Nindu Noorella Savasam October 16: మనోహరి మాయలో అమర్ కుటుంబం.. మిస్సమ్మను వెతుక్కుంటూ వచ్చిన సవితితల్లి!
మనోహరిని అమర్ తన ఇంట్లోనే ఉండిపోమనటంతో కథలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
Nindu Noorella Savasam, October 16, ఈరోజు ఎపిసోడ్లో హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువచ్చిన మనోహరిని మంచం మీద కూర్చోబెడతారు.
అమర్ తల్లి: నీకు ఏం కష్టం వచ్చిందని ఇలాంటి పని చేసావు.
మనోహరి: సారీ మీ అందర్నీ ఇబ్బంది పెట్టాను.
అమర్: నీ మీద ఇన్నాళ్లు గౌరవం ఉండేది. నువ్వు చేసిన ఈ ఒక్క పనితో నీ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది.
అమర్ తండ్రి : చనిపోయే అంత పెద్ద కష్టం నీకు ఏం వచ్చింది?
మనోహరి : ఏమి లేదు.
అమర్ తల్లి : చెప్పుకునే వాళ్ళు ఎవరూ లేక నువ్వు ఈ పని చేశావని అర్థం అవుతుంది చెప్పు తల్లి నీకు వచ్చిన కష్టం.
మనోహర్ : నిన్న రాత్రి అమర్ నా దగ్గరికి వచ్చి రేపు పొద్దున్నే వెళ్లిపొమ్మన్నాడు. అప్పుడు రాత్రంతా ఆలోచించాను. నేను ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. నాకు మీరు తప్ప ఎవరున్నారు. అందుకే నేను నా అరుంధతి దగ్గరకి వెళ్ళిపోదాం అనుకున్నాను.
అమర్: నీ భవిష్యత్తు ఈ ఇంటితో, ఈ పిల్లలతోని ఆగిపోకూడదని అలా అన్నాను. అంతేగాని వేరే ఉద్దేశం లేదు. నీకు మేమందరమే ఉన్నాము నీకు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఇక్కడే ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అమర్ తండ్రి : నువ్వు చేసే చిన్న చిన్న పనులు నచ్చక కోపంగా మాట్లాడతాం కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. ఇకపై ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి వాళ్లు కూడా వెళ్ళిపోతారు.
ఇదంతా పక్క నుంచి చూస్తున్న అరుంధతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మిస్సమ్మ కూడా మనోహరిని కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది.
మనోహరి: అదేంటే అలా చూస్తుంది.
నీల: పొద్దుట్నుంచి అలాగే చూస్తుందమ్మా ఏదో అనుమానం వచ్చినట్లుగా ఉంది.
మనోహరి: పోనీలే మన వైపు తిరగవలసిన వాళ్లు మన వైపు తిరిగారు అంతే చాలు.
ఇంతలో పిల్లలు బాధపడుతూ అక్కడికి వస్తారు. మేమంటే ఇష్టం లేక ఎర్లీ మార్నింగ్ లేపుతున్నారు అనుకున్నాము. నచ్చిన ఫుడ్ పెట్టకపోతే మేము ఇష్టం లేదేమో అనుకున్నాము. అంతేగాని మమ్మల్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేక ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్న మీ గురించి ఇప్పుడే అర్థమైంది. మీకు మేమన్నా.. మా మమ్మీ అన్నా చాలా ఇష్టమని అంటారు.
మనోహరి : ప్రేమని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూపిస్తారు. మీ డాడీ మీ మీద కోపంగా ఉన్నారని ఆయనకి మీరంటే ఇష్టం లేదని కాదు కదా, అలాగే నేను కూడా అయినా మీరు కసురుకున్నంత మాత్రాన మీరు నా పిల్లలు కాకుండా పోతారా, అయినా ఇక నేను ఎక్కడికి వెళ్ళను.. అమర్ నన్ను ఇక్కడే ఉండిపోమన్నాడు అంటుంది.
అంజు: మీరు ఇక్కడే ఉండిపోతారు కదా మరి ఆ కేర్ టేకర్ ఎందుకు తనని పంపించేద్దాం.
మనోహరి: నువ్వు చెప్పావు కదా అలాగే చేద్దాం.
ఈ మాటలు అన్ని వింటున్న అరుంధతి కంగారు పడిపోతూ ఉంటుంది ఆ మిస్సమ్మ ఇక్కడ ఉంటేనే మీరు సేఫ్ గా ఉంటారు అంటుంది.
నీల : మనోహరి కాళ్ళ మీద పడిపోతూ ఒక దెబ్బతో మొత్తం అందర్నీ మీ వైపు తిప్పుకున్నారు మీ దగ్గర శిష్యరికం చేస్తే నేను ఎక్కడైనా బ్రతికేయగలను అంటూ జీడిపప్పు ఉప్మా చేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇదంతా చూస్తున్నా అరుంధతి బాధపడుతుంది. నీ నుంచి ఈ కుటుంబాన్ని, పిల్లల్ని ఎలా అయినా కాపాడుకుంటాను అనుకుంటుంది. మరోవైపు భాగమతి కోసం వెతుకుతూ ఉంటారు భాగమతి పిన్ని, ఆమె తమ్ముడు. భాగమతి ఉండే హాస్టల్ దగ్గరికి వెళ్లి కనుక్కుంటే ఆమెకి జాబ్ వచ్చిందని చెప్పి హాస్టల్ ఖాళీ చేసేసింది అని వార్డెన్ చెప్పటంతో అక్కడినుంచి బయటికి వచ్చేస్తారు అక్క తమ్ముళ్లు.
అక్క: ఇది మనకి ఉద్యోగం వచ్చినట్లు గాని, హాస్టల్ నుంచి వెళ్ళిపోతున్నట్లుగానే చెప్పలేదు కొంపతీసి తండ్రి మీద ప్రేమ గాని తగ్గలేదు కదా దానికి ఒకసారి ఫోన్ చెయ్ అని తమ్ముడికి చెప్తుంది.
తమ్ముడు భాగమతికి ఫోన్ చేస్తాడు కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు.
అక్క: సరే ముందు మనం ఊరికి పోదాము అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు.
నడుస్తున్న తమ్ముడికి అమర్ ఇంటి డాబా మీద నిల్చోని ఆలోచిస్తున్న భాగమతి కనిపిస్తుంది. ఇదేంటి భాగి ఇక్కడ ఉంది.. నేను చూస్తున్నది నిజమేనా అనుకుంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.