అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆకాష్‌ను కాపాడమన్న భాగీ – అయోమయంలో మనోహరి     

Nindu Noorella Saavasam serial Today Episode April 16th: అమర్‌ పోలీసులకు ఫోన్‌ చేయడంతో మనోహరి అయోమయంలో పడిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Nindu Noorella Saavasam Serial Today Episode: ఐసీయూలోంచి ఆకాష్‌ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన రణవీర్‌ను భాగీ ప్రతిఘటిస్తుంది. దీంతో భాగీని స్పృహ కోల్పోయేలా కొడతాడు రణవీర్‌. ఇంతలో ఐసీయూలోకి డ్యూటీ డాక్టర్‌ వస్తాడు.

డాక్టర్: ఏయ్‌ ఎవరు నువ్వు ఎవరు..? నా పేషెంట్‌ ను ఎత్తుకెళ్తున్నావు ఎవరు నువ్వు

రణవీర్‌:  మర్యాదగా అడ్డు తప్పుకో డాక్టర్‌ ఈ పిల్లవాడితో నాకు పనుంది

డాక్టర్‌:  ఆ బాబుకు చాలా సీరియస్ గా ఉందిరా..? ఆక్సిజన్‌ లేకపోతే చనిపోతాడు

రణవీర్‌: అందుకే ఆక్సిజన్‌తో సహా తీసుకెళ్తున్నాను.. మర్యాదగా అడ్డు తప్పుకో

డాక్టర్‌:  అంటే కిడ్నాప్‌ చేస్తున్నావా..? సెక్యూరిటీ.. సెక్యూరిటీ..

రణవీర్‌:  ఏయ్‌ ఎందుకు అరుస్తున్నావు

అప్పుడే సెక్యూరిటీ లోపలికి వస్తారు.

డాక్టర్‌:  సెక్యూరిటీ వీడెవడో లోపలికి వచ్చి బాబును కిడ్నాప్‌ చేస్తున్నాడు పట్టుకోండి

సెక్యూరిటీ ఇద్దరూ రణవీర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రణవీర్‌ కత్తి తీసుకుని ఆకాష్‌ గొంతు మీద పెడతాడు.

రణవీర్‌: ఎవరైనా ముందుకు వస్తే వీడి గొంతు కోస్తాను.. కోయమంటారా..? చెప్పండి

డాక్టర్‌: ఆ  బాబును ఏమీ చేయోద్దు..

రణవీర్‌: అయితే మర్యాదగా అడ్డు తప్పుకోండి

ఆకాష్‌ను తీసుకుని వెళ్లిపోతాడు. ఆకాష్‌తో రణవీర్‌ రావడ.. రణవీర్‌ వెనకాలే హాస్పిటల్‌ స్టాప్‌ మొత్తం రావడం మనోహరి గనమనించి కారు చాటుకు వెళ్తుంది.

మనోహరి: హమ్మయ్య వచ్చేశాడా..? అయ్యో ఏంటి వీడు ఆకాష్‌ ఒక్కడినే తీసుకురమ్మంటే హాస్పిటల్‌ మొత్తాన్ని తీసుకొచ్చాడు

రణవీర్‌ అందరినీ బెదరిస్తూ ఆకాష్‌ను కారులో పడుకోబెట్టుకుని తీసుకెళ్లిపోతాడు.

మనోహరి:  అబ్బా అందరికీ సినిమా చూపించి వెళ్తున్నాడు ఇప్పుడు అమరేంద్ర వస్తే ఏం జరుగుతుందో ఏంటో..?

మెడిసిన్‌ తీసుకుని హాస్పిటల్‌కు వస్తున్న అమర్‌కు డాక్టర్లు ఫోన్‌ చేసి విషయం చెప్తారు. అమర్‌ కంగారుగా వస్తుంటాడు. హాస్పిటల్‌ లో స్పృహ కోల్పోయిన భాగీకి ట్రీట్‌మెంట్‌ చేస్తుంటారు. బయట మనోహరి భయపడుతూ ఉంటుంది.

మనోహరి: చెత్త వెధవ సైలెంట్‌గా కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లరా అంటే అంతా పెంట పెంట చేశాడు.. భాగీ, రణవీర్‌ను చూసిందేమో.. గుర్తు పట్టిందేమో..? ఇప్పుడు అమర్‌ వస్తే  ఏం చేయాలి ఏం చెప్పాలి  అయ్యో

అప్పుడే అమర్‌ వస్తాడు.

అమర్‌: మనోహరి ఏం జరిగింది..?

మనోహరి: అమర్‌ త్వరగా రా అమర్‌ నాకు ఫోన్‌ వస్తే మాట్లాడదామని పక్కకు వెళ్లాను. ఈలోగా ఎవరో వచ్చి భాగీని కొట్టి ఆకాష్‌ను ఎత్తుకెళ్లిపోయారు

అమర్‌: వాట్‌ ఆకాష్‌ను ఎత్తుకెళ్లిపోయారా..? భాగీ ఎక్కడ

మనోహరి: ఆ రూంలో ఉంది

అమర్‌ లోపలికి వెళ్లి భాగీని పిలుస్తుంటాడు.

డాక్టర్‌: సారీ సార్‌ బాబును కాపాడలేకపోయాం.. మేడం గారు స్పృహలో లేరు

అమర్‌: భాగీ నన్ను చూడు.. కళ్లు తెరువు..

భాగీ ఆకాష్‌ ఆకాష్‌ అంటూ అరుస్తూ లేస్తుంది..

భాగీ: ఏవండి వచ్చారా..? ఎవరో వచ్చి  ఆకాష్‌ను ఎత్తుకెళ్లిపోయారు.. ఆకాష్‌ను కాపాడండి..

అమర్‌: భాగీ ఆకాష్‌కు ఏమీ కాదు.. నేను చూసుకుంటాను.. డాక్టర్‌ అసలు ఏం జరిగింది

డాక్టర్‌: పది నిమిషాల క్రితం ఎవరో ఒకతను వచ్చి మేడం స్పృహ తప్పేలా కొట్టి.. మమ్మల్ని అందరినీ కత్తితో బెదరించి వ్యానులో తీసుకెళ్లిపోయాడు సార్‌..

అమర్‌: అతను ఎవరో తెలుసా..? చూస్తే గుర్తు పడతారా..?

డాక్టర్‌: లేదు అమర్‌ ఫేస్‌కు ఒక మాస్క్‌ పెట్టుకున్నాడు..

అంటూ డాక్టర్‌ చెప్పగానే.. అమర్‌ తనకు తెలిసిన పోలీస్‌కు ఫోన్‌ చేసి హాస్పిటల్‌ లో జరిగింది మొత్తం చెప్పి.. వాడు ఎంత స్పీడుగా వెళ్లినా ఐదు కిలోమీటర్ల దూరం  కన్నా ఎక్కువ వెళ్లి ఉండడు.. మీరు ఆరు కిలోమీటర్ల పరిధిలో వచ్చే ప్రతి వాహనాన్ని చెక్‌ చేయండి.. హాస్పిటల్‌ అన్ని వైపులా ఉన్న రోడ్లలో చెకింగ్‌ చేయండి అని చెప్పగానే.. మనోహరి షాక్‌ అవుతుంది. రణవీర్‌ పోలీసులకు దొరికిపోతాడేమోనని భయపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
Podarillu Serial Today August 14th: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
పొదరిల్లు: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget