Nindu Noorella Saavasam Serial Today December 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరుకు నిజం చెప్పిన గుప్త – మనిషిలా మారిపోయిన ఆరు
Nindu Noorella Saavasam serial Today Episode December 7th: భాగీ సీమంతం వరకు మనిషిలా మారిపోయే వరం పొందుతుంది ఆరు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అందరూ సీమంతం సంబరంలో ఉంటే ఆరు మాత్రం రామ్మూర్తి చెప్పిన మాటలు.. భాగీ బాధపడిన రోజులు గుర్తు చేసుకుని బాధపడుతుంది. అప్పుడే గుప్త వస్తాడు.
గుప్త: బాలిక నువ్వు ఎంత శోకించినను సమస్య పరిష్కారం కాదు.. జరగబోవునది అంతా ఆ జగన్నాథుడి లీల
ఆరు: నిజమే కదా గుప్త గారు ఇలాంటి అప్పుడే కదా నేను నా చెల్లి పక్కన ఉండాలి. ఇలాంటప్పుడే కదా నేను నా చెల్లికి అమ్మనై అన్ని చేయాలి. ఇలాంటప్పుడే నేను ఎందుకు చనిపోయానా అని బాధగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడే నేను బతికి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు నేను బతికి ఉంటే నా చెల్లికి కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకునే దాన్ని. తనకు జరగాల్సిన ముచ్చట్లన్నీ నేను జరిపించేదాన్ని.. నా చెల్లి సంతోషంలో నా సంతోషాన్ని చూసుకునేదాన్ని.. కానీ ఇప్పుడు అవన్నీ తీరని ఆశలు నెరవేరని కోరికలు.
గుప్త: లేదు బాలిక నువ్వు ఆశపడునది కోరుకున్నది జరుగును
ఆరు: ఎలా జరుగుతుంది గుప్త గారు.. నేను చనిపోయాను కదా..? పైగా ఈ సీమంతం కూడా జరగదు. మనోహరి విధ్వంసం సృష్టిస్తుందని మీరే కదా చెప్పారు
గుప్త: జరగబోయేది జగన్నాథుడి లీల అని చెప్పితిని కదా.. అది కాసేపు విస్మరింపుము.. ఇప్పటి వరకు నీవు నీ కొరకు ఏమీయును కోరుకోలేదు.. తొలిసారిగా నేను జీవించి ఉంటే బాగుండు అని కోరుకున్నావు.. నిస్వార్థమైన నీ కోరికను మేము నెరవేర్చకపోతే మన బంధమునకు సార్థకత లేదు బాలిక
ఆరు: ఏమంటున్నారు గుప్త గారు నాకేం అర్థం కావడం లేదు
గుప్త: అవును బాలిక నీ సహోదరి సీమంతమునకు నీవే స్వయంగా ఈ ఊరి జనులందరినీ ఆహ్వానించే ఏర్పాటు చేసేదము
ఆరు: అదెలా సాధ్యం గుప్త గారు
గుప్త: మాకును కొన్ని శక్తులు ఉన్నయన్న విషయం మరచితివా..? బాలిక
ఆరు: కానీ మీ శక్తులు వాడకూదడని వాడితే రాజు గారికి తెలిసిపోయి ఆయన ఆగ్రహానికి గురి అవుతారని మీరే చెప్పారు కదా..?
గుప్త: మా ప్రభువుల వారి ఆగ్రహానికి మేము గురి అగుట తథ్యం మేము అందులకు సిద్ద పడే నీతో భూలోకమునకు వచ్చితిమి
ఆరు: వద్దు గుప్త గారు వద్దు.. నా వల్ల ఇది వరకే మీరు చాలా బాధపడ్డారు.. మళ్లీ మిమ్మల్ని బాధపెట్టలేను..
గుప్త: మా కళ్ల ముందే మా సోదరి శోకించుచుంటే మేము చూడలేము..మా నరకమున మేము పాపులను మాత్రమే వీక్షించెదము కానీ తొలిసారి నీ వంటి ఉత్తమురాలిని.. పుణ్యాత్మురాలిని చూసితిమి మమ్ములను కన్నది ఒక మాతృమూర్తియే బాలిక.. నీ మాతృ హృదయాన్ని మేము అర్థం చేసుకోగలం ( మంత్రంతో ఒక పాత్రను తీసుకొస్తాడు.) ఇది తీసుకొని అందరినీ సీమంతానికి ఆహ్వానింపుము.. అవును ఈ ఊరి జనులు ఎవ్వరూ నిన్ను ఇంతకు మునుపెన్నడూ చూడలేదు కదా..?
ఆరు: లేదు గుప్త గారు నేను ఇక్కడే పుట్టినా.. అనాథ ఆశ్రమంలో పెరిగాను.. పెద్దయ్యాక నేను ఎవరికీ తెలియదు
గుప్త: అటులయినా ఇది తీసుకొనుము.. నీ సహోదరి శుభకార్యమునకు ఈ ఊరి జనులందరినీ నువ్వే స్వయంగా వెళ్లి ఆహ్వానించుము.. నీ సంకోచం నాకు అవగతం అయినది.. నీవు అందరికీ కనిపించెదవు..( తన చేతి ఉంగరం తీసి ఇస్తాడు) నీకు ఎంతగానో ఇష్టమైన మా అంగుళీకము దీనిని ధరించినచో నీవు అందరికీ కనిపించెదవు
అంటూ గుప్త వరం ఇవ్వగానే ఆర ఎమోషనల్ అవుతుంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను గుప్త గారు అంటూ ఊరిలోకి వెళ్తుంది ఆరు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















