Nindu Manasulu Serial Today December 26th: నిండు మనసులు: గణ నిజస్వరూపం బయట పెట్టేసిన వర్ష! సంచలన నిజాలు.. షాకింగ్ ట్విస్ట్‌లు ఇవే!
Nindu Manasulu Serial Today Episode December 26th ప్రేరణ, సిద్ధూ వర్షతో నిజం చెప్పించడం గణ అన్నీ అబద్ధాలు అని అందర్నీ మభ్యపెట్టడానికి ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode గణ తాళి చేతిలోకి తీసుకొని ఇక ఎవరూ ఈ పెళ్లిని ఆపలేరు అని అనుకుంటాడు. అప్పుడే పెళ్లి మండపంలో గణకి ఎదురుగా వర్ష వచ్చి నిల్చొంటుంది. వర్షకి ఇరువైపులా ప్రేరణ, సిద్ధూ నిల్చొంటారు. గణ వాళ్లని చూసి షాక్ అయి తాళిబొట్టు కింద పడేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు.
గణ మనసులో వీళ్ల గురించి సిద్ధూకి ఎలా తెలిసింది అని అనుకుంటాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో రంజిత్ కారు డిక్కలో ఉన్న ఐశ్వర్య తన అక్క వర్షలు ప్రమాదంలో ఉన్నారని గుర్తించిన ఐశ్వర్య సిద్ధూకి కాల్ చేసి విషయం చెప్తుంది. సిద్ధూ వెంటనే అక్కడికి వెళ్తాడు. నిన్నటి ఎపిసోడ్‌లో రౌడీలు రంజిత్‌ని పొడిచిన టైంలో సిద్ధూ అక్కడ ఉంటాడు. రంజిత్‌ని కరెక్ట్‌గా పొడిచే టైంకి సిద్ధూ వెళ్లి రౌడీలను పట్టుకొని చితక్కొట్టి రంజిత్‌తో పాటు ప్రేరణ, వర్షలను కాపాడతాడు. అలా సిద్ధూ ప్రేరణ, వర్షలకు కాపాడి పెళ్లి మండపానికి తీసుకొస్తాడు.
పంతులు గణతో ఏంటి బాబు తాళి అలా వదిలేశావ్ అని అడుగుతాడు. తన చేసిన తప్పు తన కళ్ల ముందుకి వచ్చిన తర్వాత భయంతో తాళి వదిలేయక ఎలా ఉంటాడు అని సిద్ధూ అంటాడు. విజయానంద్ సిద్ధూతో గణ తప్పు చేశాడా ఏం చేశాడు అని అడుగుతాడు. గణ తప్పు చేశాడు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమే ఈ వర్ష అంటాడు. మంజుల సిద్ధూతో వర్ష తనకు స్నేహితురాలు అని చెప్పాడు కదా మరి ఎందుకు వేరే వాళ్ల మాటలు విని ఇక్కడి తీసుకొచ్చావని ప్రేరణని ఉద్దేశించి అంటుంది.
గణ, వర్ష లవర్స్ అని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారని కానీ చివరికి మోసం చేశాడని ప్రేరణ చెప్తే మంజుల ప్రేరణ మీద కోప్పడుతుంది. మాట్లాడొద్దు అని ఇంతకు ముందు ఇవే నిందలు వేశారని అంటుంది. సిద్ధూ వర్షకి నిజం చెప్పమంటాడు. వర్ష అందరితో గణ నేను ఫ్రెండ్స్ కాదు.. మేం ప్రేమించుకున్నాం.. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాం అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు.
గణ అందరితో సిద్ధూ ప్రేరణలు కావాలనే ఇలా చెప్పిస్తున్నారు. నేను వర్ష ఫ్రెండ్స్.. అంతే కదా వర్ష అని గణ అంటే వర్ష గణతో నటించకు వీళ్లెవరూ నన్ను బెదిరించలేదు ఏం లేదు.. నువ్వే నన్ను చంపాలి అని చూశావని అంటుంది. అందరూ మళ్లీ షాక్ అయిపోతారు. తనని చంపాలి అనుకున్నారా అని సాహితి అంటుంది. వర్షనే కాదు తను ప్రేరణ, వర్ష ఇద్దరినీ చంపాలి అనుకున్నాడని అంటాడు. గణ ఇదేదీ నిజం కాదు అని అంటాడు. నేనే ప్రత్యక్ష సాక్షిని అని ప్రేరణ అంటుంది. అందరూ నాటకం ఆడుతున్నారని గణ అంటాడు.
సిద్ధూ కోపంగా ఆస్తి కోసం నా చెల్లిని ట్రాప్ చేశావ్.. నా చెల్లిని నువ్వే కిడ్నాప్ చేయించి మళ్లీ నువ్వే కాపాడినట్లు నటించావ్ అంటాడు. నాకు ఏంటి అవసరం అని గణ అంటే నీకే అవసరం అని ప్రేరణ అంటుంది. ప్రేరణ కోపంగా ఎందుకంటే పెద్దింటి పిల్లని కాపాడితే వాళ్లు నిన్ను మంచివాడు అని పొగుడుతారు.. అలా వాళ్లకి దగ్గర అవ్వడానికి నీ మనుషులతో కిడ్నాప్ చేయించావ్.. అని అంటుంది. కిడ్నాప్ విషయం నీ స్టేషన్‌లో ఎందుకు చెప్పలేదు.. వేరే వాళ్ల సాయం ఎందుకు తీసుకున్నావ్ అని సిద్ధూ అడుగుతాడు.
గణ సాహితిని తనకు పెళ్లి చేయమని అడుగుతాడు. నీకు పెళ్లి అంటూ జరిగితే వర్షతోనే జరగాలి అని అంటాడు. వర్ష పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నిశ్చితార్థం అని తెలిసి వస్తే గణ తనని ఆపి నేను నిజం చెప్తే తన తల్లిదండ్రులు తనకు దక్కరు అని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడని చెప్తుంది. ప్రేమ విషయం ఎవరి దగ్గరా చెప్పొద్దని మాట కూడా తీసుకున్నాడని సిద్ధూ చెప్తాడు. ఏంట్రా అలా బెల్లంకొట్టిన రాయిలా ఉండిపోయావ్ ఏదో ఒకటి చెప్పరా అని ఈశ్వరి అంటుంది. విజయానంద్ ప్రేరణ వాళ్లతో ఇవన్నీ కాదు వీళ్లు ప్రేమించుకున్నారు అనడానికి సాక్ష్యాలు ఉంటే చూపించండి అని అంటాడు.
సిద్ధూ సాక్ష్యాలు ఉన్నాయి అని అంటాడు. గణతో సాక్ష్యాలు కావాలారా నీకు సాక్ష్యాలు చూపించు వర్ష అని సిద్ధూ చెప్పగానే వర్ష తను గణ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు చూపిస్తుంది. అవి చూసిన తర్వాత సాహితి గణని ఛీ కొడుతుంది. వర్షని పెళ్లి చేసుకుంటా అని గుడికి పిలిచి కిడ్నాప్ చేయించాడని ప్రేరణ చెప్తుంది. ప్రేరణ తన ప్రాణాలు కాపాడిందని ఈ రోజు గణ చేతిలో చావకుండా ఉండటానికి కారణం సిద్ధూ, ప్రేరణ అని అంటుంది. గణ ఫోటోలు కూడా దొంగ సాక్ష్యాలే అని ఇప్పుడున్న టెక్నాలజీ వాడారని అంటాడు. దాంతో ప్రేరణ కిడ్నాపర్లు సీన్ రికార్డ్ చూపిస్తుంది. వాడు చేసిందంతా నటనే ఆ నటన తోనే సిద్ధూకి మీకు గొడవ పెట్టి పంపేశాడు అని మంజుతో అంటుంది. ప్రేరణ మీద కూడా నీకు అసహ్యం వచ్చేలా చేశాడని.. ప్రేరణ లేకపోతే ఈ రోజు వర్ష, సాహితిల జీవితం కాపాడిందని అంటాడు. అత్తయ్య గారు నేను నిజంగా ఏ తప్పు చేయలేదు అని గణ అంటే మంజుల లాగిపెట్టి కొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















