Nindu Manasulu Serial Today December 2nd: నిండు మనసులు: కుమార్, ఐశ్వర్య నిశ్చితార్థం ఆపేస్తారా! సిద్ధూ ప్లానేంటి!
Nindu Manasulu Serial Today Episode December 2nd కుమార్, ఐశ్వర్యలు గణ నిశ్చితార్థం ఆపేయాలని ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సాహితి, గణల నిశ్చితార్థం వేడుక కేఫ్‌లో ఏర్పాటు చేస్తారు. ప్రేరణ, సిద్ధూతో గణ వాళ్ల నాన్నని కాపాడినట్లు నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. నీకు ఆయన ఎవరో తెలీదు కదా అని గణ అంటాడు. ఇక ఆయన ఆ రోజు తన కూతురి పరీక్ష అని తను పాసైందని చెప్పారు అని ఆయన కూతురు కూడా నాతో మాట్లాడిందని అలాంటప్పుడు గణకి అక్క, చెల్లి ఎవరో ఉండాలి కదా కానీ తను ఎప్పుడు కనిపించలేదు అని అంటాడు.
ఇంతలో సాహితి వచ్చి సిద్ధూతో మాట్లాడి నిశ్చితార్థం రింగులు చూపిస్తా అని ప్రేరణని తీసుకెళ్తుంది. సిద్ధూ దగ్గరకు కుమార్ వస్తాడు. ఈ నిశ్చితార్థం ఎలా అయినా ఆగిపోవాలని సిద్ధూ అంటాడు. రేయ్ మీనాన్న, ఆ గణ గురించి తెలిసే ఇదంతా చేస్తున్నావా అంటే నేను ఆపనురా నువ్వు ఆపుతావ్ అంటాడు. నా మీద కోపం, పగ ఉంటే ఇప్పుడు తీర్చుకోవాలి అనుకుంటున్నావా అని కుమార్ అడుగుతాడు. మీ మామ మినిస్టర్ కదా నువ్వే ఆపుతావ్ అని అంటాడు సిద్ధూ. ఇలా ఇరికించేశావ్ ఏంట్రా తప్పదుకదా క్యాన్సిల్ చేస్తాలే అని కుమార్ అంటాడు.
గణ దగ్గరకు సుధాకర్ వెళ్లి మీ నాన్న ఇక్కడే ఉన్నారు కదా ఆ ప్రేరణ నాన్న అనిపిలిచేస్తే ఎలా అంటే నాకు తెలుసు దాని సంగతి అందుకే నిన్న రాత్రి దాన్ని రెచ్చ గొట్టా చచ్చినా నాన్న అని పిలవదు అని అంటాడు. మీరు సూపర్ సార్ అని సుధాకర్ అంటాడు. మీ నిశ్చితార్థం కోసం ఒక వైపు మీ మామని మరోవైపు సిద్ధూని ఇప్పుడు ప్రేరణని లాక్ చేశారు సూపర్ సార్ మీరు అని అంటే నేను అనుకున్నది సాధించడానికి ఎవరినైనా లాక్ చేస్తా అని అంటాడు గణ.
ప్రేరణ సిద్ధూకి థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకు థ్యాంక్స్ అని సిద్ధూ అడిగితే ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు చెప్తా అని అనుకుంటుంది. ఇంతలో కుమార్ ఐశ్వర్యని తీసుకొస్తాడు. నువ్వు, ప్రేరణ నాకు సాయం చేయరు కాబట్టి నేను ఐశ్వర్యకి విషయం చెప్పి తీసుకొచ్చా అంటాడు. ఐశ్వర్య సిద్ధూ వాళ్లతో నేను ఈ నిశ్చితార్థం ఆపేస్తా అని తన భుజం మీద బాధ్యత వేసుకుంటుంది. ఏదైనా అయితే నువ్వు ఇరుక్కుంటావ్ కదా కుమార్ అని ప్రేరణ అంటే అది తెలుసు అందుకే ఐశ్వర్యని తీసుకొచ్చా నేను ఇరుక్కుంటే తను ఇరుక్కుంటుంది కదా అప్పుడు తన కోసం అయినా నువ్వు నన్ను కాపాడుతావని అంటాడు. మినిస్టర్‌కి తగ్గ అల్లుడివిరా అని సిద్ధూ అంటాడు.
ఐశ్వర్య తండ్రిని చూసి ఎమోషనల్ అయిపోతుంది. ఇక గణ ప్రేరణ చెల్లి ఐశ్వర్యని చూసి షాక్ అయిపోతాడు. సిద్ధూ, ప్రేరణ కలిసి ఏదో ప్లాన్ చేసినట్లు ఉన్నారని అనుకుంటాడు. ఇద్దరూ కలిసి నిశ్చితార్థం ఆపాలని మాట్లాడుకోవడం గణ వింటాడు. అగ్గిపెట్టి, కర్పూరం ఇలా కాలేవి ఏమైనా ఉంటే వాటిని వాడి తగలబెట్టేద్దాం అని ఐశ్వర్య అంటుంది. సూపర్ అని కుమార్ అంటాడు. గణ మొత్తం వినేసి మీ ప్లాన్ నేను వినలేదు అనుకున్నారా అని అనుకుంటాడు.
నిశ్చితార్థం వేడుక మొదలవుతుంది. గణ భయంతో అగ్గిపెట్టెలు, కర్పూరం అన్నీ దాచేస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావ్ బాబు అని మంజుల అడుగుతుంది. పూజలు ఏం వద్దు పెద్దల ఆశీర్వాదం చాలా అని అంటాడు. తర్వాత ఐశ్వర్య, కుమార్‌లు తమ ప్లాన్ వర్కౌట్ అయిందని అనుకుంటారు. గణ సుధాతో ప్రేరణ చెల్లి ఐశ్వర్య, కుమార్‌తో చాలా పని ఉందని అంటాడు. మళ్లీ ఐశ్వర్య, కుమార్‌లు ప్లాన్ ఇలా మారిపోయింది ఏంటా అని అనుకుంటారు. గణ వినేలా పంతులు లేకుండా నిశ్చితార్థం జరగదు కదా పంతుల్ని కట్ చేద్దాం అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















