అన్వేషించండి

Nindu Noorella Savasam October 10: చిక్కుల్లో చిత్రగుప్తుడు.. అమరేంద్రతో పోట్లాడుతున్న మిస్సమ్మ!

ఇంటి నుంచి బయటికి వెళ్లి పోవటానికి బయలుదేరిన మిస్సమ్మని అరుంధతి రెచ్చగొట్టి లోపలికి పంపడంతో కధ ఇంట్రెస్టింగ్​గా మారింది. ఇక ఈరోజు ఎపిసోడ్​లో ఏం జరిగిందో చూద్దాం.

Nindu Noorella Savasam October 10: ఈరోజు ఎపిసోడ్​లో అరుంధతి మిస్సమ్మతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో రాథోడ్ రావటం చూసి మాట్లాడటం ఆపేస్తుంది. రాథోడ్​ని గమనించని మిస్సమ్మ అరుంధతికి వెళ్లి వస్తానని చెప్తుంది.

రాథోడ్: ఒకసారి చెప్పింది కదా మళ్లీ మళ్లీ ఎందుకు చెప్తుంది, రిపీట్ కంటెంట్ అయినా ఫీల్​తో చెప్పింది. మళ్లీ విందాం అనుకుంటాడు.

తను ఆత్మ అని తెలిసిపోతుందేమో అని కంగారు పడుతుంది అరుంధతి. ఎందుకు ఇంట్లోంచి వెళ్లిపోతున్నావు అని మిస్సమ్మని అడుగుతుంది.

మిస్సమ్మ : ఇంట్లో అందరికీ నచ్చాను కానీ సార్​కి నచ్చలేదు, నాకు ఇక్కడ జాబ్ చేయాలని రాసిపెట్టి లేదు. నా తలరాత ఇలా ఉంటే మీరేం చేస్తారు. ఫీల్ అవ్వద్దు అంటుంది.

రాథోడ్: ఈ మాటలు తననే అంటుంది అనుకొని ఈ అమ్మాయి వెనకన ఉన్న నేను ఫీల్ అవుతున్నాను అని తనకు ఎలా తెలుసు అనుకుంటాడు.

మిస్సమ్మ : మీకు ఏ సంబంధం లేకపోయినా నాకు చేయాల్సిన సాయం చేశారు. మీకు థాంక్స్ అని అరుంధతికి చెప్తుంది. మీకు పిల్లల గురించి బాగా తెలుసేమో వాళ్లని బాగా చూసుకోండి అంటుంది.

రాథోడ్: మిస్సమ్మ తనతోనే మాట్లాడుతుంది అనుకొని వాళ్లు నిన్ను పొమ్మన్నా కూడా నువ్వు వాళ్ల మంచే కోరుకుంటున్నావు నీకు అంతా మంచే జరగాలి అంటూ ఎమోషనల్ అయిపోతాడు.

అరుంధతి: ఈ అమ్మాయిని ఇక్కడినుంచి వెళ్లకుండా చేయాలంటే తనతో నేను మాట్లాడాలి. దేవుడా ఈ రాథోడ్​ని ఇక్కడినుంచి ఎలాగైనా పంపించు అని దేవున్ని వేడుకుంటుంది.

ఇంతలో నువ్వు ఎవరు అంటూ గట్టిగా మాట్లాడుతాడు రాథోడ్. గేట్ తీసుకొని లోపలికి ఎందుకు వచ్చావు అంటాడు.

ఒకసారిగా గేట్ వైపు చూస్తారు మిస్సమ్మ, అరుంధతి. చిత్రగుప్తుడు గారు రాథోడ్​కి కనిపిస్తున్నట్లు ఉన్నారు అని కంగారు పడిపోతుంది అరుంధతి.

అరుంధతి: మిస్సమ్మతో అక్కడ నీకు ఎవరైనా కనిపిస్తున్నారా..

మిస్సమ్మ: చిత్రగుప్తుడు వేషం వేసుకొని ఒకాయన ఉన్నారు కదా, మీకు కనిపించడం లేదా..

అరుంధతి: నాకు కనిపిస్తున్నారు కానీ నీకు కనిపిస్తున్నారో లేదో అని అడిగాను.

మిస్సమ్మ : అదేంటి మీకు కనిపించిన వాళ్లు నాకు ఎందుకు కనిపించకుండా పోతారు.

అప్పుడు అరుంధతికి చిత్రగుప్తుని దగ్గర ఉంగరం తీసుకున్న విషయం గుర్తొస్తుంది. అందుకే ఆయన అందరికీ కనిపిస్తున్నారు అని గ్రహిస్తుంది.

రాథోడ్ : చిత్రగుప్తుడు దగ్గరికి వెళ్లి నీతోనే మాట్లాడుతున్నాను, సమాధానం చెప్పకుండా పైకి చూస్తున్నావ్ ఏంటి?

చిత్రగుప్తుడు : ఆకాశం వైపు చూస్తే ఆలోచనలు వస్తాయి, అయినా నేను ఆకాశం వైపు చూస్తే నీకేం సమస్య అంటూ రాథోడ్​ని చూసి పెద్దగా కేక వేస్తాడు చిత్రగుప్తుడు. అయోమయంగా నువ్వు ఎప్పుడు మరణించావు అని అడుగుతాడు.

రాథోడ్: గుండ్రాయిలాగా ఉన్న నన్ను పట్టుకొని చచ్చిపోయాను అంటావా అంటూ అతని మీదకి కాలు దువ్వుతాడు రాథోడ్.

చిత్రగుప్తుడు : నువ్వు మరణించలేదా, అయితే మరి నీకు ఎలా కనిపిస్తున్నాను అని ఆశ్చర్యంగా అడుగుతాడు.

రాథోడ్: అవును మరి నువ్వు పెద్ద దేవుడివి చనిపోతేగాని కనిపించకపోవటానికి. వేషం వేసుకొని వచ్చినంత మాత్రాన దేవుడివైపోతావా.. చిత్రగుప్తుడి వేషం వేసుకొచ్చినంత మాత్రాన నమ్మేయటానికి నేనేమైనా వెర్రివాడిని అనుకుంటున్నావా..

చిత్రగుప్తుడు : ఇది వేషం కాదురా అర్బకా..

రాథోడ్: అలా అయితే నేను యముడిని అంటూ చిత్రగుప్తుడిని ఆటపట్టించి అక్కడ నుంచి బయటికి తరిమేస్తాడు రాథోడ్. తనని రక్షించమంటూ అరుంధతిని బ్రతిమాలుతాడు. అయినా కూడా చిత్రగుప్తుడుని తరిమి కొడతాడు రాథోడ్.

చిత్రగుప్తుడి పరిస్థితికి బాధపడుతుంది అరుంధతి. కానీ మిస్సమ్మతో మాట్లాడటానికి ఇదే కరెక్ట్ సమయం తనతో మాట్లాడి ఎలా అయినా వెనక్కి తిరిగి వెళ్లేలాగా చేయాలి అనుకుంటూ మిస్సమ్మతో మాటలు కలుపుతుంది అరుంధతి.

అరుంధతి: అయినా మీరు ఎందుకు వెళ్లాలండి.. మీరు అన్ని ఎగ్జామ్స్ పాసై ఇక్కడ వరకు వచ్చారు. ఆయన ఒక్క ఆయనకి నచ్చకపోతే మీరు వెళ్లిపోవాలా, మీ నాన్నగారి ఆరోగ్యం కోసమైనా మీరు ఇక్కడే ఉండాలి అంటూ రెచ్చగొడుతుంది.

మిస్సమ్మ: అవును నిజమే నేనెందుకు వెళ్లిపోవాలి, అయితే నేనేం చేయాలి.

అరుంధతి నేను చెప్పినట్లు చేయండి అంటూ ఆమె చెవిలో ఏదో చెప్తుంది.

ఆ మాటలు విన్న మిస్సమ్మ ఆవేశంగా ఇంటిలోకి వస్తూ ఉంటే మనోహరి వాళ్లు చూస్తారు. ఇదేంటి ఇంత ఫోర్సుగా వస్తుంది. వెళ్లేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ కి చాలా తేడా కనిపిస్తుంది. తను వచ్చే ఏదో హడావిడి చేసే లోపల మనమే ఏదో చేసి తనని బయటకి పంపించేద్దాం అని గుమ్మంలోకి వస్తారు మనోహరి, నీల.

మనోహరి : మళ్లీ వెనక్కి వస్తున్నావ్ ఎందుకు ఇంట్లో ఏమైనా మర్చిపోయావా చెప్పు.. నీలా తెచ్చి పెడుతుంది.

ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా వాళ్లిద్దరిని తోసుకొని లోపలికి వెళ్లి అమర్​ని గట్టిగా కేకలు వేసి పిలుస్తుంది.

ఆ పిలుపుకి ఇంట్లో వాళ్లందరూ బయటకు వస్తారు. అప్పుడే రాథోడ్ కూడా లోపలికి వస్తాడు. మిస్సమ్మ కేకలకి కిందికి వచ్చిన అమర్.. వెళ్లిన దానివి మళ్లీ వెనక్కి ఎందుకు వచ్చావు అంటాడు.

మిస్సమ్మ : అసలు నేను ఎందుకు వెళ్లాలి, నేను అన్ని పరీక్షలు పాస్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాతే జాబ్ ఇచ్చారు. అయినా బయట ఎక్కడో ఉన్నట్టు ఇంట్లో ఎందుకు ఉంటాను, మీరు మీ అమ్మగారితో ఉన్నట్టు మీ పిల్లలతో ఉంటారా అంటూ గట్టిగా నిలదీస్తుంది. ఇంట్లో అందరికీ నచ్చిన నేను కేవలం మీకు మాత్రమే నచ్చలేదని పనిలోంచి తీసేయడం మీకు ఏమైనా న్యాయంగా ఉందా అంటూ నిలదీస్తుంది. మీరు మనోహరిగారితో పెళ్లి చూపులకు వెళ్లి మేడమ్ గారిని పెళ్లి చేసుకున్నారని తెలిసింది.

రాథోడ్: ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, సార్​కి ఇంకా కోపం తెప్పించేలాగా ఉంది అని భయపడతాడు.

మిస్సమ్మ: మీరు కొన్ని ప్రశ్నలు అడిగితే వాటిని సమాధానం చెప్పారు కాబట్టి మేడం మీకు నచ్చి పెళ్లి చేసుకున్నారు.

అలాగే మీరు నన్ను కొన్ని ప్రశ్నలు అడగండి సమాధానం చెప్పకపోతే అప్పుడు బయటకి పంపించేయండి అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Volunteer System: వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
Warangal BRS leaders: వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
Drone Pilot Training: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
Shoaib Akhtar Comments: పాకిస్థాన్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయం బీసీసీఐది కాదు బీజేపీ గవర్నమెంట్‌ది- అక్తర్ హాట్‌ కామెంట్స్ 
పాకిస్థాన్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయం బీసీసీఐది కాదు బీజేపీ గవర్నమెంట్‌ది- అక్తర్ హాట్‌ కామెంట్స్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మెగాస్టార్ కోసం..  కలిసిన మమ్ముట్టి-మోహన్ లాల్ టీమ్స్ఏఆర్ రెహమాన్ విడాకులు, 29 ఏళ్ల బంధానికి ముగింపుMarquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Volunteer System: వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
Warangal BRS leaders: వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
Drone Pilot Training: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
Shoaib Akhtar Comments: పాకిస్థాన్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయం బీసీసీఐది కాదు బీజేపీ గవర్నమెంట్‌ది- అక్తర్ హాట్‌ కామెంట్స్ 
పాకిస్థాన్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయం బీసీసీఐది కాదు బీజేపీ గవర్నమెంట్‌ది- అక్తర్ హాట్‌ కామెంట్స్ 
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Gold Rate: బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్‌ కంపెనీ జోస్యం!
బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్‌ కంపెనీ జోస్యం!
Maharashtra Assembly Election 2024: మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Embed widget