Nindu Manasulu Serial Today December 31st: నిండు మనసులు: ప్రేరణని హగ్ చేసుకున్న సిద్ధూ.. షాకింగ్‌గా ఇందిర యాక్షన్! ఇద్దరూ దూరం అయిపోతారా!
Nindu Manasulu Serial Today Episode December 31st సిద్ధూ సంతోషంగా ప్రేరణని హగ్ చేసుకోవడం ఇందిర చూసి తప్పుగా అర్థం చేసుకొని ప్రేరణని కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode వర్ష ప్రెస్ మీట్తో గణ పరువు మొత్తం పోగొట్టుకుంటాడు. ఈశ్వరికి తెలిసిన వాళ్లు అంతా ఫోన్లు చేసి విషయం అడుగుతూ ఉంటారు. ఈశ్వరి చాలా ఇరిటేట్ అయిపోతుంది. అయినవాళ్లు కానివాళ్లు అందరూ అవమానించేలా మాట్లాడుతున్నారు.. ఏం సమాధానం చెప్పాలిరా.. పరువు మొత్తం తీసేశావ్ అని గణని తిడుతుంది.
గణ తల్లితో కొన్ని రోజుల్లో ప్రమోషన్స్ ఇస్తారు. అప్పుడు సీఐగా ఉన్న నాకు ఇంకా పెద్ద పోస్ట్ వస్తుంది. అప్పుడు నిన్ను అన్నవాళ్లు నోర్లు నేను మూయిస్తాను అని అంటాడు. ఇంతలో సుధా వచ్చి మీకు ఆ అవకాశం లేదు సార్ అని గణ సస్పెండ్ ఆర్డర్ కాఫీ గణ చేతిలో పెడతాడు. గణ అది చూసి బిత్తరపోతాడు. ఈశ్వరి ఏంటి అని అడిగితే సార్ని సస్పెండ్ చేశారని చెప్తాడు. ఈశ్వరి కూడా షాక్ అయిపోతుంది. ఒకమ్మాయిని ప్రేమించి నమ్మించి మోసం చేశారు అని.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూశారని వర్ష ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల సస్పెండ్ చేశారు.. అసలు ఉద్యోగం ఉంటుందో లేదో కూడా తెలీదు అని అంటాడు. సుధా అని గణ సుధా కాలర్ పట్టుకుంటాడు. దానికి ఈశ్వరి ఇదంతా నువ్వే చేసింది గణ నువ్వే భరించు.. పరువుగా గౌరవంగా తలెత్తుకొని బతకాలి అనుకున్నా.. మీ నాన్న రెండో పెళ్లి చేసుకొని సగం చంపేశాడు.. నువ్వు ఇప్పుడు ఇలా చేసి పూర్తి చంపేశావ్.. నీ ముఖం చూడాలి అంటేనే అసహ్యంగా ఉంది అని అసహ్యించుకొని వెళ్లిపోతుంది.
గణ తల పట్టుకొని కూర్చొంటాడు. సుధాకర్ జరిగింది అంతా ప్రేరణకు చెప్తాడు. ప్రేరణ, సుధా చాలా సంతోషపడతారు. చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తాడు అని అంటుంది. వాడు కాదే మనం అనుభవించనున్నామే శిక్ష నువ్వు చేసిన దానికి ఆ గణ ఏం చేస్తాడో అని భయంగా ఉందే అని ఇందిర అంటుంది. ఏం కాదు అని సుధాకర్ కూడా అంటే అని మీరు అనుకుంటున్నారు.. వాడు దెబ్బ తిన్న పాము లాంటి వాడే మనల్ని వదలడే అని భయపడుతుంది. వాడిని అలా వదిలేస్తే నాన్న పరువు తీసేస్తాడు అందుకే వాడిని మార్చాలి అని అనుకున్నా అని అంటుంది. మీ కన్న తండ్రినే నాన్న అని పిలవకుండా చేయాలి అనుకున్నవాడు.. ఇప్పుడు మీరు వాడి జీవితాన్ని నాశనం చేశారని అనుకొని మీ నాన్నని మీకు దూరం చేసేస్తాడే.. ఉన్న సమస్యలు చాలవు అన్నట్లు కొత్త సమస్యలు తీసుకొచ్చావ్ కదే.. అని అంటుంది.
సుధాకర్ కూడా ఇందిరకు ధైర్యం చెప్పినా కూడా ఇందిర భయపడుతూనే ఉంటుంది. ఇంతలో ఇంటికి సిద్ధూ వస్తాడు. ప్రేరణ నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. ఇందిర సిద్ధూతో మీరు మాట్లాడుతూ ఉండండి బాబు నేను కాఫీ తెస్తానని వెళ్తుంది. సుధాకర్ ఫోన్ రావడంతో పక్కకి వెళ్తాడు. ఇక సిద్ధూ, ప్రేరణ బయటకు వెళ్లి మాట్లాడుతారు. సిద్ధూ సంతోషంతో నేను ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా ప్రేరణ.. నా ఈ ఆనందానికి కారణం నువ్వే నీకు కొన్ని కోట్ల సార్లు థ్యాంక్స్ అని చేయి పట్టుకొని సంతోషంతో థ్యాంక్స్ చెప్తాడు. ఇద్దరూ నవ్వుకుంటారు. తన చెల్లి పెళ్లి ఆపినందుకు, వర్షని కాపాడినందుకు మళ్లీ మళ్లీ థ్యాంక్స్ చెప్తాడు. ప్రేరణ లేకపోతే ఈ సిద్ధూ లేడు.. నువ్వే లేకపోయి ఉంటే నేను ఈ రోజు గణ చేతిలో ఓడిపోయే వాడిని.. మళ్లీ మా ఇంటికి దూరం అయ్యేవాడిని ఒంటరి అయిపోయేవాడిని అని అంటాడు.
ప్రేరణ సిద్ధూతో నువ్వు ఎప్పటికీ ఒంటరి అవ్వవు సిద్ధూ నీ కోసం నేను ఎప్పటికీ ఉంటాను. అది కష్టం అయినా సంతోషం అయినా నీ వెంటే ఉంటాను అని అంటుంది. ఆ మాటలకు సిద్ధూ ప్రేరణని హగ్ చేసుకొని నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం అని అంటాడు. ఇంతలో ఇందిర కాఫీ తీసుకొని వచ్చి ఇద్దరూ హగ్ చేసుకోవడం చూసి చేతిలో ఉన్న కాఫీ కప్పులు పడేస్తుంది. ప్రేరణ, సిద్ధూ ఇందిరను చూసి షాక్ అయిపోతారు.
ఇందిర ఆవేశంగా వెళ్లి సిద్ధూని కోపంగా చూస్తూ ప్రేరణని లాగిపెట్టి కొడుతుంది. ఆంటీ అది కాదు అని సిద్ధూ అంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్లు బాబు అని అంటుంది. అదంతా దూరం నుంచి సుధాకర్ చూస్తాడు. సిద్ధూ మాట్లాడాలి అని చూసినా ఇందిర వినకుండా సిద్ధూని పంపేస్తుంది. ప్రేరణ ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. సిద్ధూ మనసులో ఛా నేను ఎందుకు ఇలా చేశాను అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ప్రేరణ తల్లితో నువ్వు అనుకున్నట్లు నేను ఏ తప్పు చేయడం లేదు అది మాత్రం గుర్తు పెట్టుకో అని చెప్పి వెళ్లిపోతుంది.
సుధాకర్ ఇందిరతో అక్క ప్రేరణని ఎందుకు అలా కొట్టావు అక్క అంటే తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావా అని అడుగుతాడు. ఇందిర ఏడుస్తూ లేదురా.. సమాజం గురించి ఆలోచిస్తున్నా.. ముందు జాగ్రత్త పడుతున్నా.. అది అసలే ఎదిగిన పిల్ల.. దాని మనసులో ఏం లేకపోయినా అది ఇచ్చిన చనువుతో సిద్ధూ మనసులో లేనిపోని ఆలోచనలు వస్తే ఎలారా అని అంటుంది. అది సిద్ధూకి అర్థమయ్యేలా చెప్తే సరిపోయేది కదా అక్క అని అంటాడు. చెప్తే వినే వయసారా వాళ్లది. అసలే సిద్ధూ గొప్పింటి బిడ్డ తను ఏం చేసినా తప్పు ఉండదు.. మనకి అలా కాదు.. నా విషయంలో ఏం జరిగిందో చూశావా.. భర్తని భర్త అని చెప్పుకోలేను నా కూతురి విషయంలో అందుకే జాగ్రత్త పడుతున్నారా.. తన జీవితం నాలా కాకూడదు అని ఏడుస్తుంది.
సిద్ధూ కేఫ్లో ఒంటరిగా కూర్చొని జరిగింది తలచుకొని నా వల్ల ప్రేరణకు అవమానం జరిగింది వెంటనే తనకు సారీ చెప్పాలి అని అనుకొని ఫోన్ చేస్తాడు. ప్రేరణ లిఫ్ట్ చేయదు.. బాధగా ఉన్న సిద్ధూ దగ్గరకు గణ మందు తాగి ఆ మత్తులో వస్తాడు. రేయ్ సిద్ధూ అంటూ అన్నీ తన్నేసి నువ్వు నీ పార్టనర్ కలిసి నా పరువు తీయడమే కాకుండా నన్ను సస్పెండ్ అయ్యేలా చేశారు మిమల్ని వదలనురా అని అంటాడు. ఇలా వాగే ఈ పరిస్థితి తీసుకొచ్చుకున్నావురా.. పవర్ పోయినా పొగరు ఇంకా నీకు పోలేదు కదా అది పోయేలా చేస్తా అని సిద్ధూ అంటాడు. నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చిన నిన్ను ఆ ప్రేరణని వదలనురా అని గణ వార్నింగ్ ఇస్తే సిద్ధూ నవ్వుతూ నీలాంటి వాళ్లని చాలా మందిని చూశానురా.. అసలే తాగున్నావ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో అరెస్ట్ చేస్తారు మీ వాళ్లే బయల్దేరు వెళ్లు వెళ్లు పోరా అని పంపేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















