Nindu Noorella Saavasam Serial Today January 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: గతం గుర్తు చేసుకున్న బుజ్జమ్మ – షాక్ అయిన మనోహరి
Nindu Noorella Saavasam serial Today Episode January 15th: అమర్ ఇంటికి వెళ్లిన బుజ్జమ్మకు పునర్జన్మ జ్ఞాపకాలు వస్తుంటాయి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆశ్రమంలోంచి బయటకు వెళ్తున్న అమర్.. కిటికీ దగ్గర చూస్తున్న భాగీ దగ్గరకు వచ్చి ఆగిపోతాడు. భాగీ వెంటనే చాటుకు వెళ్తుంది. అమర్ మాత్రం అలాగే నిలబడిపోతాడు. రాథోడ్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు.
రాథోడ్: ఏమైంది సార్..? ఆగిపోయారు.. ఏమైనా మర్చిపోయారా..? చెప్పండి సార్ ఎందుకు ఆగిపోయారు
అమర్: లేదు రాథోడ్ ఎందుకో గుండె భారంగా ఉంది నాకు సంబంధించింది ఏదో ఇక్కడ వదిలేసి వెళ్తున్నట్టుగా ఉంది
రాథోడ్: సార్ అరుంధతి మేడం ఇక్కడే పెరిగారు కదా..? ఆ ఫీలింగ్ మిమ్మల్ని వెంటాడుతుందేమో
అమర్: వెళ్దాం పద రాథోడ్
అనగానే ఇద్దరూ వెళ్లిపోతారు. రూంలో ఏడుస్తూ ఉంటుంది భాగీ. ఇంతలో బ్యాగ్ తీసుకుని రాజు వచ్చి ఈ శారీ అమరేంద్ర సార్ మీకు ఇమ్మన్నారు అంటూ ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ శారీ చూసిన భాగీ ఎమోషనల్ గా శారీని హత్తుకుంటుంది. మరోవైపు అంజు కోసం మనోహరి, చంభా స్కూల్ దగ్గరకు వెళ్తారు. అక్కడ అంజు, బుజ్జమ్మ కలిసి బయటకు వస్తుంటారు.
చంభా: మన ఇంటికి రావడానికి ఆ పిల్ల ఒప్పుకుంటుందో లేదో మనోహరి
మనోహరి: అంజుతో చెప్పి ఒప్పిస్తాను కదా (బుజ్జమ్మ సెక్యూరిటీకి బై చెప్తుంది.) చూశావా చంభా దాని జన్మ మారినా బుద్ది మాత్రం మారలేదు అందరితో కలుపుగోలుగా ఉంటుంది
చంభా: అందుకే అరుంధతి ఆ జన్మలో అందరి బంధువు అయింది. ఈ జన్మలో కూడా అదే కొనసాగిస్తుంది
మనోహరి: సరే దగ్గరకు వెళ్లి మాట్లాడుదాం పదా
అని ఇద్దరూ అంజు వాళ్ల దగ్గరకు వెళ్తారు.
అంజు: మీరు వచ్చారేంటి..? రాథోడ్ రాలేదా..?
మను: రాథోడ్ కొంచెం బిజీగా ఉన్నాడు.. అందుకే నేను వచ్చాను
బుజ్జమ్మ: ఈవిడ ఎవరు అక్కా..?
అంజు: తను మనోహరి ఆంటీ మిస్సమ్మ తర్వాత మాకు కేర్‌టేకర్ అయింది
మనోహరి: ( మనసులో) ఏమీ తెలియనట్టు ఎంత బాగా అడుగుతున్నావే
బుజ్జమ్మ: మిస్సమ్మ ఎవరు..?
అంజు: మా అమ్మ తర్వాత అమ్మ చాలా మంచిది
బుజ్జమ్మ: తను ఎక్కడ ఉంది..?
మను: నీ దగ్గరే ఉంది కదా అరుంధతి
బుజ్జమ్మ: నా దగ్గర ఉందా..?
మను: అంటే ఐ మీన్ నువ్వు అంజు పక్కన ఉన్నావు కదా..? అంటే మిస్సమ్మ నీ దగ్గర ఉన్నట్టే
అంజు: ఓకే బుజ్జమ్మ ఇక నేను బయలుదేరనా..?
మను: అదేంటి అంజు నీ ఫ్రెండ్‌ను మన ఇంటికి పిలువు
అంజు: అవును బుజ్జమ్మ ఈరోజు నువ్వు మా ఇంటికి రావాలి
బుజ్జమ్మ: ఈరోజా… వద్దులే అక్కా తర్వాత ఎప్పుడైనా వస్తాను
మను: అంజు అంతలా అడుగుతుంది కదా..? అరుంధతి ఈ ఒక్క రోజు రా అరుంధతి
అంజు: ఈవెనింగ్ కల్లా మళ్లీ నిన్ను పంపిచేస్తానులే రా బుజ్జమ్మ
మను: నేను పంపించాలి కదా..?
అంజు: ఏంటి అంటీ ఏదో అంటున్నారు..?
మను: అదే నేను దగ్గరుండి పంపిస్తాను అంటున్నాను
అనగానే.. అంజు, మనోహరి ఇద్దరూ కలసి బుజ్జమ్మను కన్వీన్స్ చేసి ఇంటికి తీసుకెళ్తారు. ఇంట్లోకి వెళ్లి కారు దిగగనే బుజ్జమ్మకు పునర్జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి. అవి గుర్తు చేసుకుంటూనే ఇంట్లోకి వెళ్తుంది. బుజ్జమ్మ ఇంట్లోకి రావడంతో అమర్ ఎమోషనల్ అవుతాడు. పిల్లలు బుజ్జమ్మక నవ్వుతూ ఎదురెళ్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















