Illu Illalu Pillalu Serial Today December 26th:ఇల్లు ఇల్లాలు పిల్లలు: అమూల్య చేసిన పనికి శోకసంద్రంలో కుటుంబం! ఎదురుతిరిగిన ప్రేమ! అసలు ట్విస్ట్ ఇదే!
Illu Illalu Pillalu Serial Today Episode December 26th రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరగడం అమూల్య విశ్వది తప్పు లేదు తానే ప్రేమించా అని అందరి ముందు ఒప్పుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు కూతురి ప్రేమ విషయం తెలిసి చాలా ఏడుస్తాడు. మీ అందరికీ నేను ఏం లోటు చేశాను.. మీ కోసం నేను ఏం చేయలేదు చెప్పండి.. గొప్ప జీవితాలు ఇవ్వాలి అనే అనుకున్నాను.. నువ్వు కూడా ఈ నాన్నకి మోసం చేస్తావా అమ్మా.. వాడిని ప్రేమించే ముందు ఈ నాన్న గుర్తు రాలేదా.. వాళ్లు ఈ నాన్నకి చేసిన అవమానాలు ఒక్కసారి కూడా గుర్తు రాలేదా అమ్మా అని ఏడుస్తాడు.
అమూల్య కూడా ఏడుస్తుంది. పాతికేళ్లగా వాళ్లు నా మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారని.. ప్రాణం కూడా తీయాలని చూస్తున్నారని తెలీదా అమ్మా.. చేతులారా ఈ నాన్న పరువు తీయాలని ఎలా అనుకున్నావమ్మా.. ఆడపిల్ల ఎదుగుతూ ఉంటే భయపడతారు కానీ నేను ఎప్పుడూ భయపడలేదు.. నా కూతురి మీద నాకు నమ్మకం కానీ నువ్వు కూడా నన్ను తగలబెట్టేశావు.. నేను గుండె పగిలి చచ్చేలా చేస్తావని అస్సలు ఊహించలేదమ్మా అని రామరాజు కూలబడిపోతాడు.
సాగర్, ధీరజ్ మాత్రం కోపంగా అనాల్సింది తనని కాదు వాడిని ట్రాప్ చేసిన వాడిని చంపేస్తామని ప్రేమ పుట్టింటికి వెళ్లి అడ్డు వచ్చిన వాళ్లని నెట్టేస్తూ విశ్వని ఈడ్చుకొని బయటకు వస్తారు. విశ్వ వాళ్ల ఇంట్లో అందరూ చాలా కంగారు పడతారు. ధీరజ్, సాగర్ విశ్వని బయటకు లాక్కొచ్చి కొడతారు. దాంతో ప్రేమ ఆపాలని చూసి విశ్వని కొట్టడానికి తప్పు మా అన్నయ్యది కాదు అమూల్యది అని అంటుంది. నీకు ఏం తెలీదు.. అని ధీరజ్ అంటే తప్పు మీ చెల్లి చేస్తే మా అన్నయ్యని చంపేస్తా అంటావేంట్రా అని అంటుంది. రామరాజు వచ్చి ఏంటమ్మా నా కూతురు తప్పు చేసిందా అని ప్రేమని అడుగుతాడు. దానికి ప్రేమ అవును మామయ్య మీరు ఒప్పుకున్నా లేకపోయినా తప్పు చేసింది అమూల్యనే. తనే ముందు మా అన్నయ్యకి ప్రపోజ్ చేసింది.. మా అన్నయ్య లేకపోతే చచ్చిపోతా అని చెప్పింది.. కావాలి అంటే అమూల్యని అడగండి అని అంటుంది.
రామరాజు కోపంగా బుజ్జమ్మా అని కేకేస్తాడు. దాంతో వేదవతి అమూల్యని లాక్కొచ్చి తప్పు నీదే అంటున్నారు.. సమాధానం చెప్పవే అని అడుగుతుంది. చెప్పవే అని కొట్టడానికి వేదవతి చేయి ఎత్తడంతో నేనే ప్రేమించాను అని అమూల్య చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఫ్లాష్‌బ్యాక్‌లో అమూల్యతో విశ్వ ఎప్పుడు మీ వాళ్లకి మన విషయం తెలిసినా నువ్వే నన్ను ప్రేమించావు అని చెప్పాలి అప్పుడే నన్ను ఏం అనరు.. అని అంటాడు. విశ్వ మాట ప్రకారం అమూల్య తన మీద నింద వేసుకుంటుంది. విశ్వ తప్పు ఏం లేదు.. నేనే ప్రేమించాను అని చెప్తుంది.
వేదవతి అమూల్యని మా పరువు తీసేశావే ఎందుకు ఇలా చేశావే అని కొడుతుంది. సేనాపతి రామరాజుతో ఓరేయ్ రామరాజు ఏం కూతుర్ని కన్నావురా తూ ఇదేరా నీ పెంపకం.. మగపిల్లల్ని పెంచడం చేతకాలేదు.. కనీసం ఆడపిల్లని కూడా పెంచలేకపోయావ్.. తూ.. ఊరు పేరు లేనోడివి.. తల్లిదండ్రులు ఎవరో తెలీని అనాథవి ఇప్పుడు అని నానా మాటలు అంటాడు. వీడో నాన్న మీరో కొడుకులు అని సాగర్ వాళ్లని అంటాడు. మీకు సిగ్గు సరం ఉంటే ఎక్కడైనా దూకి చావండ్రా అని నానా మాటలు అంటాడు. రామరాజు తల దించుకొని ఏడుస్తూ వెళ్లిపోతాడు.
భద్రావతి, విశ్వ ఇద్దరూ తమ ప్లాన్ వర్కౌట్ అయిందని రామరాజు ఏడ్వడం, తల దించుకోవడం చూసి చాలా సంతోషంగా ఉందని హ్యాపీగా నవ్వుకుంటారు. ఇప్పుటికే సగం వాడి గుండె పగిలిపోయింది.. ఇక అమూల్య మెడలో తాళి కట్టడమే ఉందని అంటాడు. ప్రేమ వాళ్లకి ఎదురు తిరుగుతుందని అనుకోరు.. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరూ ప్రేమతో మాట్లాడరు.. ఇదే అవకాశంగా చూసి ప్రేమని రెచ్చగొట్టి మన ఇంటికి తీసుకొచ్చేయాలి అని భద్రావతి విశ్వకి చెప్తుంది.
నర్మద కిచెన్‌లో వంట చేస్తుంటే ప్రేమ మాట్లాడటానికి వెళ్తుంది. అక్క నువ్వే నన్ను అర్థం చేసుకుంటావ్ ఈ విషయంలో నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు అందరిలాగే నువ్వు కోపంగా ఉన్నావ్ చాలా బాధగా ఉంది అక్క అని ప్రేమ చెప్తుంది. వల్లీ వెనక నుంచి మొత్తం చూస్తుంటుంది. ఇది మీ కుటుంబ విషయం నేను బయట దాన్ని నాకు మాట్లాడే హక్కు లేదు అని నర్మద అనేస్తుంది. ప్రేమ నర్మదకు అన్న మాటలు గుర్తు చేసుకొని సారీ చెప్తుంది. కొన్ని సార్లు మాట్లాడి బాధ పెట్టడం కంటే మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మంచిది అని నర్మద అనేస్తుంది. దాంతో ప్రేమ వెళ్లిపోతుంది. వల్లీ గెంతులేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















