Nindu Manasulu Serial Today August 25th: నిండు మనసులు సీరియల్: సవతి ఇంట్లో పని మనిషిగా ఇందు.. నిజం తెలుసుకున్న సిద్దూ.. రంజిత్ ఆగ్రహానికి కారణమేంటి?
Nindu Manasulu Serial Today Episode August 25th ప్రేరణ వల్లే సిద్ధూకి అవకాశం వచ్చిందని సిద్ధూకి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ఈశ్వరి రోడ్డు మీద సుధాకర్, ఇందిరల్ని చూస్తుంది. ఇద్దరినీ పిలిచి ఇందిరతో నీ ఫోన్ ఎందుకు పని చేయడం లేదు.. కాల్ చేస్తే అవ్వడం లేదు అని అంటుంది. సుధాకర్‌కి కాల్ చేసి అడిగితే ఊరెళ్లావని చెప్తాడని అంటుంది. ఇక ఇందిర ఈశ్వరికి ఫోన్ ఇచ్చి చూస్తే నెంబర్ బ్లాక్‌లో ఉందని అంటుంది.
ఇందిర తమ్ముడికి కోపంగా చూసి ఫోన్ వాడటం తెలీదు మేడం అనేస్తుంది. ఇక ఈశ్వరి ఇందిరను రేపటి నుంచి పనిలోకి రా అని చెప్తుంది. ఇందిర చాలా సంతోషపడుతుంది. తర్వాత తమ్ముడితో నీ పని చెప్తా ఆగురా అని వెంటపడుతుంది. కర్ర పట్టుకొని కొట్టడానికి వెళ్తుంది. నేను నా భర్త దగ్గరకు వెళ్లాలి అని ఆలోచించి కష్టపడి పని మనిషిని తప్పిస్తే నువ్వు నా ఫోన్‌లో ఆమె నెంబరు బ్లాక్ చేస్తావా అని అడుగుతుంది. మీ బావని అలాగే వదిలేయమని అంటావా బావని కాపాడుకోవద్దని అంటావా అని అడుగుతుంది. బావని నువ్వు కాపాడుతావే కానీ నిన్ను ఎవరు కాపాడుతారే అని అంటాడు. ఆగణకి నువ్వు పనిమనిషివి కాదు వాడు వెతుకుతున్న మనిషివి అని తెలిస్తే చంపేస్తాడే అంటాడు. ఏది ఏమైనా నేను ఆ ఇంటికి వెళ్లి తీరాలి అప్పుడే మీ బావ మామూలు మనిషి అవుతారు. మా మనిషి అవుతారు అని ఏడుస్తుంది.
విశ్వనాథం గారు ప్రేరణ, సిద్ధూలకు కోచింగ్ మొదలు పెడతారు. సివిల్స్ ఎందుకు చేయాలి అనుకున్నారు అని అడుగుతారు. ముందు సిద్ధూ లేచి సివిల్స్ గురించి చెప్పి తాను ఐపీఎస్ కావాలనుకుంటున్నానని దేశంలో ఎవరికీ లేని హక్కు బాధ్యత పోలీస్‌కి ఉందని.. తప్పు చేసిన వాళ్లని దండించాలి అన్నా తప్పు చేసి తప్పించుకోవాలన్నా పోలీసులకే సాధ్యమని.. అన్యాయాన్ని అరికట్టేది న్యాయాన్ని నిలబెట్టేది పోలీస్ అని తనకు ఖాకీ అంటే ఎనలేని అభిమానం అని చెప్తాడు. ఇక ప్రేరణ ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానని అది తన తండ్రి కల అని అంతే కాకుండా చాలా మంది హక్కులు నిలబెట్టాలని, పేదరిక నిర్మూలన లక్ష్యమని అంటుంది.
విశ్వనాథం రికమండేషన్ గురించి సిద్ధూతో మాట్లాడుతాడు. నాకు రికమండేషన్ నచ్చదు అని సిద్ధూఅంటాడు. దానికి విశ్వనాథం నువ్వు ఈ రోజు రికమండేషన్తోనే ఇక్కడ ఉన్నావని అంటే అని అంటారు. అర్థం కాలేదు అని సిద్ధూ అంటే ప్రేరణ తన మాట సాయంతో నిన్ను రికమండ్ చేసిందని ప్రేరణ మాటలే నన్ను ఆలోచించేలా చేసింది నీ టాలెంట్ బయట పడిందని అంటారు. సిద్ధూ అలా ఉండిపోతే మనీ సాయం మంచిది కాదు మాట సాయం మంచిదే అని అంటారు. ఇక ఇద్దరికీ క్లాస్‌లు మొదలు పెడతారు.
ఐశ్వర్య రంజిత్ ఎందుకు గదిలోకి రానివ్వడో తెలుసుకోవాలని రంజిత్ గదిలోకి వెళ్తుంది. గది మొత్తం చూస్తుంది. రంజిత్ బీరువాలో ఏం ఉందో తెలుసుకోవాలని దగ్గరకు వెళ్తుంది. ఇంతలో రంజిత్ వచ్చేస్తాడు. ఏయ్ అని కేక వేసి నువ్వేం అనుకుంటున్నావ్! నా పర్సనల్ ప్లేస్‌లోకి రావొద్దని చెప్పాను కదా అని అరిచి కోపంగా ఫ్లవర్ వాజ్ విసిరేసి అవుట్ అని అరుస్తాడు. ఐశ్వర్య పారిపోతుంది. సిద్ధూ ప్రేరణ దగ్గరకు వచ్చి డ్రాప్ చేస్తా అంటాడు. వద్దు అని ప్రేరణ అంటే ఇద్దరం కలిసి కోచింగ్ తీసుకుంటున్నాం కదా అని అంటాడు. దానికి ప్రేరణ కలిసి అని తీసేయ్ అని అంటుంది. మీరు నాకు చాలా సాయం చేశారు.. బదులు సాయం చేయాలని అనుకుంటున్నాన్ అంటాడు. నేను చేసిన సాయానికి థ్యాంక్స్ కూడా తీసుకోవాలని అనుకోవడం అంటుంది. నువ్వు అవును అన్నా కాదు అన్నా నేను నీ రుణం తీర్చుకుంటా అది ఫిక్స్ అని అంటాడు. అదెలా సాధ్యం అని ప్రేరణ అంటే ఇప్పుడే కదా తెలిసింది.. ఇప్పుడే కదా మన జర్నీ షార్ట్ అయింది అని అంటాడు. ప్రేరణ వింతగా చూస్తుంది. ఇంతలో ఆటో రావడంతో వెళ్లిపోతుంది.
ఐశ్వర్య చాలా టెన్షన్ పడుతుంది. ప్రేరణ ఇంటికి వచ్చి ఐశ్వర్యని చూసి ఏమైందని అడుగుతుంది. రంజిత్ గదిలోకి వెళ్లానని చెప్తుంది. రంజిత్ కోపంతో ఊగిపోయాడని చెప్తుంది. ప్రేరణ షాక్ అయిపోతుంది. ఎంత పని చేశావ్ ఎందుకు వెళ్లావ్ అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















