Nindu Manasulu Serial Today July 19th: నిండు మనసులు సీరియల్: సిద్ధూ IPS కల నెరవేరుతుందా.. తండ్రి మోసం.. ప్రేరణ, ఇందు జీవితాల్లో పెను మార్పులు!!
Nindu Manasulu Today Episode ప్రేరణ తల్లితో తన తండ్రి మొదటి పెళ్లి గురించి చెప్పి తల్లి, చెల్లిని తీసుకొని తండ్రి దగ్గరకు బయల్దేరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూకి ఐపీఎస్ కావడం కల. కానీ తన తండ్రి విజయానంద్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. విజయానంద్ సంపాదన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ముట్టను అనుకున్న సిద్ధూ ఐపీఎస్ కూడా తన టాలెంట్‌తో అవ్వాలని అనుకుంటాడు. అందుకు సిద్ధూ కోచింగ్ కోసం ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అక్కడ విజయానంద్ రికమండేషన్ సీట్ ఉంచడంతో సిద్ధూ జాయిన్ అవ్వడు. విజయానంద్ తన పీఏతో వాడు ఐపీఎస్ కాదు కదా కానిస్టేబుల్ కూడా కాలేడు. వాడు వెళ్లే ప్రతీ చోట నా రికమండేషన్ ఉంటుంది వాడు ఎలా ఐపీఎస్ అవుతాడురా అని అంటాడు. వాడిని అవ్వనివ్వను అంటాడు.
సిద్ధూ తన ఫ్రెండ్‌తో ఆ మనిషి నీడ పడకుండా బతుకుతున్న వాడిని ఆయన జాడ లేని చోటుకి జాడ దొరకదా.. నా సంకల్పమే నాకు దారి చూపిస్తుంది ఐపీఎస్ అయి చూపిస్తా అని అంటాడు. ప్రేరణ, ఐశ్వర్యలు తల్లికి డాక్టర్‌కి చూపిస్తారు. ప్రేరణ గణేశ్ మాటలు తలచుకొని ఏడుస్తుంది. ఐశ్వర్య అక్క దగ్గరకు వెళ్లి వాడు ఎవడో వచ్చి మన నాన్న మనకు ఏం కారు అని చెప్పడం ఏంటి అక్కా కాలనీ వాళ్లు కూడా మనల్ని పొగిడే స్థితి నుంచి తప్పుగా మాట్లాడే వరకు వచ్చారని అంటుంది. అవమానించే స్థితిలో వాళ్లు ఉన్నారు ఆధారాలు కూడా లేని స్థితిలో మనం ఉన్నామని ప్రేరణ ఏడస్తుంది. మనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అని ప్రేరణ ఏడుస్తుంది.
ఐశ్వర్య అక్కతో అసలు అమ్మానాన్నకి పెళ్లి అయినట్లు మన దగ్గర ఏ ఆధారం ఎందుకు లేదు అక్క.. వాడు మాటలు చూస్తుంటే వాడే కరెక్ట్ అనిపిస్తుంది అక్క. మన నాన్న మనల్ని మోసం చేశారని అనిపిస్తుంది అని ఐశ్వర్య అంటుంది. దాంతో ప్రేరణ చెల్లి మీద కోప్పడుతుంది. మన నాన్న గురించి మన నాన్న మనల్ని మోసం చేసేవాడిలా కనిపిస్తున్నాడా నాన్న ఎలాంటి వాడో నీకు తెలీదా అని అంటుంది. అక్క ఇప్పుడు ఏం ఆధారం చూపిస్తామని ఐశ్వర్య అంటే మనకు ఏం ఆధారాలు అవసరం లేదు మనం నాన్న బిడ్డలమే నాన్నే మనకు ఆధారం ఆయనే అందరికీ సమాధానం చెప్పాలి అని అంటుంది. ఇంతలో ఇందుకి కాలనీ వాళ్లు అన్న మాటలు గుర్తొచ్చి ఏవండీ అంటూ ఉలిక్కి పడి లేస్తుంది.
ప్రేరణ, ఐశ్వర్య ఇందు దగ్గరకు వెళ్తే అసలు ఏం జరుగుతుందే మనకి ఈ పరిస్థితి ఏంటే.. నేను విన్నది చూసింది నిజమేనా. మీ నాన్నకి మొదటి భార్య ఉండటం ఏంటే.. కొడుకు అని వాడు ఎవడో రావడం ఏంటే అని తలకొట్టుకొని ఏడుస్తుంది. ఐశ్వర్య, ప్రేరణ తల్లిని ఓదార్చాలని ప్రయత్నిస్తారు. మీ నాన్న అలా చేయరు మీ నాన్న మనల్ని మోసం చేశారు అంటే నేను నమ్మను.. వెంటనే మీ నాన్నతో మాట్లాడాలి ఆయన్ని కలవాలి ఇదంతా ఏంటో ఆయన్ను అడిగి తెలుసుకోవాలని అంటుంది. ప్రేరణ తల్లిని ఆపుతుంది. ఇప్పుడు వద్దమ్మా ఇప్పుడు నాన్న మాట్లాడే పరిస్థితిలో లేరమ్మా.. నాన్నకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్‌లో ఉన్నారమ్మా.. నేను హైదరాబాద్ వెళ్లింది నాన్నకి యాక్సిడెంట్ అయిందని తెలిసే అనిచెప్తుంది. ఇందు, ఐశ్వర్య షాక్ అయిపోతారు.
ప్రేరణ హాస్పిటల్‌కి వెళ్లి నాన్నని చూశానని అక్కడ పోలీసోడ్ గణేశ్ కలిశాడని పెద్దాయన లేచే టైంకి మీ ఫ్యామిలీ ఆయన ఎదుట ఉంటే బాగుంటుందని నాకు తీసుకొచ్చి ఇలా అందరి ముందు మన పరువు తీశాడని అంటుంది. మీ నాన్న తప్పు చేశారు అంటే నమ్మలేనే అంటే నువ్వు నమ్మకపోయినా నిజం అబద్ధం అయిపోదమ్మా నీ కంటే ముందు నాన్న ఈశ్వరి అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు వాళ్లిద్దరికీ పుట్టిన వాడే ఈ పోలీసోడు అని చెప్తుంది. నువ్వు నాన్నకి భార్యవి కాదని సాక్ష్యాలు అడుగుతున్నాడమ్మా అని అంటుంది. నువ్వు నాన్నకి భార్యవే కాదని వాడు అందర్ని నమ్మించాడని అందరూ మనల్ని చీదరించుకున్నారని అంటుంది. మీ నాన్నని చూడాలి అని ఇందు అంటే నాన్న కళ్లు తెరవడం లేదు ఆయన అలాంటి పరిస్థితిలో ఉండటం మన దురదృష్టం అని అంటుంది. ఎందుకు భగవంతుడా మాకు ఇంత చిన్న చూపు చూశావ్ మేం ఎలా బతకాలి ఎలా తలెత్తుకొని తిరగాలి అని ఇందు ఏడుస్తుంది.
ప్రేరణ తల్లితో మనం ఇక్కడ ఉండొద్దమ్మా ఇక్కడ ఉన్నా మనం బతకలేం.. ఆ పోలీసోడు మనల్ని బతకనివ్వడు.. మనం నాన్న దగ్గరకు వెళ్దాం అని అంటుంది. అక్కడ ఎవరో ఉన్నారు అని అన్నావ్ కదే అని ఇందు అంటే ఉంటే ఉండనీ నాన్న అంటే కొందరికీ కేవలం అవసరం కావొచ్చు కానీ మాకు సర్వం మా జీవితం అన్నీ మానాన్నే. నువ్వు భార్యవని మేం రాజశేఖరం బిడ్డలం అని సాక్ష్యం కావాలని అన్నాడు కదా అది మనం నాన్నతోనే చెప్పించాలని ప్రేరణ అంటుంది. తల్లీపిల్లలు ఒకర్ని ఒకరు పట్టుకొని ఏడుస్తారు. లగేజ్ తీసుకొని రాత్రి పూట బయల్దేరుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: అన్న డబ్బు కొట్టేసిని లోహిత.. చందుకి అవమానం తప్పదా! సోదమ్మా మహికి ఏం చెప్పిందంటే!





















