Nindu Noorella Saavasam August 15th Episode‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు పూజ చేయడం చూసిన అంజు – ఇరకాటంలో పడిపోయిన గుప్త
Nindu Noorella Saavasam Today Episode: ఇంట్లోకి వచ్చి ఆరు అమ్మవారికి పూజ చేస్తూ పూలు చల్లడం అంజు చూడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: అక్క మా ఇంట్లో పూజకు నువ్వు రావా? అంటూ ఆరు చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తుంది మిస్సమ్మ. దీంతో ఆరు షాక్ అవుతుంది. మొదటిసారి తనను పట్టుకున్న మిస్సమ్మను చూసి ఆశ్యర్యంగా తన వెనకాల నడుస్తుంది. మెయిన్ డోర్ దగ్గరకు వెళ్లగానే మిస్సమ్మ అక్కా ఇంకో ఇద్దరికి బొట్టు పెట్టి పిలుచుకొస్తాను నువ్వు లోపలికి వెళ్లు అంటూ మిస్సమ్మ బయటకు వెళ్తుంది. దీంతో షాకింగ్ గా గుప్త దగ్గరకు వస్తుంది ఆరు.
ఆరు: అసలు మిస్సమ్మను నన్ను ముట్టుకోవడం ఏంటి గుప్త గారు. నాకు చాలా కన్పీజ్‌గా ఉంది ప్లీజ్ చెప్పండి. ఎందుకు అలా జరిగింది చెప్పండి.
గుప్త: నువ్వు ఎల్లప్పుడు నిష్టగా అమ్మవారిని కొలిచెదవు కదా.. అందుకే ఆ అమ్మవారే ఈ సంవత్సరం నువ్వు పూజ చేసుకొనుటకు ఈ వరము ప్రసాదించింది. నువ్వు ఆమెను కొలుచుటకు మానవుల వలే నీకు శక్తిని ప్రసాదించింది.
ఆరు: అంటే నేను నా పిల్లలను ముట్టుకోవచ్చా?
గుప్త: అన్ని సాధ్యపడవు బాలిక. నీవు చేయగలిగింది ఆ అమ్మవారిని పూజించడమే..
అని గుప్త చెప్పగానే ఆరు సంతోషంగా లోపలికి వెళ్తుంది. మరోవైపు శివరాం.. ఎవ్వరూ చూడకుండా స్వీట్స్ తినబోతుంటే నిర్మల వస్తుంది. ఆరు ఫోటో తీసుకుని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఎమోషన్‌గా ఫీలవుతుంది. మరోవైపు ఆరు కూడా ఇంట్లోకి వస్తూ గడపను తాకుతుంది. ఎన్నో హ్యాపీగా ఫీలవుతుంది. లోపల శివరాం కూడా ఆ అమ్మవారే మన అరుంధతిని ఇవాళ్టీ పూజకు ఇంట్లోకి తీసుకొస్తుందని చెప్తుంటాడు. అరుంధతి లోపలికి వస్తుంది. పూజకు అన్ని రెడీ చేస్తున్న పిల్లలను చూసి సంతోషిస్తుంది. అమ్మవారి ముందు కూర్చుని ఆరు ఎమోషనల్‌గా ఫీలవుతుంది.
ఆరు: అమ్మా ఇన్ని రోజులు నేను చేసిన పూజలకు నాకోసం నువ్వు కదిలి వచ్చావా అమ్మా? ఈ ప్రాణం లేని గాలితో పూజ చేయించుకోవడానికి నాకు ఈ వరాన్ని ప్రసాదించావా తల్లి. అమ్మా అని పిలిచినందుకు నాకు ఇంత అదృష్టాన్ని ఇస్తావనుకోలేదు తల్లి. నేను ఎంత అదృష్టవంతురాలినో నాకు ఈరోజు తెలిసింది. చాలు తల్లి చాలు నాకీ భాగ్యాన్ని ప్రసాదించావు.
అంటూ ఆరు అమ్మవారికి కుంకుమాభిషేకం చేస్తుంది. తర్వాత అక్షితలు అమ్మవారికి వేస్తుంటే అంజు చూస్తుంది. అక్షితలు అమ్మవారిపై పడటం చూసి షాక్ అవుతుంది. అమ్ముకు చెబితే ఎవరూ లేరని తిడుతుంది. తర్వాత పూలు పడటం కూడా అంజు చూసి.. అందరినీ తీసుకుని అమ్మవారి దగ్గరకు వస్తుంది. ఇంతలో శివరాం, నిర్మల వస్తారు.
శివరాం: ఏంటి సోల్జర్స్ ఇక్కడ మీటింగ్ పెట్టారు.
అంజు: చూడండి తాతయ్య ఇందాక పూలు గాలిలో లేచి అమ్మవారి మీద పడ్డాయి. వీళ్లకు చెప్తుంటే నమ్మటం లేదు.
నిర్మల: ఒక్క నిమిషం ఆగండి. ఆ పూలు ఎలా పడ్డాయో నాకు తెలుసు ఇందాక మీ తాతయ్య అమ్మవారే పూజకు అరుంధతిని తీసుకుని వస్తారు అంటే నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు అంజలి చెప్పేది చూస్తుంటే..
అంజు: అంటే అమ్మ వచ్చిందా? నాన్నమ్మా?
శివరాం: చెప్పానా నిర్మల అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి అరుంధతే గాలి రూపంలో వచ్చి ఉంటుంది.
నిర్మల: అవునండి.. అంతా అమ్మవారి దయ.
అంజు: ఆ ఫోటో ఏంటి నాన్నమ్మ.
నిర్మల: మీ అమ్మది తల్లి..
అని చెప్పగానే ఆరు షాక్ అవుతుంది. ఇప్పుడు మిస్సమ్మ ఈ ఫోటో చూస్తే నేను ఆత్మను అన్న విషయం తెలిసిపోతుందని భయపడుతుంది. మిస్సమ్మ వచ్చే లోపు ఈ ఫోటో ఇక్కడ పెట్టకుండా చూసుకోవాలి అనుకుంటుంది. బయట ఉన్న గుప్త దగ్గరకు వెళ్లి తన ఫోటో నిర్మల హాల్‌లో పెట్టిందని మీరు వెళ్లి ఎలాగైనా తీసేలా చేయాలని చెప్తుంది. ఇంతలో మిస్సమ్మ ఇంట్లోకి వస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ప్రభాస్‌తో మృణాల్ రొమాన్స్ - అలా షాకిచ్చేవేంటి సీత!