Nindu Noorella Saavasam Serial Today August 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: పూజ వాయిదా వేసిన ఘోర – అక్కను వెతికేందుకు మిస్సమ్మ పయనం
Nindu Noorella Saavasam Today Episode: తన సొంత అక్క కూడా అనాథ ఆశ్రమంలో ఉండేదని తనని కూడా వెతకమని నిర్మల, మిస్సమ్మకు చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు ఆత్మను వశం చేసుకోవడానికి ఘోర పూజలు చేయబోతుంటే వాల్ల గురువు వచ్చి ఇప్పుడు చేయొద్దని.. మూడు రోజుల తర్వాత పూజలు చేస్తే నీకు తిరుగుండదని చెప్తాడు. దీంతో ఘోర సరేనని అంటాడు. మరోవైపు పిల్లలు అందరూ స్కూలుకు రెడీ అవుతుంటే అంజు స్కూలుకు రానంటుంది. నాకు మమ్మీ వాళ్ల అమ్మా నాన్నలను చూడాలని ఉంది అంటుంది. మిగతా పిల్లలు కూడా మాకు చూడాలని ఉంది అంటారు. అమర్ ఇంటికి రాగానే మిస్సమ్మ కాఫీ తీసుకొస్తుంది.
అమర్: థాంక్స్ మిస్సమ్మా?
మిస్సమ్మ: భార్యాభర్తల మధ్య థాంక్స్ ఏంటండి. అదే రూమ్మేట్స్ మధ్య.. మహానుభావుడా దాని అర్థం ఇలా ప్రతి దానికి థాంక్స్ అవసరమా? అని
అమర్: అవసరమే..!
పిల్లలు కిందకు వస్తారు. ఇవాళ తాతయ్య దగ్గరకు వెళ్తున్నామా? అంటారు. ఇంతలో మంగళ ఫోన్ చేసి రామ్మూర్తి మిమ్మల్ని, భాగీని చూడాలంటున్నారు అని చెప్తుంది. అమర్ సరేనని అమ్మా నాన్నను తీసుకుని వస్తానని చెప్తాడు. అదే విషయం మిస్సమ్మను నిర్మల, శివరాంలకు చెప్పమంటాడు. తర్వాత అంజును ఫోన్ రాక ముందే తాతయ్య దగ్గరకు వెళ్దామని ఎలా చెప్పావు అని అడుగుతాడు. అమ్మా వాళ్ల పేరెంట్స్ దగ్గరకు వెళ్దామని చెప్పాము అంటారు. మీరు స్కూలుకు వెళ్లండి అంటాడు అమర్. స్కూలుకు వెళ్తున్న పిల్లలను చూసి ఆరు ఏడుస్తుంది. మరోవైపు మనోహరి మొదటి భర్త రణవీర్, మనోహరి ఫోటోకు బాణాలు వేస్తుంటాడు.
లాయర్: వద్దు రణవీర్ వద్దు..
రణవీర్: ఆ మనోహరిని పీక పిసికి చంపేంత కోపం ఉంది. కానీ వేటని వేటాడి వేటాడి చంపడం కంటే.. వేచి చూసి చంపడంలోనే ఎక్కువ మజా ఉంటుందని ఆగాను. పాత రణవీర్ అయ్యుంటే ఒక్క నిమిషం. ఒక్క బుల్లెట్ చాలనుకునే వాడిని. కానీ ఇప్పుడు నాకు కావాల్సింది అది నొప్పి తెలియకుండా నిమిషంలో చావకూడదు.
లాయర్: అసలు ఏం చేయబోతున్నావు రణవీర్ ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న మనోహరిని బయటికి ఎలా తీసుకురాబోతున్నావు.
రణవీర్: తీసుకొని రాను..నేను ఆ ఇంటికి వెళతా..మనోహరి కళ్ల ముందు నిలబడతా..
అనగానే లాయర్ ఏం మాట్లాడుతున్నావు. మనోహరి ముందుకు వెళ్లాలంటే ముందు అమరేంద్రను దాటాలని తెలియదా? అంటాడు లాయర్. అయితే ఇప్పటిదాకా ఆట మనోహరి ఆడింది .ఇప్పుడు నేను ఆడబోతున్నాను అంటాడు. నేను పెట్టే టార్చర్‌కు అదే నా కాళ్లు పట్టుకుని తనను అక్కడి నుంచి తీసుకెళ్లిపోమ్మని బతిమిలాడేలా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. మరోవైపు శివరాం, నిర్మల వచ్చి బయలుదేరుదామా? అని మిస్సమ్మను అడుగుతారు. సరే అంటుంది మిస్సమ్మ.
శివరాం: ఈ క్యారేజ్ ఏంటి మిస్సమ్మా?
మిస్సమ్మ: డాక్టర్ ను అడిగితే హోం ఫుడ్ పెట్టొచ్చని చెప్పారు మామయ్య. అందుకే నాన్నకు ఇష్టమైనవన్ని వండాను.
శివరాం: మీ నాన్నంటే ఎంత ప్రేమ అమ్మా నీకు. ఈ ప్రేమే ఆయన్ను పెద్ద ప్రమాదం నుంచి బయటపడేసి కోలుకునేలా చేసింది.
మిస్సమ్మ: కాదు మామయ్యా. నా ప్రేమ కాదు. ఆయన మంచి మనసు వల్లే మా నాన్న బతికాడు. నాన్నని ఆ పరిస్థితుల్లో చూసి ఆయనకు ఏం అవుతుందోనని చాలా భయమేసింది. డాక్టర్ గారు ఆఫరేషన్ కు అన్ని లక్షలు ఖర్చు అవుతుందని చెప్పగానే చాలా భయమేసింది అత్తయ్య. కొండంత కష్టాన్ని ఆయన ఒక్క మాటలో తీర్చేశాడు.
అంటూ మిస్సమ్మ బాధపడుతూ అమర్ చేసిన హెల్ప్ ను గుర్తు చేసుకుంటుంది. ఆయన లేకపోతే ఇవాళ నేను అనాథను అయ్యేదాన్ని అంటుంది. అయితే వెంటనే మీ అక్క కూడా అనాథ ఆశ్రమంలో ఉండేది అన్నావు కదా అమర్‌తో పాటు నువ్వు కూడా మీ అక్కను వెతుకు అని నిర్మల సలహా ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: నాకు చేతబడి చేశారు, రాజకీయ నాయకులకు ఇది గుణపాఠం: సుమన్