Nindu Noorella Saavasam Serial Today January 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: రాథోడ్ ను ట్రాప్ చేసిన ఘోర - ఆరు కథ ముగిసిందన్న గుప్త
Nindu Noorella Saavasam Today Episode: అమర్‌ను అడ్డగించి ఆస్తికలు తీసుకోవడానికి రాథోడ్ ను ట్రాప్ చేస్తాడు ఘోర దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Nindu Noorella Saavasam Serial Today January 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: రాథోడ్ ను ట్రాప్ చేసిన ఘోర - ఆరు కథ ముగిసిందన్న గుప్త nindu Noorella Saavasam serial today episode January 18th written update Nindu Noorella Saavasam Serial Today January 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: రాథోడ్ ను ట్రాప్ చేసిన ఘోర - ఆరు కథ ముగిసిందన్న గుప్త](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/18/e4ae1d9c3679e0c87ef64ace946a8c891737164493294879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nindu Noorella Saavasam Serial Today Episode: నాకు ఏమీ గుర్తు రావడం లేదని అంజు చెప్తుంది. ఆ మంత్రగాడే ఏదో చేసి ఉంటాడని అందుకే అంజు అంతా మర్చిపోయిందని అంటుంది నిర్మల. డాక్టర్ అంజు పాపను రెస్ట్ తీసుకోమన్నాడు.. నవ్వు ఇబ్బంది పెట్టకమ్మా అని రామ్మూర్తి చెప్పగానే.. అంజును పడుకోబెడుతుంది మిస్సమ్మ. గార్డెన్‌లో నిలబడ్డ ఆరు ఇంటి వైపు చూస్తుంది. గుప్త వచ్చి ఏదో అనబోతూ.. ఆగిపోగానే..
ఆరు: ఏదో అనబోయారు గుప్త గారు అనండి.
గుప్త: మేము అనుటకు నీవు వినుటకు ఏమీ లేదు బాలిక.. నేను చెప్పదలిచింది ఏమిటో నీకు బాగా తెలియును
ఆరు: నేను ఓడిపోయాను గుప్తగారు. మళ్లీ మనోహరి చేతిలో విధి చేతిలో నేను పూర్తిగా ఓడిపోయాను గుప్త గారు. ఈరోజుతో నాకు వచ్చిన శక్తిని ఉపయోగించి మనును ఆయన జీవితంలోంచి శాశ్వతంగా దూరం చేయాలనుకుని చేయలేకపోయాను.
గుప్త: ఆ ఘోరా నుంచి తప్పించుకోవడం కూడా విజయమే బాలిక.. ఆ ఘోరా నిన్ను బంధించి ఉంటే ఎంతటి ప్రమాదం జరిగి ఉండేదో అర్థం అవుతుందా..?
ఆరు: మనును ఇంట్లోంచి పంపించకుండా నేను వెళ్లిపోతే ఏం జరుగునో మీకు తెలుసు కదా గుప్తగారు
గుప్త: ఏమి జరుగవలెనని లిఖించిబడి ఉండునో అదియే జరుగును బాలిక. దీనిని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదియే నిజం. నువ్వు ఉన్నా లేకున్నా జరిగేది జరుగుతుంది
ఆరు: మీరు అనుకున్నంత సులువుగా నేను అనుకోలేకపోతున్నాను
గుప్త: ఈ ఒక్క రాత్రి అయినా ప్రశాంతంగా నీ కుటుంబంతో గడుపు..
ఆరు: నేను ఎక్కడికి వెళ్లను.. నేను కొలిచే దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నా కథ ఇంకా పూర్తి కాలేదు
గుప్త: నీ కథ ఎప్పుడో పూర్తి అయింది బాలిక.
అని గుప్త చెప్పినా వినకుండా ఆరు వెళ్లిపోతుంది. భాగీ, రామ్మూర్తికి పాలు తీసుకెళ్లి ఇస్తుంది. మీతో కాసేపు మాట్లాడి వెళ్తాను నాన్నా అంటూ రామ్మూర్తి పక్కన కూర్చుంటుంది.
రామ్మూర్తి: అమ్మా నువ్వు సంతోషంగానే ఉన్నావు కదమ్మా
భాగీ: అయ్యో చాలా సంతోషంగా ఉన్నాను నాన్నా ఒక కుటుంబం తోడు ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది.
రామ్మూర్తి: నువ్వు సంతోషంగా ఉన్నావు నాకు అదే చాలు తల్లి.
భాగీ: నా సంతోసం సరే మీ బాధ గురించి చెప్పండి నాన్నా
రామ్మూర్తి: నాకు బాధేంటి అమ్మా .. నువ్వు సంతోషంగా ఉన్నావు.. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలమ్మా
భాగీ: అది నాకు అర్థం కావడం లేదు నాన్నా.. మొన్న మీరు ఆయన కోసం అంత కోపంగా ఇంటికి వచ్చారు. తర్వాత మౌనంగా ఉండిపోయారు. ఆయన ఏమీ చెప్పడం లేదు. రాథోడ్‌ను అడిగితే నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను అంటాడు. ఫ్లీజ్ అక్క విషయంలో నిజం చెప్పండి నాన్నా.. ఆ నిజం ఎంత బాధపెట్టినా నేను తట్టుకోగలను.
అంటూ భాగీ ప్రాధేయపడినా రామ్మూర్తి నిజం చెప్పడు. భాగీ వెళ్ళిపోతుంది. మరోవైపు అమర్ కాశీకి వెళ్లడానికి ముందే అటాక్ చేయాలని ఘోర తన అనుచరులకు తన ప్లాన్ చెప్తాడు. రాథోడ్‌ను మంత్రంతో ట్రాప్ చేశానని ఆ రాథోడే రేపు కారు మనం అనుకున్న ప్లేస్‌కు తీసుకొస్తాడని చెప్పడంతో మిగతా ఘోరాలు ఆశ్చర్యపోతారు. సరైన టైంలో సరైన అస్త్రం ప్రయోగించావని అంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)