Nindu Noorella Saavasam Serial Today January 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: లోయలోంచి పడిపోయిన బుజ్జమ్మ – అయోమయంలో భాగీ
Nindu Noorella Saavasam serial Today Episode January 31st: బుజ్జమ్మను ఎత్తుకుని వెళ్లిన రాబంధు కొండల మీద తీసుకెళ్లి పెడుతుంది. అక్కడి నుంచి బుజ్జమ్మ లోయలోకి పడిపోతుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode: రన్నింగ్ కాంపిటీషన్‌లో పాల్గొంటున్న బుజ్జమ్మను సడెన్ గా వచ్చిన రాబంధు బుజ్జమ్మ మీద దాడి చేస్తుంది. అమర్ అడ్డుగా వెళ్తాడు. దీంతో ఆ రాబంధు అమర్ మీద దాడి చేసి రక్కేస్తుంది. దీంతో అమర్ దూరంగా కింద పడిపోతాడు. గాయాలై రక్తం కారుతుంది. ఇంతలో రాబంధు బుజ్జమ్మను కాళ్లతో పట్టుకుని పైకి ఎగిరిపోతుంది. చూస్తున్న అందరూ భయపడిపోతుంటారు. మనోహరి, చంభా హ్యాపీగా ఫీలవుతుంటారు. ముసుగులో ఉన్న భాగీ ఏడుస్తుంది.
భాగీ: ( మనసులో) అప్పుడు అమ్ము మీద దాడి చేసిన రాబంధే ఇప్పుడు మళ్లీ వచ్చింది. బుజ్జమ్మను ఎత్తుకుపోయింది. అంటే పంతులు చెప్పింది నిజమే అయింది. అయ్యో దేవుడా ఇప్పుడెలా చేయాలి. పంతులు చెబితే కరుణ తిట్టి పంపించేసింది. ఇప్పుడు రాబంధు బుజ్జమ్మను ఎత్తుకుని వెళ్లింది. ఇప్పుడేం చేయాలి
మనోహరి: ( మనసులో అయ్యో అమర్ నువ్వెందుకు వెళ్లావు మధ్యలో) చంభా ఇప్పుడు ఆ అరుంధతిని ఎత్తుకెళ్లిన రాబంధు ఏం చేస్తుంది. అసలు ఎక్కడికి తీసుకుని వెళ్లి ఉంటుంది.
చంభా: ఏమో మనోహరి అది వచ్చి తీసుకెళ్లడం వరకే మనకు తెలుసు..? అది తర్వాత ఏం చేస్తుందన్నది మన చేతుల్లో ఉండదు. పర్వతాలలోకి ఎత్తుకెళ్లి రాబంధులన్నీ కలిసి ఆహారం తీసుకోవచ్చు.. లేదా ఇంకేదైనా చేయోచ్చు..
మనోహరి: ఆహా ఇప్పటికీ నా పగ నెరవేరింది. ఓసేయ్ అరుంధతి ఆ జన్మలో నా చేతిలో చచ్చావు. ఈ జన్మలోనూ నా చేతిలోనే చచ్చావు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తి వచ్చినా నా చేతిలోనే నీ చావు ఉంటుంది. చూశావా చంభా ఆ అరుంధతి ఏమో కానీ ఈ అరుంధతికి శక్తులు ఉన్నాయి. అన్నావు.. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించావు.. కానీ ఇప్పుడేమైంది. నా చేతుల్లో దాని చావు రాసి పెట్టి ఉన్నప్పుడు ఎవ్వరూ తప్పించలేరు.. ఇక ఈ దెబ్బతో ఆ భాగీ ఊరు వదిలి వెళ్లిపోవడం ఖాయం..
చంభా: లేదు మనోహరి బిడ్డ చనిపోయిన బాధలో ఇక ఎవరికి ఏ ముప్పు లేదన్న నమ్మకంతో భాగీ మళ్లీ అమరేంద్రను కలిస్తే ఏం చేస్తావు..
మనోహరి: దానికి ఒక ప్లాన్ చేశాను చంభా.. అది జన్మలో అమర్‌ను కలవకుండా చేయబోతున్నాను. కాదు కూడదు అంటే అది సూసైడ్ చేసుకుని చచ్చిపోయేలా చేస్తాను..
చంభా నువ్వు ఏమైనా చేస్తావు మనోహరి అంటూ నవ్వుతుంది. మరోవైపు అందరూ టెన్షన్ పడుతుంటారు. అంజు బాధపడుతూ.. స్కూల్ లో ఉన్న గణపతి విగ్రహం దగ్గరకు వెళ్లి మొక్కుతుంది. పిల్లలందరూ అంజు వెనకాలే వెళ్లి దేవుడిని మొక్కుతుంటారు. అమర్ మిలటరీ వాళ్లకు ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. మరోవైపు బుజ్జమ్మను ఎత్తుకెళ్లిన రాబంధు. పెద్ద పెద్ద కొండల మీద తమ స్థావరం దగ్గర తీసుకెళ్లి బుజ్జమ్మను కూర్చోబెట్టి మిగతా రాబంధులను పిలుస్తుంది. అన్ని రాబంధుల వచ్చి బుజ్జమ్మను తినడానికి రెడీ అవుతుంటాయి. కింద అంజు దేవుడి ముందు ఏడుస్తూ..
అంజు: దేవుడా మా బుజ్జమ్మను కాపాడు.. ఎలాగైనా బుజ్జమ్మను కాపాడు దేవుడా..? రాబంధులు మా బుజ్జమ్మను ఏమీ చేయకుండా కాపాడు స్వామి.. అవి ఎక్కడికి ఎత్తుకెళ్లాయో ఏమో కానీ నువ్వే మా బుజ్జమ్మను కాపాడాలి స్వామి
అంజు దేవుడిని మొక్కుతుంటే.. పైన ఇంకో పెద్ద రాబంధు వచ్చి మిగతా రాబంధులతో పోట్లాడుతుంది. ఆ పోట్లాటలో బుజ్జమ్మ లోయలోకి పడిపోతుంది. ఆ రాబంధు మిగతా వాటిని చంపేసి స్పీడుగా వెల్లి బుజ్జమ్మను తన మీద కూర్చోబెట్టుకుని స్కూల్ లోకి తీసుకెళ్తుంది. అదంతా చూసిన వాళ్లు ఆశ్చర్యపోతుంటారు. కిందకు దిగిన బుజ్జమ్మ పరుగెత్తుకుంటూ వెళ్లి అమర్ ను ఏవండి అంటూ హగ్ చేసుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
ట్రెండింగ్ వార్తలు






















