Nindu Manasulu Serial Today September 20th: నిండు మనసులు: గణ కక్ష సాధింపు.. సిద్ధూ కోసం విజయానంద్ ఇంతలా తగ్గాడా! విశ్వనాథ్ ఎంట్రీతో ట్విస్ట్!
Nindu Manasulu Serial Today Episode September 20th ప్రేరణని విడిపించడానికి రంజిత్ లాయర్‌తో మాట్లాడి ఐశ్వర్యని విశ్వనాథ్ ఇంటికి తీసుకెళ్లి విషయం చెప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సుధాకర్ ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడటం గణ చూసి దగ్గరకు వెళ్తాడు. వీళ్లతో ఏం మాట్లాడుతున్నావ్ ఏం చెప్తున్నావ్ అని గణ అడిగితే.. వాళ్లకి కోర్టుకి తీసుకెళ్తామని చెప్తున్నా అంటాడు. వాళ్ల మీద బాగా సంపథీ చూపిస్తున్నావ్ అంటే సార్ నన్ను అనుమానిస్తున్నారా నేను మీ నమ్మిన బంటు సార్ అని అంటాడు.
గణ సుధాకర్‌కి ఫైల్ ఇచ్చి పోలీస్ స్టేషన్‌లో ఇవ్వమని అంటాడు. సుధాకర్ కావాలనే ప్రేరణ వాళ్లతో చూడండి మిమల్ని మా గణ సార్ వదిలినా నేను వదలను అని అంటాడు. మిమల్ని చూస్తుంటే నా గుండె తరుక్కు పోతుంది ఇంతకీ ఏమైనా సాక్ష్యాలు దొరికాయా.. ఏం చేస్తాం కాసేపట్లో కోర్టులో ఉంటాం.. తర్వాత మీరు జైలులో ఉంటారు అని గణ అంటాడు. నీ పవర్ వాడి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నావ్ ఏదో ఒక రోజు నీ పని అయిపోతుందని ప్రేరణ అంటే ఏంటి జాతకాలు చెప్తున్నావా అని గణ అడుగుతాడు. సిద్ధూవెంటనే జాతకాలు కాదు సార్ నిజాయితీకి ధైర్యం ఎక్కువ ప్రేరణ గారు చెప్పింది జరుగుతుంది కాలమే దిమ్మతిరిగే సమాధానం చెప్తుంది అని అంటాడు. సిద్ధూ, ప్రేరణలకు కోర్టుకి తీసుకెళ్తారు.
ఇందిర చాలా ఏడుస్తుంది. మన ఊరు కాదు ఎవరూ సాయం చేసేవాళ్లు లేరు అని ఇందిర ఏడుస్తుంది. ఐశ్వర్య కూడా చాలా బాధ పడుతుంది. ఇంతలో రంజిత్ వచ్చి పిలుస్తాడు. మళ్లీ టీ, టిఫెన్ అంటాడని ఐశ్వర్య కోపంతో ఊగిపోతుంది. మేం బాధ పడుతుంటే మీకు టీలు టిఫెన్లు కావాలి ఉండండి మీకు చేసి తీసుకొస్తా అని కోపంగా కిచెన్‌కి వెళ్తుంటే రంజిత్ ఆపుతాడు. నిన్నుటి నుంచి కోపంతో ఊగిపోతున్నావ్.. ఏం అవసరం లేదు నేను మీ కోసం తీసుకొచ్చా అని టిఫెన్ ఇస్తాడు. టిఫెన్ చేసి రెడీ అవ్వండి.. అరవడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా మీ అక్కని బయటకు తీసుకురావాలి అంటే కోపంగా కాదు ప్రయత్నించాలి. మీ అక్క తప్పు చేయలేదు అని నమ్ముతున్నారు కదా మీ అమ్మ బయటకు వస్తుంది అని అంటాడు. నిజంగానా బాబు అని ఇందిర అడుగుతుంది. అవును అని రంజిత్ చెప్పి మీరు ఎవరైనా లాయర్‌ని కలిశారా అని అంటే లేదని ఇందిర చెప్పడంతో అడ్రస్ ఇచ్చి నేను మొత్తం మాట్లాడాను మీరు విషయం చెప్పి లాయర్‌తో కోర్టుకి రండి. నేను మీ చిన్నమ్మాయి వేరే పని మీద వెళ్తాం అంటాడు. ఎక్కడికి అని ఐశ్వర్య అడిగితే ఎక్కడ సమస్య మొదలైందో అక్కడికే అని అంటాడు.
రంజిత్, ఐశ్వర్యలు విశ్వనాథం ఇంటికి వస్తారు. రంజిత్ ఇళ్లు చూసి ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావ్ అని ఐశ్వర్యని అడిగితే నేను తీసుకురాలేదు మీరే తీసుకొచ్చారు అని మొత్తం మర్చిపోయాడురా దేవుడా అని మొత్తం చెప్తుంది. ఇద్దరూ లోపలికి వెళ్తారు. విశ్వనాథం రంజిత్‌ని చూసి మళ్లీ నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావ్ అని అడుతారు. ఐశ్వర్య విశ్వానాథ్‌తో సార్ మీ మధ్య గొడవ నాకు తెలీదు కానీ నేను మీ దగ్గర కోచింగ్ తీసుకొని ప్రేరణ చెల్లిని అని సిద్ధూ, ప్రేరణల కేసు గురించి చెప్తుంది. ఇంత జరిగితే నాకు విషయం చెప్పారా అని అంటారు. నేను ఆ రోజు ఇంట్లో ఉండి ఉంటే బాగుండేది.. కానీ మా ఆవిడకు బాలేక నేను ఇంట్లో లేను అని అంటారు. రంజిత్ మహాలక్ష్మీని చూడటానికి వెళ్లాలనుకుంటే విశ్వనాథ్ అడ్డుకుంటాడు. కోర్టుకి వెళ్లి నేను సాక్ష్యం చెప్తాను అని అంటారు. గదికి వెళ్తే బాగోదు అని రంజిత్‌తో చెప్తాడు.
ఇందిర లాయర్‌తో కోర్టుకి వచ్చి లాయర్‌ని బతిమాలుతుంది. సుధాకర్ వచ్చి లాయర్‌తో మీరే వాళ్లని కాపాడాలి అని అంటాడు. ప్రేరణ, సిద్ధూ కోర్టుకి వస్తారు. ఇందిర కూతురిని చూసి ఏడుస్తూ గణకి కనిపించకుండా దాక్కుంటుంది. ప్రేరణ దగ్గరకు ఇందిర వెళ్లబోతే సుధాకర్ ఆపాలని ప్రయత్నిస్తాడు. గణకి విజయానంద్ కాల్ చేయడంతో విజయానంద్‌ని చూసి వెళ్తాడు. ఇంతలో ప్రేరణ, సిద్ధూల దగ్గరకు ఇందిర వెళ్తుంది. ఇంతలో విశ్వనాథ్ అక్కడికి వచ్చి మీరు తప్పు చేయలేదు అనడానికి నేను నా ఇల్లే సాక్ష్యం మీరు తప్పు చేయలేదు అని నేను సాక్ష్యం చెప్తా అని అంటారు.
విజయానంద్‌తో గణ సిద్ధూని కాపాడాలని వచ్చేశారా అంటే చివరి ప్రయత్నం చేద్దాం అని వచ్చా. నేను ఎప్పుడు ఎవరి కోసం తగ్గలేదు.. నాకు కావాల్సింది నేను సాధించుకున్నా అని అంటాడు. ఇప్పుడు అదే చేయండి సార్ అంటే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు నీకు ఏం కావాలి అంటే అది ఇస్తా తనని వదిలేయ్ అంటే నన్ను మీరు అస్సలు కొనలేరు సార్. జరిగిన అవమానానికి వెలకట్టలేరు అని నేనేం చేయను అని గణ చెప్పేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















