Nindu Noorella Saavasam Serial Today April 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: గేమ్ స్టార్ట్ చేసిన మనోహరి – పిల్లలతో గెలవమన్న అనామిక
Nindu Noorella Saavasam Today Episode: కొడైకెనాల్ వెళ్లిన మనోహరి తన ప్లాన్ ప్రకారం గాలిపటం ఎగురవేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: కొడైకెనాల్‌లో ఇంటికి వెళ్లాక పిల్లలు, అమర్ ఆ ఇంటిని చూడగానే ఆరును గుర్తు చేసుకుంటారు. ఎమోషనల్ అవుతారు. పిల్లలను భాగీ ఓదారుస్తుంది. తర్వాత ఇంట్లోకి వెళ్లాక బెడ్‌రూంలోకి వెళ్లిన అమర్.. ఆరును గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో భాగీ వస్తుంది.
భాగీ: నాకు తెలుసండి అక్క లేని ఇంటికి రావడం ఎంత కష్టంగా ఉంటుందో.. రూమ్ చాలా బాగుందండి. కానీ చలే కొంచెం ఎక్కువగా ఉందండి. పిల్లలు చెప్తే ఏంటో అనుకున్నాను కానీ ఇంత చల్లగా ఉంటుందనుకోలేదు. ఇక్కడి నుంచి చూస్తే వ్యూ బాగుంటుందా అండి.
వెళ్లి కిటికీ తెరుస్తుంది. కిటికీలోంచి వస్తున్న చలికి తట్టుకోలేక వణుకుతుంది.
భాగీ: ఏవండి ఇంత చలి వేస్తుందేంటండి
అమర్: అలా చలి అని వణికే బదులు విండో క్లోజ్ చేసుకోవచ్చు కదా.?
భాగీ: ప్రయత్నిస్తున్నానండి అవ్వడం లేదు
అమర్ వెళ్లి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంటే అమర్‌ను హగ్ చేసుకుంటుంది భాగీ.
భాగీ: సారీ అండి చలి బాగా వేయడం వల్ల అనుకోకుండా.. ఏవండి చలి వేస్తుందండి.. చలి బాగా వేస్తుందండి.
అమర్: ఏయ్ లూజ్
అంటూ తిట్టి వెళ్లిపోతాడు. చూస్తుంటే.. కొడైకెనాల్ చలి నాకు చాలా ఉపయోగపడేటట్టు ఉంది అని మనసులో అనుకుంటుంది. లగేజీ తీసుకుని ఇంట్లోకి వచ్చిన గుప్తను అనామిక గుర్తు పట్టి పిలుస్తుంది. బయటకు తీసుకుని వెళ్తుంది.
అనామిక: గుప్త గారు మీరేం చేస్తున్నారు ఇక్కడ
గుప్త: తెలుగు రాదు తమిళ్
అనామిక: గుప్త గారు ఇది మీరే అని నాకు తెలుసు. యాక్టింగ్ ఆపి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి
గుప్త: నాకు అర్థం కావడం లేదు
అనామిక: అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏదీ మీకు అర్థం కాదన్నమాట. అయితే మీరు మా గుప్త గారు కాదన్నమాట
గుప్త: ఇల్లే…
అనామిక: అయితే నేను ఇప్పుడు నేరుగా మా ఆయన దగ్గరకు వెళ్లి నా చావుకు కారణం, భాగీకి ఉన్న ప్రాణగండం మనోహరి అని చెప్పేస్తాను. మీరు వెళ్లి మనసు లాయే అని మీ భాషలో మాట్లాడుకోండి. మీకు తెలుగు తెలియదు కదా..?
గుప్త: బాలిక ఆగుము..
అనామిక: మీకు తెలుగు కొంచెం మాత్రమే వచ్చు అని చెప్పారు
గుప్త: నేను మీ చిత్రవిచిత్రగుప్తుల వారమే ఈ వేషమున వచ్చితిమి
అనామిక: అలా రండి దారికి నాతోనే ఆటలా..? చెప్పండి ఇక్కడకు ఎందుకు వచ్చారు.
గుప్త: నీవు ఇప్పుడు చెప్పిన వలే చేసేదవేమో అని భయంతో వచ్చితిని
అనామిక: మా ఆయనకు నిజం చెప్పేదాన్నే అయితే కొడైకెనాల్ దాకా ఎందుకు ఆగుతాను. హైదరాబాద్‌లోనే చెప్పేదాన్ని కదా.?
గుప్త: ఇచ్చట జరుగు సన్నివేషములు చూసి నువ్వు భావోద్వేగమునకు లోనై నిజం చెప్పెదవేమో అన్నది నా భయం.
అనామిక: మీరు భయపడేంతగా ఇక్కడ ఏం జరుగుతుంది. నేను ఏదైనా అడిగితే అది ప్రకృతికి విరుద్దం. విధికి ఎవ్వరూ ఎదురు వెళ్లకూడదు. వెళ్తే నా కుటుంబానికి ప్రమాదం అంతే కదా
గుప్త: అవును బాలిక
అనామిక: అయినా మా ఆయనే నిజం తెలుసుకోబోతుంటే.. ఇంకా నేనెందుకు చెప్పాలనుకుంటాను గుప్త గారు. మను మొదలు పెట్టిన ఈ రక్తపాతాన్ని మా ఆయన అంతం చేస్తాడు.
గుప్త: అది జరగవలసిన సమయంలో జరుగును. నువ్వు వెళ్లి వారు చేయబోయే కార్యమునకు అంతరాయం కలిగించకు.
అని గుప్త చెప్పడంతో అనామిక సరే అంటుంది. తర్వాత పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తుంటే.. మనోహరి తన ప్లాన్ ప్రకారం గాలిపటం ఎగురవేస్తూ వస్తుంది.
భాగీ: ఇంకో గాలి పటం ఎవరిది
మనోహరి: నాదే ఆ గాలిపటం. ఏం అనామిక ఆడతావా?
అనామిక: నీ మీద గెలవడానికి నేనెందుకు ఆడటం మనోహరి గారు. పిల్లలతో ఆడించి గెలపిస్తా..?
అని చెప్పగానే పిల్లలతోనా నేనా ఆడేది అంటూ మనోహరి హేళనగా చెప్పగానే.. మాతో ఆడితే ఓడిపోతానని భయంగా ఉందా మనోహరి ఆంటీ అని అంజు అంటుంది. దీంతో మనోహరి పిల్లలో ఆడటానికి రెడీ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు






















