అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రన్నింగ్ రేస్ లో గెలిచిన అంజు – స్కూల్ లో ఎదురుపడ్డ మిస్సమ్మ, ఆరు

Nindu Noorella Saavasam Today Episode: రన్నింగ్ రేస్ లో గెలిచిన అంజును అభినందించేందుకు వెళ్తున్న ఆరు, మిస్సమ్మ ఒకరికొకరు ఎదురు పడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: బంటి పురమాయించిన పాప, అంజును కింద పడేలా చేస్తుంది. అంజు కింద పడి అమ్మా అంటూ బాధపడుతుంది. అరుంధతి బాధపడుతుంది. ప్రిన్సిపాల్‌ మాత్రం  హ్యాపీగా ఫీలవుతుంది.  ఇంతలో మిస్సమ్మ వచ్చి గట్టిగా అంజు అని పిలుస్తుంది. కమాన్‌ అంజు అంటూ ప్రోత్సహిస్తుంది. దీంతో అంజు మెల్లగా లేచి పరుగెడుతుంది. పరుగు పందెంలో అంజు విన్నర్‌ అవుతుంది. దీంతో మిస్సమ్మ, అరుంధతి, పిల్లలు చాలా హ్యాపీగా ఫీలవుతారు. బంటి, ప్రిన్సిపాల్‌ ఇరిటేటింగ్‌గా ఫీలవుతారు. మరోవైపు మనోహరి రూంలోకి వెళ్లి బాధపడుతుంది.

మనోహరి: అమర్‌ కు నిజం తెలియకుండా ఆపలేకపోయాను. ఇప్పుడిక నిజం తెలిసినా అమర్‌ మనసులో భాగీ మీద అభిమానం కాస్త బాధ్యతగా మారుతుంది. ఆ బాధ్యత బంధాన్ని బలపరచక ముందే.. ఏదో ఒకటి చేయాలి. ఒక్కో సమస్య నుంచి బయటపడాలి.

 అని ఆలోచిస్తుంటే ఎవరో మనోహరికి తన వీడియోను సెండ్‌ చేస్తారు. ఆ వీడియో చూసి భయంతో వీడియో పెట్టిన వ్యక్తికి నువ్వే నాకు కాల్‌ చేయ్‌ అని వాయిస్‌ మెసేజ్‌ పెడుతుంది. దీంతో ఆ వ్యక్తి మనోహరికి ఫోన్‌ చేస్తాడు.

మనోహరి: హలో ఎవరు నువ్వు ఏం కావాలి?

అజ్ఞాత వ్యక్తి: అదేంటి మనోహరి. చెప్పాను కదా యాభై లక్షలు కావాలని ఏంటి? అప్పుడే మర్చిపోయావా? పోని అమరేంద్రకు వీడియో పెట్టనా? నువ్వు జీవితంలో మర్చిపోకుండా చేస్తాడు.

మనోహరి: ఏయ్‌ ఈ మనోహరితో చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నావు. చస్తావు.

అజ్ఞాత వ్యక్తి: నువ్వు నీ స్నేహితురాలిని చంపావు. పిల్లల్ని చంపాలనుకున్నావు. ఇంకా నీ ఆకలి తీరలేదా? మనోహరి.

 అని ఆ వ్యక్తి చెప్పగానే మనోహరి భయపడుతుంది. ఎవరు? నువ్వు అంటూ భయపడుతుంది. దీంతో ఆ వ్యక్తి వెంటనే నాకు డబ్బులు ఇవ్వకపోతే అమరేంద్రకు నిజం చెప్తాను అంటూ బెదిరిస్తాడు. దీంతో మనోహరి డబ్బులు ఇస్తానని ఒప్పుకుంటుంది. ఫోన్‌ కట్‌ చేస్తుంది. అసలు ఎవరు ఇతను అని ఆలోచిస్తుంది మనోహరి. మరోవైపు స్కూల్‌లో ఒకవైపు నుంచి ఆరు, ఇంకోవైపు నుంచి మిస్సమ్మ పరుగెత్తుకొస్తుంటారు. ఒకర్నినొకరు డాష్‌ ఇచ్చుకుంటారు.

మిస్సమ్మ: ఏంటక్కా అలా భయపెట్టావు.

ఆరు: సారీ సారీ

మిస్సమ్మ: అవును ఎక్కడికి అంత హడావిడిగా వెళ్తున్నారు.

ఆరు: ఇందాకా రన్నింగ్‌ రేస్‌ అయిపోయింది కదా పిల్లల్ని కలవడానికి వెళ్తున్నాను.

మిస్సమ్మ: ఓహో మీ పిల్లలు కూడా రన్నింగ్‌ రేస్‌లో పాల్గొన్నారా?

ఆరు: పాల్గొనడమే కాదు గెలి.. గెలవలేకపోయారు.

మిస్సమ్మ: అయ్యో.. అవును.. నా కూతురు అంజలి రన్నింగ్‌ రేస్‌లో గెలిచింది తెలుసా?

  అని మిస్సమ్మ చెప్పగానే నా పిల్లలు అని మనసులో అనుకుంటుంది ఆరు. తర్వాత మిస్సమ్మ వెళ్లిపోతుంది. అంజు తాను గెలిచినందుకు అమ్ము వాళ్లతో ఫోజులు కొడ్తుంది. అక్కా, అన్నలతో సేవలు చేయించుకుంటుంది. మిస్సమ్మ చూసి నవ్వుకుంటుంది. మరోవైపు అమర్‌ తన సోల్జర్స్‌ తో అంజలి వాళ్ల స్కూల్‌ కు వస్తాడు. స్కూల్‌ మొత్తం చెక్‌ చేయమని చెప్తాడు. ప్రిన్సిపాల్‌ వచ్చి ఏందుకు చెక్‌ చేస్తున్నారని అడుగుతుంది. రన్నింగ్‌ రేస్‌ గురించి అంజలి గెలిచిందని చెప్తుంది. అమర్‌ పిల్లలను చూడాలని స్కూల్‌ లోపలికి  వస్తాడు. మిస్సమ్మ అమర్‌ సార్‌ వచ్చారని పరుగెత్తుకెళ్తుంది. పిల్లలు కూడా పరుగెత్తుకొచ్చి అమర్‌ ను చూసి హ్యాపీగా ఫీలవుతారు. మాకోసమే వచ్చారా? అని పిల్లలు అడిగితే లేదని డ్యూటీ మీద వచ్చానని అమర్‌ చెప్పగానే పిల్లలు డల్‌గా ఫీలవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  బాలయ్య, సూర్యపై ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Legislative Council: ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
Refurbished Laptop Buying Tips: రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - అయితే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే!
రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - అయితే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే!
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!కేటీఆర్ ఇంటి ముందు రాత్రంతా బీఆర్ఎస్ నేతలుపట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council: ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
Refurbished Laptop Buying Tips: రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - అయితే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే!
రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - అయితే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే!
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Unstoppable With NBK S4: 'అన్ స్టాపబుల్ 4'లో పవన్ గురించి బాలయ్య పవర్ ఫుల్ క్వశ్చన్ - అల్లు అర్జున్ ఐకానిక్ ఆన్సర్
'అన్ స్టాపబుల్ 4'లో పవన్ గురించి బాలయ్య పవర్ ఫుల్ క్వశ్చన్ - అల్లు అర్జున్ ఐకానిక్ ఆన్సర్
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Sravanthi Chokarapu : ఆసుపత్రి బెడ్‌పై స్రవంతి- మీ ఆశీస్సులు కావాలని విజప్తి- ఇలాంటి పోస్ట్ పెడతానని అనుకోలేదంటూ ఎమోషనల్‌
ఆసుపత్రి బెడ్‌పై స్రవంతి- మీ ఆశీస్సులు కావాలని విజప్తి- ఇలాంటి పోస్ట్ పెడతానని అనుకోలేదంటూ ఎమోషనల్‌
Embed widget