్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ సీక్రెట్‌ అందరి ముందు బట్టబయలు! ఒక్క చెంప దెబ్బతో ట్విస్ట్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget