Nindu Noorella Saavasam Serial Today August 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్ ఇంట్లోకి వచ్చిన చంభా – భయంతో వణికిపోయిన ఆరు
Nindu Noorella Saavasam serial Today Episode August 20th: తనను పట్టుకోవడానికి మరోసారి వచ్చిన చంభాను చూసి ఆరు భయంతో వణికిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: స్కూల్ లో ఎలక్షన్ పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని ప్రిన్సిపాల్ చెప్తుంది. రిజల్ట్ ఇప్పుడే వచ్చిందని చెప్తూ స్టూడెంట్స్ అందరూ పోలింగ్ లో పాల్గొనడం హ్యాపీగా ఉందని చెప్తుంది. మరోవైపు సరస్వతి వార్డెన్ కోసం వెతుకుతున్న మనోహరి దగ్గరకు వెళ్తుంది భాగీ.
భాగీ: ఇక్కడ ఏం చేస్తున్నావు మను.. ఎవరి కోసం వెతుకుతున్నావు..
మను: నేను వెతకడం ఏంటి..? నేను పిల్లల ఎలక్షన్స్ కోసం వచ్చాను..
భాగీ: నువ్వు ఎందుకు వచ్చావో ఎవరిని వెతుకుతున్నావో నాకు బాగా తెలుసు..
మను: ఏయ్ నువ్వు ఎవరి గురించి అంటున్నావు
భాగీ: నేను చెప్పేది సరస్వతి వార్డెన్ గారి గురించి
మను: ఏం మాట్లాడుతున్నావు భాగీ మా సరస్వతి వార్డెన్ ఇక్కడిక వచ్చారా..?
భాగీ: మరీ అమాయకంగా మాట్లడకు మను నాకు అన్నీ తెలుసు..?
మను: ఏం తెలుసు.. నీకు
భాగీ: సరస్వతి మేడం ఇక్కడకు వచ్చారని తెలుసు.. ఆవిడ నాకు ఏదో చెప్పాలని చూస్తున్నట్లు నాకు తెలుసు.. ఆవిడ నాకు చెప్పకుండా నువ్వు అడ్డుపడుతున్నట్టు నాకు తెలుసు
మను: ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా..? నేనెందుకు అడ్డు పడతాను.. నాకేంటి అవసరం..?
భాగీ: నీ అవసరం ఏంటో నాకు తెలుసు మను
మను: తెలుసు తెలుసు అంటున్నావు.. అసలు నా గురించి నీకేం తెలుసు..?
భాగీ: చాలా తెలుసు కానీ కొన్ని డౌట్లు ఉన్నాయి. అవి సరస్వతి మేడం దగ్గర క్లియర్ చేసుకుంటాను. నీ మీద నా అనుమానం కన్‌ఫం అయిన మరుక్షణ నా రియాక్షన్ వేరేలా ఉంటుంది.
మను: ఏం చేస్తావే నువ్వు
భాగీ: నేను ఏం చేస్తానో ఆ రియాక్షన్ వినాలని ఉందా..? చెప్పు మనోహరి నా రియాక్షన్ రిజల్ట్ వినాలని ఉందా..?
అంటుండగానే.. మైకులో ప్రిన్సిపాల్ ఈ ఎన్నికల్లో బంటి మీద ఆనంద్ గెలిచాడు అని చెప్తుంది. మనోహరి షాక్ అవుతుంది.
భాగీ: విన్నావు కదా అదీ విషయం. చెడు మీద ఎప్పుడూ మంచి విజయం సాధిస్తుంది. చెడ్డవారు తాత్కాలికంగా గెలుస్తారు. బంటి లాగా నీలాగా..? కానీ చివరికి గెలిచేది మంచే.. ఆనంద్ లాగా నాలాగా..? ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు సరస్వతి వార్డెన్‌ను కలుస్తాను.. ఈరోజు కాకపోయినా ఆ రోజు నీకు కచ్చితంగా ఎండ్ కార్డు పడుతుంది మను.
అంటూ భాగీ వార్నింగ్ ఇవ్వగానే.. మను కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత భాగీ పిల్లల దగ్గరకు వెళ్లి ఆనంద్‌కు కంగ్రాట్స్ చెప్తుంది. అందరూ కలిసి సెల్ఫీ ఫోటోలు దిగుతారు. తర్వాత ఇంటికి వెళ్లాక భాగీ, అమర్‌తో తనను కలవడానికి స్కూల్‌కు వార్డెన్ వచ్చిందని చెప్తుంది.
అమర్: ఏంటి భాగీ నువ్వు చెప్పేది..
భాగీ: అవునండి నన్ను కలవడానికి సరస్వతి వార్డెన్ గారు స్కూల్‌కు వచ్చారంట
మరోవైపు
చిత్ర: అసలు వార్డెన్ స్కూల్‌కు ఎందుకు వచ్చింది
మను: ఇంకెందు వచ్చి ఉంటుంది భాగీతో నా గురించి చెప్పడానికే అయ్యుంటుంది.
ఇంకోవైపు
భాగీ: నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంజుతో చెప్పిందట
అమర్: సరస్వతి వార్డెన్ నీతో ఏమి చెప్పాలనుకుంటారు..
భాగీ: నాకు తెలిసి ఆరు అక్క గురించే అయ్యు ఉంటుందండి..
అని భాగీ చెప్పగానే అయితే వెంటనే వార్డెన్ ను వెతుకుదాం పద అని అమర్, రాథోడ్, భాగీ వెళ్తారు. వాళ్లు బయటకు వెళ్లగానే.. రణవీర్, మను, లాయరుతో కలిసి చంభా వస్తుంది. గార్డెన్‌లో ఆరును బంధిస్తుంది. ఆరు ఆత్మను చూసిన రణవీర్, మనోహరి షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















