Nindu Manasulu Serial Today September 15th: నిండు మనసులు: షాకింగ్.. ప్రేరణ, సిద్ధూ అరెస్ట్! సీఐగా గణ ఎంట్రీ! అసలు ఏం జరిగింది?
Nindu Manasulu Serial Today Episode September 15th గణ సీఐగా ఎంట్రీ ఇచ్చి ప్రేరణ, సిద్ధూల మీద దొంగతనం కేసు పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode రంజిత్ యోగా చేస్తుంటే ఐశ్వర్య గదిలో మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంది. రంజిత్ ఇబ్బంది ఫీలై వెళ్లి ఆపుతాడు. నిన్నే పర్మిషన్ ఇచ్చారు కదా అని ఐశ్యర్య అంటే నిన్ను నువ్వు చెప్పింది నేనేం వినలేదు.. అని అంటాడు. తన రూల్స్ బ్రేక్ చేయొద్దని ఇంట్లో ఇలా ప్రాక్టీస్‌లు వద్దని చెప్పి మళ్లీ ఐశ్వర్యకి వార్నింగ్ ఇస్తాడు.
ప్రేరణ, సిద్ధూ ఎగ్జామ్ రాసి బయటకు వస్తారు. ప్రేరణ సిద్ధూతో విశ్వనాథం గారి భార్యకి ఏమైంది. పిల్లలు ఎక్కడున్నారు ఉన్నారా లేరా ఇలా ప్రశ్నలు వేస్తుంది. మనకు ఎందుకండీ కోచింగ్ ఇస్తాన్నారు అది చాలా అని అంటాడు. ఇద్దరూ బైక్ మీద వెళ్తుంటే పోలీసులు ఆపి స్టేషన్‌కి రమ్మంటారు. ఎందుకు అని అడిగితే మిమల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటారు. విషయం చెప్పమని అంటే చెప్పమని రమ్మని పిలుస్తారు. ఇక లేడీ కానిస్టేబుల్ ప్రేరణ చేయి పట్టుకుంటే సిద్ధూ ప్రేరణ చేయి పట్టుకొని తను రాదు.. వదులు అని అరుస్తాడు. ఇక పోలీసులు రిక్వెస్ట్ చేసి ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కి వచ్చి సీఐతో మాట్లాడమని చెప్పి ఇద్దరినీ తీసుకెళ్తారు.
పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ బొకే పూల దండం పట్టుకొని కొత్త సీఐ వస్తారని హడావుడి చేస్తాడు. ఇంతలో ప్రేరణ, సిద్ధూలను చూస్తాడు. ప్రేరణ ఏంటి ఇక్కడికి వచ్చిందని అనుకుంటాడు. విషయం అడిగితే లేడీ కానిస్టేబుల్ ఇద్దరూ చైన్ దొంగతనం చేశారని చెప్తుంది. నేను చూసుకుంటానని అందర్ని సుధాకర్ పంపి ప్రేరణకు ఏమైంది అని అడిగితే మాకే అర్థం కాలేదు అని ఇక్కడికి వచ్చాకే చైన్ దొంగతనం చేశామని అడిగితే రూడ్‌గా మాట్లాడారని అంటారు. ఆ గణ లేడుగా మీరు హ్యాపీగా వెళ్లిపోవచ్చులే. ఏదో పొరపాటు జరిగింది సీఐ గారు వస్తే తెలుస్తుందని అంటాడు.
సీఐ రావడంతో సుధాకర్ బయటకు వెళ్తాడు. గణని సీఐగా చూసి బిత్తరపోయి సీఐ అంటే వీడా ఏంటి భగవంతుడా ఇదంతా అని అనుకుంటాడు. గణ వచ్చి సుధాకర్ బుగ్గలు గిచ్చుతూ ఏంటి సుధా అలా చూస్తూ ఉండిపోయావ్..మొన్నటి వరకు మీ ఎస్‌ఐని ఇప్పుడు సీఐ అని షాక్ అయ్యావా.. అని అంటాడు. ఏంటి సార్ చెప్పలేదు అని అంటే అందరికీ అన్నీ చెప్పి చేస్తుంటే కలిసిరావడం లేదు అందుకే ఇది నీకు చెప్పకుండా సర్‌ఫ్రైజ్ ఇచ్చా అంటాడు. లోపల మనకోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు పద అని అంటాడు.
గణ, సిద్ధూల దగ్గరకు సీఐ గణ వెళ్తాడు. అవును వీళ్లని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో తెలీదు కదా సుధా నీకు చదువుకున్న వాళ్లకి మనం మర్యాద ఇవ్వాలి వీళ్లని ఇక్కడే శాశ్వతంగా ఉంచి మర్యాద ఇస్తా అంటాడు. చేసిన నేరం చెప్పకుండా అరెస్ట్ ఏంటి అని ప్రేరణ అడుగుతుంది. దాంతో గణ సుధాకర్‌కి ఎఫ్ ఐఆర్ ఇచ్చి చదవమని అంటాడు. అందులో ఓ గ్యాంగ్ దొంగతనాలు చేస్తుందని అందులో ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారని వాళ్లే ప్రేరణ, సిద్ధూ అని ఇద్దరూ ఓ ముసలావిడ మెడలో గొలుసు కొట్టేస్తుంటే ఆవిడ తల రోడ్డుకు తగిలి హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య ఉందని ఇద్దరి మీద అటమ్‌టూ మర్డర్ కేసు నమోదు చేశారని రాసుంటుంది. అది విని ప్రేరణ, సిద్ధూ షాక్ అయి మేం ఏం తప్పు చేయలేదు అని అంటారు. ప్రత్యక్ష సాక్షి అంటూ ఓ వ్యక్తిని గణ తీసుకొస్తాడు. ఇది కూడా సరిపోదా మీ కళ్లు తెరిపించే వీడియో ఉంది చూడండి అని సీసీ టీవీ ఫుటేజ్ చూపిస్తుంది. అందులో సేమ్ ప్రేరణ, సిద్ధూల డ్రస్‌లతో ఉండే వీడియో చూపిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















