Nindu Noorella Saavasam Serial Today April 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరి రూంలోకి వెళ్లిన అమృత – యాక్టింగ్ చేసిన మనోహరి
Nindu Noorella Saavasam serial Today Episode April 1st: మనోహరి మీద డౌటు వచ్చి తన రూంలోకి వెళ్తుంది అమృత. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంటికి వచ్చిన భాగీ అమర్‌ను మెచ్చుకుంటుంది. అమర్ చాలా గ్రేట్ రణవీర్ చేత నిజం చెపించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు అంటుంది. నిజంగా ఆయన తెలివి సూపర్ రాథోడ్ అంటుంది.
రాథోడ్: మరి సార్ అంటే ఏమనుకుంటున్నావు మిస్సమ్మ. మా సారు స్కెచ్ వేశారంటే ఎలాంటి వారైనా పడిపోవాల్సిందే..
భాగీ: అవును తీవ్రవాదుల మెడలు వంచిన ఆయనకు ఈ రణవీర్ ఒక్క లెక్కా
రాథోడ్: వాడికి ఎక్కడో సుడి ఉంది మిస్సమ్మ ప్రతిసారి తృటిలో తప్పించుకుంటున్నాడు. ఈ సారి మైకంలో మనోహరి గురించి చెప్పేస్తాడు అనుకున్నాను చెప్పి ఉంటే ఈ పాటికి సార్ చేతిలో ఆ మనోహరికి చెప్పు దెబ్బలు పడి ఉండేవి..
భాగీ: ఎంత చెడ్డవాళ్లైనా ఒక టైం వస్తుంది రాథోడ్.. శిశుపాలుడిని వంద తప్పులు చేసేదాకా క్షమించిన శ్రీకృష్ణుడు వందో తప్పు చేయగానే శిక్షించాడు. అలాగే మనోహరి, రణవీర్ ల పాపాలు పండి వాళ్లకు శిక్ష పడే టైం కూడా వస్తుంది.
రాథోడ్: అవును మిస్సమ్మ (యాదమ్మ రూంలోంచి పైకి వెళ్తుంది.) యాదమ్మ ఇలా రా… మీ మేడం ఎక్కడ యాదమ్మ
యాదమ్మ: మా మేడం ఎవరు..?
భాగీ: ఏం తెలియనట్టు నటించకు.. మనోహరి ఎక్కడ..?
యాదమ్మ: నాకు తెలియదు అండి
రాథోడ్: అదేంటి ఇద్దరు ఎప్పుడూ పక్కపక్కనే రాసుకుని పూసుకుని తిరుగుతుంటారు కదా..?
యాదమ్మ: నేను ఈ ఇంటికి కేర్ టేకర్‌ను మనోహరి గారికి కాదు
రాథోడ్: అయితే మనోహరి ఎక్కడికి వెల్లిందో నీకు తెలియదు అంటావు అంతేనా..?
లాల్‌సింగ్ భార్య అమృత వస్తుంది.
అమృత: మనోహరి బయటకు వెళ్లింది కదా..?
మిస్సమ్మ, రాథోడ్, యాదమ్మ షాక్
అమర్, లాల్‌సింగ్ ఇంట్లోకి వస్తుంటారు..
రాథోడ్: ఎప్పుడు వెళ్లింది మేడం
అమృత: ఇందాక పార్టీ జరుగుతున్నప్పుడు రణవీర్‌కు మందు ఎక్కువైతే మా ఆయన అమర్ అన్నయ్య కలిసి రణవీర్‌ను తీసుకెళ్లి పోయారు కదా అప్పుడే మనోహరి గారు కూడా బయటకు వెళ్లిపోయారు
అమర్, లాల్‌సింగ్ షాక్
అమర్: ఏంటి యాదమ్మ మనోహరి బయటకు వెళ్లిందా..?
యాదమ్మ: సార్ అది మేడం నాతో తలనొప్పి అని చెప్పి పడుకుంటానని చెప్పి వెళ్లింది..
లాల్‌సింగ్: అంటే ఆవిడ రూంలోనే పడుకుని ఉందా.? ఏం అమృత నువ్వు ఆవిడ బయటకు వెళ్లింది అని చెప్తున్నావు..
అమృత: మనోహరి బయటకు వెళ్లడం నేను చూశాను లాల్
అమర్: యాదమ్మ నిజం చెప్పు మనోహరి బయటకు వెళ్లిందా..? ఇంట్లోనే ఉందా..?
యాదమ్మ: నేను నిజమే చెప్తున్నాను సార్
భాగీ: తను ఇంట్లో ఉందో లేదో గదిలోకి వెళ్లి చూస్తే తెలిసిపోతుంది కదా…
యాదమ్మ: నేను వెళ్లి చూస్తాను మేడం
లాల్‌సింగ్: నువ్వు ఆగు .. అమృత నువ్వు వెళ్లి చూడు
అంటూ సింగ్ చెప్పగానే.. అమృత పైకి వెళ్లి చూస్తుంది. పైన రూంలో మనోహరి నిద్ర పోతుంటుంది. అమృత కన్ఫీజ్‌గా కిందకు వెళ్లిపోతుంది. అమృత వెళ్లగానే మనోహరి కోపంగా కళ్లు తెరచి చూస్తుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు






















