Nindu Noorella Saavasam November 25th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: మిస్సమ్మ తాళి దొంగిలించిన నీల, నోరుజారి చిక్కుల్లో పడ్డ చిత్రగుప్తుడు!
Nindu Noorella Saavasam Serial Today Episode: నీల మిస్సమ్మ తాళి దొంగిలించి చిత్రగుప్తుడికి ఇవ్వటంతో కథలో కొత్త మలుపులు చోటుచేసుకున్నాయి.
Nindu Noorella Saavasam Telugu Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇల్లు క్లీన్ చేస్తున్న నీల చీపురు తగిలి మిస్సమ్మ బ్యాగ్ కింద పడిపోతుంది. అందులోంచి కిందపడిన తాళిబొట్టు చూసి ఆశ్చర్య పోతుంది.
నీల : ఇదేంటి మిస్సమ్మ బ్యాగ్ లో తాళిబొట్టు ఉంది ఆమెకి పెళ్లి అవ్వలేదు కదా. ఏంటో పెళ్లి కానీ మిస్సమ్మ తాళిబొట్టు పట్టుకొని తిరుగుతుంది, కాలికి మెట్టెలు ఉన్న మనోహరి అమ్మని పెళ్లయిందా అని అడిగితే కాల్తో తన్నింది. ఏంటో ఈ ఇంట్లో ఆడవాళ్లు. అయినా అందరి బ్రతుకులు బాగానే ఉన్నాయి
నీ బ్రతుకే దారం తెగిన గాలిపటం లాగా అయిపోయింది అనుకుంటూ ఆ తాళిని దొంగిలించి తనతో పాటు తీసుకువెళ్లిపోతుంది. ఇంతలో ఎదురుగా వస్తున్న మనోహరిని చూసుకోకుండా గుద్దేస్తుంది. నేల చేతిలో ఉన్న తాళిబొట్టు జారీ కింద హాల్లో ఉన్న బొమ్మ మీద పడుతుంది.
మనోహరి : కళ్ళు కనిపించడం లేదా అయినా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటూ విసుక్కుంటుంది.
నీల : కంగారుపడుతూ పొయ్యి పాలు మీద పెట్టాను పొంగిపోతాయేమో అని వెళ్తున్నాను అంటూ అక్కడ నుంచి కిందికి వెళుతుంది.
అప్పుడే లోపలికి వస్తున్న మిస్సమ్మ ని చూసి ఆ తాళి ఎక్కడ చూసేస్తుందో అని కంగారు పడిపోతుంది. కానీ మిస్సమ్మకి కూడా కనిపించకుండా తాళి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు
చిత్రగుప్తుడు : నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకొని చెప్తున్నాను, ఆ మాంత్రికుడు కంటపడితే ప్రమాదం జాగ్రత్త పడు.
అరుంధతి: తలచుకుంటేనే భయంగా ఉంది నాకు గుర్తు చేయకండి. అయినా నా భయం నా కూతురు అర్థం చేసుకుంది అంటూ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగానే అక్కడికి నీల పరిగెత్తుకుంటూ వస్తుంది.
చిత్రగుప్తుడు : లేడి పిలవలే చెంగుచెంగున పరిగెత్తుకుని వస్తున్నావు ఎందుకు.
నీల: నీకు ఒకటి చూపిస్తాను ఎవరికి చెప్పొద్దు అంటూ చేతిలో ఉన్న తాళిబొట్టు చూపిస్తుంది.
అరుంధతి: ఆ తాళిని గుర్తుపట్టి ఇది కొడైకెనాల్లో పోయిన నా తాళి నీ చేతికి ఎలా వచ్చింది అని కంగారుగా అడుగుతుంది. అదే విషయాన్ని చిత్రగుప్తుడిని అడగమంటుంది కానీ ఆమె మాటలు చిత్రగుప్తుడికి వినబడవు.
నీల: ఈ మంగళసూత్రము నాదే, ఇది మీ దగ్గరే జాగ్రత్తగా దాచండి. నా మెడలో పడవలసిన తాళి మీ చేతి నుంచి రావాలి కదా అని అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది.
మరోవైపు ఇంటికి వచ్చిన మంగళ వాళ్లు ఈరోజు మనం చూసిందంతా నిజమేనా అంటూ ఆశ్చర్యపోతారు.
మంగళ: తనకి తెలియకుండానే భాగమతి తన అక్క పిల్లలకి సేవ చేస్తుంది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. తెలిసిందంటే భాగీ ఆ ఇంటి కోడలు అవుతుంది. భాగీ ఆ ఇంటి కోడలు అవ్వకూడదు అని కోరుకునే వాళ్ళు మనకి దొరికే వరకు మనం సైలెంట్ గా ఉండాలి అనుకుంటారు.
మరోవైపు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న పిల్లలు రేపు సండే కదా వాచ్మెన్ తాతయ్య రేపు మా ఇంటికి లంచ్ కి రండి అని ఇన్వైట్ చేస్తారు.
వాచ్మెన్ : వద్దు పెద్ద వాళ్లకు తెలియకుండా ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేయకూడదు.
అమ్ములు: మీరు ఇంటికి రాకపోతే మేము మీతో మాట్లాడం అంటూ రాథోడ్ వైపు తిరిగి రేపు తాతయ్య ఇంటికి వెళ్లి ఆయనని నువ్వే పిక్ చేసుకోవాలి అంటూ పురమాయిస్తుంది. అందుకు సరే అంటాడు రాథోడ్. వాచ్మెన్ అడ్రస్ చెప్తాడు. సరే అని అక్కడ నుంచి బయలుదేరుతారు రాథోడ్ వాళ్లు.
మరోవైపు అమావాస్య ఘడియలు దాటి పోవడంతో అరుంధతితో మాట్లాడుతాడు చిత్రగుప్తుడు. అప్పుడు అరుంధతి తన తల్లి గురించి చెప్తుంది.
చిత్రగుప్తుడు : ఆ తాళి ఆ బాలిక దగ్గర ఉంటుంది కానీ ఇక్కడ ఎందుకు ఉంటుంది.
అరుంధతి: ఆ బాలిక అంటే ఎవరుఅంటూ నిలదీస్తుంది.
చిత్రగుప్తుడు నిజం చెప్పలేక తడబడతాడు. ఇంతలో సీరియస్ గా వస్తున్న అమరేంద్రని చూసి ఈయన ఏమిటి ఇంత సీరియస్ గా వస్తున్నారు అని చిత్రగుప్తుడిని అడుగుతుంది అరుంధతి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆