అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును హెచ్చరించిన గుప్త – రంగంలోకి దిగిన చంభా

Nindu Noorella Saavasam serial Today Episode August 2nd:  రణవీర్‌ తీసుకొచ్చిన చంభా అమర్‌ ఇంటికి వెళ్లి గార్డెన్ లో ఉన్న ఆరు ఆత్మతో మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరును ఎలాగైనా ఆ ఇంట్లోంచి తరిమి కొట్టాలని అందుకోసం తాను చేయని ప్రయత్నం అంటూ లేదని వాపోతుంది మనోహరి. అయితే ఘోరాను మించిన శక్తిని తీసుకొస్తానని రణవీర్‌ చెప్తాడు. మనోహరి ఉత్సుకతతో ఎవరు ఆ శక్తి అని అడుగుతుంది. రణవీర్‌ చంభా అని చెప్తాడు.

మను: చంబానా ఎవరు..? ఎక్కడ ఉంటుంది…?

రణవీర్: అదుపు తప్పిన ఆత్మలను అదుపులో పెట్టి ఆనంత శూన్యాలకు విసిరేసే అతీతమైన తాంత్రిక శక్తి గల వ్యక్తి. ఒక ఆడదాన్ని కొట్టాలంటే ఇంకో ఆడదానికే సాధ్యం

మను: ఇంతకీ ఆ చంభా ఎక్కడ ఉంటుంది..?

రణవీర్‌: కోల్‌కతాలో అక్కడ అందరూ చంబాను కోల్‌కతా కాళీ అంటారు. ఇప్పటి వరకు చంభా ఎప్పుడు ఇలాంటి కేసులు ఫెయిల్ అవ్వలేదు. లాయరు వెంటనే చంభాని కాంటాక్ట్ చేయ్‌.. హైదరాబాద్ కు టికెట్‌ వేయ్‌.. ఈ సాయంత్రానికల్లా చంభా ఇక్కడ ఉండాలి

లాయరు:  ఒకే రణవీర్‌ ఇప్పుడే చేస్తాను..

అని వెళ్లిపోతాడు. రణవీర్‌ ఇంట్లో జరిగిన విషయం గుప్తకు అర్థం అవుతుంది. గార్డెన్‌లో కూర్చుని ఉంటాడు గుస్త. ఆరు అటూ ఇటూ తిరుగుతుంది.

గుప్త: బాలిక నీకు సమస్య ఉన్నచో నేను అటూ ఇటూ తిరుగవలెను నువ్వు కూర్చోవలెను కానీ నువ్వేంటి అటూ ఇటూ తిరుగుతున్నావు. నీ సమస్య ఏంటో చెప్పుము మేము పరిష్కరించెదము

ఆరు: అది కాదు గుప్త గారు అసలు ఆ మనోహరి ఏంటి నోరు తెలిస్తే అబద్దాలు మనోహరి ఫైట్‌ ‌చేసిందట.. నా పిల్లలను కాపాడిందట.. అనాథ ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా అంతే ప్రతి దానికి అబద్దాలు అడుతూనే ఉండేది. చివరికి దాని బతుకే అబద్దం బతుకు అయిపోయింది. అరే అంజు తన కూతురే తనను కాపాడుతుందన్న విషయం తనకు తెలియడం లేదు

గుప్త: అనినా.. నీ పిల్ల పిచ్చుకే తన సుపుత్రిక అని తనకు తెలియలేదని నువ్వు నిరాశ చెందుతుంటివా..?

ఆరు: ఏహేయ్‌ అలా అనుకోవడం లేదు గుప్త గారు. మనోహరి చెప్పిన దానికి కోపం వస్తుంది నాకు

గుప్త: ఆ అయినచో ఇప్పుడు నీ స్నేహితురాలి పతిదేవుడిని నువ్వు చెయ్యి చేసుకున్న విషయం నీ స్నేహితురాలు నీ పతిదేవునకు చెప్పలేదని నువ్వు చింతించుచుంటివా..? ఒక విధంగా చెప్పవలెను అన్నా నీ స్నేహితురాలు ఆ నలుగురు దుండగులను మట్టి కరిపించింది. ఆ సమయమున తమరు ఇచ్చట ఉండి గానములు ఆలపించుచూ.. కుప్పి గంతులు వేయుచూ.. నీ పతి దేవుడు అప్పగించిన బాధ్యతను ఆ మనోహరి నిలబెట్టునని నమ్మకముగా ఉంటివి.. అటు పిమ్మట నీ పతి దేవుడిని పొందుటకు తన పతి దేవుడినే ఎదురించినది చివరకు అతగాడు ఆయుధం చూపించినచో కాస్త జంకినది కానీ లేచినో అతగాడిని కూడా మట్టి కరిపించినను ఆశ్చర్యము లేకుండును ఇచ్చట నువ్వు నీ గురించి నీ స్నేహితురాలు చెప్పలేదని ఊగిపోవుతుంటివి

ఆరు: ఏహెయ్‌ మనోహరి నా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు గుప్త గారు

గుప్త: మరి ఎందులకు నీకు ఆవేదన మాకు ఈ వేదన

ఆరు: ఆవేదన లేదు.. నివేదన లేదు కానీ అసలు మను నిజం ఎందుకు చెప్పలేదు. అయినా మను అబద్దం చెప్తే నాకేంటి..? నా పిల్లలు బాగుంటే చాలు

గుప్త: మా సోదరి సమానురాలివైన నువ్వు బాగున్నచో అదియే మాకు చాలు

ఆరు: నాకేమైంది బాగానే ఉన్నాను కదా గుప్త గారు.. పైగా ఏ కష్టం వచ్చినా కాపాడుకోవడానికి శక్తులు కూడా ఉన్నాయి కదా..?

గుప్త: ఆ శక్తులను మించిన శక్తి వచ్చి నిన్ను శక్తి హీనురాలిని చేయునేమోనని మా మనసు కీడును శంకించుచున్నది

ఆరు: అర్థం కాలేదు గుప్త గారు ఇప్పుడు నా శత్రువు ఆ మనోహరే కదా..? ఇంకెవరు ఉన్నారు..?

గుప్త:  ఇప్పటి వరకు నీ శత్రువు నీ స్నేహితురాలే బాలిక. ఇప్పుడు తన పతిదేవుడు కూడా తోడయ్యాడు. నిన్ను నీ కున్న శక్తలను కళ్లారా చూశాడు. ఇప్పుడు నీకున్న శక్తులను ఎటుల నిర్వీర్యం చేయవలెనో అని తాంత్రికులతో మాంత్రికులతో సంప్రదించాడు. నీకున్న గడువు కాలము సమీపించుచున్నది..నీ భవిష్యత్తు అగమ్యగోచరంగా అగుపించుచున్నది

ఆరు: ఆ రణవీర్‌ నన్నేం చేయడు. మీరు ఉండగా నాకేం కాదు

అంటుండగానే చంభా గేటు ఓపెన్‌ చేసుకుని వస్తుంది. గార్డెన్‌లో నిలబడిన ఆరు చూసి దగ్గరకు వెళ్తుంది.

చంభా: నువ్వేనా అది

ఆరు: నువ్వెవరు

చంభా: నా పేరు చంభా నేను నిన్ను అంతం చేయడానికే వచ్చాను

ఆరు: అది నీ వల్ల కాదు

చంభా: నా శక్తి ఏంటో నీకు తెలియదు.. నా శక్తి చూస్తావా..?

అని చంభా తన శక్తులను ఆరు మీదకు వదులుతుంది. ఆరు చూస్తూ నిలబడుతుంది. అంతా దూరం నుంచి గమనిస్తుంది మనోహరి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
Gundeninda Gudigantalu August 19th:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
గుండెనిండా గుడిగంటలు:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget